హోమ్ /వార్తలు /అంతర్జాతీయం /

Srilanka Blasts : కొలంబో ఎయిర్‌పోర్టులో బాంబును నిర్వీర్యం చేసిన ఎయిర్‌ఫోర్స్

Srilanka Blasts : కొలంబో ఎయిర్‌పోర్టులో బాంబును నిర్వీర్యం చేసిన ఎయిర్‌ఫోర్స్

శ్రీలంకలో బాంబు పేలుళ్లు జరిగిన ఓ ప్రాంతంలో చిత్రం(File)

శ్రీలంకలో బాంబు పేలుళ్లు జరిగిన ఓ ప్రాంతంలో చిత్రం(File)

Srilanka Blasts : శ్రీలంక పేలుళ్లలో మృతుల సంఖ్య 262కి పెరిగింది. 600 పైచిలుకు మంది తీవ్రంగా గాయపడ్డారు. కొలంబోలోని మూడు ప్రముఖ హోటల్స్‌తో పాటు పలు చర్చిల్లో పేలుళ్లు జరిగాయి.

    శ్రీలంకలో పేలుళ్లు ఆ దేశ ప్రజలను బిక్కుబిక్కుమని గడిపేలా చేశాయి. ఎప్పుడు ఎక్కడ మళ్లీ బాంబు దాడులు జరుగుతాయోనన్న భయం వారిని వెంటాడుతోంది. తాజాగా కొలంబోలోని ప్రధాన విమానాశ్రయంలో శ్రీలంకన్ ఎయిర్‌ఫోర్స్ అధికారులు ఒక బాంబును నిర్వీర్వం చేశారు. విమానశ్రయం మెయిన్ టెర్మినల్‌కు దారితీసే రోడ్డులో 'పైప్ బాంబ్'ను గుర్తించి నిర్వీర్యం చేసినట్టు ఎయిర్‌ఫోర్స్ కెప్టెన్ గిహన్ సెనెవిరత్నే వెల్లడించారు. శ్రీలంకలోని 8 చోట్లు పేలుళ్లు సంభవించిన 8గంటల అనంతరం కొలంబో ఎయిర్‌పోర్టులో బాంబును నిర్వీర్యం చేయడం గమనార్హం.


    కాగా, శ్రీలంక పేలుళ్లలో మృతుల సంఖ్య 262కి పెరిగింది. 600 పైచిలుకు మంది తీవ్రంగా గాయపడ్డారు. కొలంబోలోని మూడు ప్రముఖ హోటల్స్‌తో పాటు పలు చర్చిల్లో పేలుళ్లు జరిగాయి. సిన్నమాన్ గ్రాండ్ హోటల్, షాంగ్రీ-లా, సెయింట్ ఆంథోని, సెయింట్ సెబాస్టియన్, జియోన్ చర్చిల్లో పేలుళ్లు జరిగాయి. మృతుల్లో 35మంది విదేశీయులు ఉండగా.. అందులో ముగ్గురు భారతీయులు, ఇద్దరు టర్కీ వారు, డెన్మార్క్, పోర్చుగీసు, చైనీస్, అమెరికన్లు ఉన్నారు.

    First published:

    Tags: Columbo Bomb Blast, Sri Lanka, Terror attack, Terrorism

    ఉత్తమ కథలు