• HOME
  • »
  • NEWS
  • »
  • INTERNATIONAL
  • »
  • IF US DOES NOT KEEP ITS PROMISE NORTH KOREAS KIM JONG BEGINS NEW YEAR WITH A THREAT

మాట నిలబెట్టుకోకపోతే మా పద్ధతి మారుతుంది... అమెరికాకు కిమ్ వార్నింగ్

మాట నిలబెట్టుకోకపోతే మా పద్ధతి మారుతుంది... అమెరికాకు కిమ్ వార్నింగ్

మాట నిలబెట్టుకోకపోతే మా పద్ధతి మారుతుంది... అమెరికాకు కిమ్ వార్నింగ్(File Photo)

గతేడాది జూన్‌లో సింగపూర్‌లో నిర్వహించిన శిఖరాగ్ర సమావేశంలో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ అణునిరాయుధీకరణ ఒప్పందంపై సంతకాలు చేశారు. కానీ ఆ తర్వాత నుంచి రెండు దేశాల మధ్య ప్రతిష్టంభన కొనసాగుతోంది.

  • Share this:
    ఓవైపు ప్రపంచమంతా కొత్త సంవత్సర వేడుకల్లో మునిగితేలుతుంటే... అమెరికాకు గట్టి షాక్ ఇచ్చారు ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్. అమెరికాతో మంచి సంబంధాలను ఉత్తర కొరియా కోరుకుంటోందని, అణునిరాయుధీకరణపై ఇచ్చిన మాటను అమెరికా నిలబెట్టుకోక పోతే తాము తమ విధానాలను మార్చుకోవాల్సి వస్తుందని న్యూ ఇయర్ స్పీచ్‌లో యూఎస్‌కు వార్నింగ్ ఇచ్చారు కిమ్. గతేడాది జూన్‌లో సింగపూర్‌లో నిర్వహించిన శిఖరాగ్ర సమావేశంలో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ అణునిరాయుధీకరణ ఒప్పందంపై సంతకాలు చేశారు. కానీ ఆ తర్వాత నుంచి రెండు దేశాల మధ్య ప్రతిష్టంభన కొనసాగుతోంది.

    ప్రపంచం ముందు ఇచ్చిన మాటను అమెరికా నిలుపుకోకుండా మా దేశంపై ఆంక్షలు, ఒత్తిళ్లు కొనసాగిస్తే... మా ప్రయోజనాలను, సార్వభౌమత్వాన్ని కాపాడుకునేందుకు కొత్త మార్గాన్ని అనుసరించడం తప్ప మా ముందు వేరే మార్గం లేదు.
    కిమ్ జోంగ్ ఉన్, ఉత్తర కొరియా అధినేత


    అంతర్జాతీయ సమాజం స్వాగతించే ఫలితం కోసం ట్రంప్‌ను ఎప్పుడైనా కలుసుకునేందుకు తాను సిద్ధంగా ఉన్నానని తేల్చి చెప్పారు కిమ్. తమ దేశంపై ఆంక్షలు తొలగించాలని ఉత్తర కొరియా డిమాండ్ చేస్తోంది. అయితే పూర్తిగా అణునిరాయుధీకరణ చేయాల్సిందేనని అమెరికా పట్టుబడుతోంది. దీంతో ఇరు దేశాల మధ్య ప్రతిష్టంభన కొనసాగుతోంది.

    ఇవి కూడా చదవండి:

    2019లో ట్యాక్స్ సేవింగ్ ఐడియాలు ఇవే... ఇప్పుడే జాగ్రత్తపడండి

    2018లో మారిన పర్సనల్ ట్యాక్స్ రూల్స్ ఇవే... తెలుసుకోండి

    IRCTC వెబ్‌సైట్ మారింది... కొత్త ఫీచర్లు ఇవే

    మ్యూచువల్ ఫండ్ తీసుకుంటున్నారా? ఈ 5 అంశాలు పరిశీలించండి

    Published by:Santhosh Kumar S
    First published: