ప్రేమ ఎల్లలు దాటిన... ప్రేమికుడు మాత్రం జైల్లోనే...

ఈ కథలో పోలీసులే ఆపద్బాంధవులు కానీ తర్వాత వాళ్లే లవ్ స్టోరీకి అడ్డంగా మారారు. అజీమ్ కోసం నసీర్ దేశాలు దాటి ఎలా వచ్చిందని ఆరా తీస్తే చట్ట ఉల్లంఘనలు బయటకు వచ్చాయి.

news18-telugu
Updated: July 2, 2019, 2:14 PM IST
ప్రేమ ఎల్లలు దాటిన... ప్రేమికుడు మాత్రం జైల్లోనే...
జైల్లో అజీముద్దీన్
  • Share this:
అమ్మాయిదే సౌదీ అరేబియా.. అబ్బాయిది ఇండియా. దేశాలు వేరైనా ఇద్దరి మతాలు ఒక్కటే. ప్రేమించుకున్నారు. పెద్దల్ని ఎదరించి పెళ్లి కూడా చేసుకున్నారు. ఆస్తిపాస్తుల‌ను కాద‌ని, ఏల్లాలు దాటి పోలీసు కేసుల‌ను ఎదుర్కోని ఇండియాలో పెళ్లి చేసుకోని ఒక్క‌ట‌య్యారు.. కానీ ఆస‌లు క‌థ ఇక్క‌డే మొద‌లైంది.. ప్రేమకు పెద్దలు అడ్డు కాకపోవచ్చు.. కానీ దేశాల మధ్య రూల్స్ ఒప్పుకోవంటూ పోలీసులు అడ్డం తిరిగారు. దీంతో ప్రియుడి కోసం వేల కిలోమీటర్ల దూరం నుంచి వచ్చిన ప్రేయసి 20 రోజుల పాటు జైలు జీవితం గ‌డిపి బ‌య‌ట ప‌డింది.. అంత బాగుంది అనేసరికి.. ఈ అందమైన ప్రేమకథలో అమ్మాయి తండ్రి విలన్‌ రోల్ ప్లే చేశఆడు. సౌది నుంచి కూతురు, అల్లుడు తన ఇంటికి రావాలంటూ... కపట ప్రేమ నటించి వీసా పంపాడు. ఇవన్నీ గుడ్డిగా నమ్మిన ఆ జంట సౌది చేరుకుంది. జెడ్డా ఎయిర్ పోర్టు చేరుకోగానే.. అల్లున్ని అరెస్టు చేసి జైల్ లో పెట్టించాడు. దీంతో జైల్ పాలైన త‌న కోడుకుని ఇండియాకు రప్పించాలంటూ అతని కుటుంబం ప్ర‌భుత్వాన్ని కోరుతుంది.


నిజామాబాద్ జిల్లాకు చెందిన షేక్ అజీముద్దీన్ బతుకుతెరువు కోసం కోసం సౌది అరేబియ‌ వెళ్లాడు.. సౌదిలో డ్రైవ‌ర్ గా ఉద్యోగం చేసుకుంటు జీవ‌నం సాగిస్తున్నాడు.అయితే యాజ‌మాని కుతురు నాస‌ర్‌తో ప్రేమ‌లో ప‌డ్డాడు. విష‌యం తెలిసినా నసీర్ తండ్రి ఉద్యోగం నుంచి తోల‌గించి ఇండియాకు పంపించాడు. దీంతో నసీర్ సౌది నుంచి నేపాల్ మిదుగా డిల్లీకి చేరుకుంది. అజీముద్దీన్ కు ఫోన్ చేసి విష‌యం చెప్ప‌డంతో ఢిల్లీ వెళ్లి నిజామాబాద్ కు తీసుకు వ‌చ్చాడు. నిజామాబాద్ లో వాళ్లిద్దరూ పెళ్లి చేసుకున్న విష‌యం ఆమె తండ్రికి తెలిసిది. ఇండియా వచ్చి ఇక్కడి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.. అయితే ఇద్దరు మేజర్లని పరస్పర అంగీకారంతో పెళ్లి చేసుకున్నారని పోలీసుల కౌన్సిలింగ్ లో తేలడంతో అమ్మాయి తండ్రిని వెనక్కి పంపించేశారు. ఈ కథలో పోలీసులే ఆపద్బాంధవులు కానీ తర్వాత వాళ్లే లవ్ స్టోరీకి అడ్డంగా మారారు. అజీమ్ కోసం నసీర్ దేశాలు దాటి ఎలా వచ్చిందని ఆరా తీస్తే చట్ట ఉల్లంఘనలు బయటకు వచ్చాయి.

అజీం కోసం నసీర్ చాలా రిస్క్ చేసింది. ఆమెకు ఇండియా రావడానికి వీసా లేదు. విజిట్ వీసాతో నేపాల్ వరకు వచ్చి అక్రమ మార్గంలో భారత్ చేరింది. ఢిల్లీ నుంచి నసీర్‌ను అజీం తీసుకువచ్చి సొంతూరులో పెళ్లి చేసుకున్నాడు. ప్రేమను ఒప్పుకున్న పోలీసులు రూల్స్ విషయంలో మాత్రం ఏం చేయలేమని చేతులెత్తేశారు. ప్రేమ కోసం అక్రమమార్గంలో దేశంలోకి వ‌చ్చిన‌ ప్రియురాలిని అరెస్టు చేసి 20 రోజుల పాటు రిమాండ్ ఖైదీగా జైల్లో పెట్టారు. ఆ త‌రువాత కేసు క్లోజ్ చేసి ఆమెకు ఇండియ గ‌వ‌ర్న‌మెంట్ ప‌ర్మిష‌న్ ఇచ్చింది. దీంతో అంత సుఖాంత మైంది ఆ తర్వాత నసీర్ గర్భవతి అయ్యింది. ఈ విష‌యం తెసుకున్నా అమ్మ‌యి తండ్రి సౌది నుంచి ఫోన్ చేసి ఇద్ద‌రు సౌది రావాల‌ని కోరాడు. దీంతో అజీముద్దీన్, న‌జీర్ ఇద్ద‌రు వారి మాటలు న‌మ్మి నసీర్ తండ్రి ఇద్ద‌రికి విసాలు పంపించడంతో సౌదీ వెళ్లారు. 19 ఏప్రిల్ 2019న సౌదికి వెళ్లారు. అక్కడ జెద్దా ఎయిర్ పోర్టుకు చేరుకోగానే... అజీముద్దీన్ ను అరెస్టు చేసి జైలుకు త‌ర‌లించారు.

ఆడపిల్లకు జన్మనిచ్చిన నసీర్


ముస్లీం మ‌త ప‌ద్ద‌తి ప్ర‌కారం పెళ్లి చేసుకుంటే అమ్మ‌యి తండ్రి ఉండాల‌నే నిబంధన ఉంది. అయితే వీరిద్ద‌రు పెళ్లి చేసుకున్న‌ప్పుడు తండ్రి లేడు.. కాబ‌ట్టి ఈ పెళ్లి చేల్ల‌ద‌ని కేసుపెట్టి నసీర్ తండ్రి కేసు బెట్టి అజీమ్‌ను జైలుకు పంపాడు. నా బిడ్డ‌కు విడాకులు ఇవ్వాలని అజీమ్‌ను వేధిస్తున్నాడు. మరోవైపు గర్భవతి అయిన నసీర్ ఆడపిల్లకు జన్మనిచ్చింది. ఈ విష‌యం తెలిసిన అజీమ్ తల్లి త‌న కోడుకు, కోడ‌లితో పాటు మనవరాలిని స్వదేశానికి ర‌ప్పించాల‌ని భార‌త ప్ర‌భుత్వాన్ని, రాష్ట్ర ప్ర‌భుత్వాన్ని వేడుకుంటుంది.పి.మ‌హేంద‌ర్, న్యూస్ 18తెలుగు, ప్ర‌తినిది..
Published by: Sulthana Begum Shaik
First published: July 2, 2019, 2:14 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading