ముషారఫ్ చనిపోతే శవాన్ని 3 రోజులు ఉరితీయండి... పాక్ కోర్టు సంచలన తీర్పు...

‘ఒకవేళ దోషి శవం దొరికితే, దాన్ని ఇస్లామాబాద్‌లోని డీ చౌక్‌కు ఈడ్చుకొచ్చి మూడు రోజుల పాటు ఆ శవాన్నే ఉరితీయాలి’ అని కోర్టు తీర్పులో పేర్కొంది.

news18-telugu
Updated: December 19, 2019, 5:51 PM IST
ముషారఫ్ చనిపోతే శవాన్ని 3 రోజులు ఉరితీయండి... పాక్ కోర్టు సంచలన తీర్పు...
పర్వేజ్ ముషారఫ్( ఫైల్ ఫోటో)
  • Share this:
పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్‌ను ఉరితీయాలంటూ సంచలన తీర్పుచెప్పింది స్థానిక కోర్టు. అయితే, ఈ తీర్పునకు సంబంధించిన పూర్తి కాపీ తాజాగా బయటకు వచ్చింది. అందులో ఉన్న విషయాలు ముషారఫ్‌ను మరింత భయపెడుతున్నాయి. ముషారఫ్ మీద ఆరోపణలను త్రిసభ్య ధర్మాసనం విచారించింది. అందులో ఇద్దరు ముషారఫ్‌ను దోషిగా తేల్చారు. మరో జడ్జి దాంతో విబేధించారు. ఆ జడ్జిలు 167 పేజీల తీర్పు ప్రతిని అందించారు. అందులో కోర్టు పాయింట్ల వారీగా వివరాలను చెప్పింది. 65, 66 పాయింట్‌లో కోర్టు కీలక పాయింట్‌ను సూచించింది. ‘నిందితుడి మీద మోపిన ఆరోపణల ప్రకారం ముషారఫ్‌ దోషి. దోషిని చనిపోయే వరకు ఉరితీయాలి. పరారీలో ఉన్న దోషిని పట్టుకుని తీసుకురావాల్సిందిగా సంబంధిత శాఖలను కోర్టు ఆదేశిస్తుంది. ఒకవేళ దోషి శవం దొరికితే, దాన్ని ఇస్లామాబాద్‌లోని డీ చౌక్‌కు ఈడ్చుకొచ్చి మూడు రోజుల పాటు ఆ శవాన్నే ఉరితీయాలి’ అని కోర్టు తీర్పులో పేర్కొంది.
Published by: Ashok Kumar Bonepalli
First published: December 19, 2019, 5:50 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading