హోమ్ /వార్తలు /అంతర్జాతీయం /

పర్ సపోజ్.. భూమ్మీద జనం అంతా ఒకేసారి చచ్చిపోతే.. మళ్లీ మనుషుల్ని పుట్టించే ఐడియా వీళ్ల దగ్గర ఒకటుంది.. ఆ క్రియేటివ్ ఐడియా ఏంటంటే..

పర్ సపోజ్.. భూమ్మీద జనం అంతా ఒకేసారి చచ్చిపోతే.. మళ్లీ మనుషుల్ని పుట్టించే ఐడియా వీళ్ల దగ్గర ఒకటుంది.. ఆ క్రియేటివ్ ఐడియా ఏంటంటే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఓ యూఎస్-కంపెనీ వ్యవస్థాపకుడు ఉల్క దాడిని తిప్పికొట్టేందుకు హ్యూమన్ సీడ్ బ్యాంక్ కూడా ఓ సొల్యూషన్ అని చెబుతున్నారు. ఈ ఆలోచన అత్యంత వినూత్నమైనదిగా, విచిత్రమైనది నిలుస్తోంది.

భవిష్యత్తులో ఏదో ఒక భారీ గ్రహశకలం లేదా ఉల్క (Asteroid) వచ్చి భూమిని ఢీకొట్టి విధ్వంసం సృష్టించవచ్చనే అనుమానాలు శాస్త్రవేత్తల్లో ఉన్నాయి. ఒకవేళ నిజంగానే ఉల్క దాడి జరిగి భూమి పూర్తిగా తుడిచిపెట్టుకుపోతే మానవ జాతి కచ్చితంగా అంతరిస్తుందని కూడా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇది జరగకుండా ఉండేందుకు కొన్నేళ్లుగా శాస్త్రవేత్తలు ఉల్క దాడిని ఎదుర్కోవడానికి వివిధ మార్గాలను అన్వేషిస్తున్నారు. నాసా (NASA) గ్రహశకలాలను నాశనం చేయడానికి అణ్వాయుధాలు షూట్ చేయాలని భావిస్తుండగా... రాకెట్ బూస్టర్‌లను ఉపయోగించి గ్రహశకలాన్ని దారి మళ్లించే యోచనలో చైనా ఉంది. ఇంకా ఇలాంటి ప్లాన్స్ చాలా ఉన్నాయి. అయితే తాజాగా ఓ యూఎస్-కంపెనీ వ్యవస్థాపకుడు ఉల్క దాడిని తిప్పికొట్టేందుకు హ్యూమన్ సీడ్ బ్యాంక్ కూడా ఓ సొల్యూషన్ అని చెబుతున్నారు. ఈ ఆలోచన అత్యంత వినూత్నమైనదిగా, విచిత్రమైనది నిలుస్తోంది.

మానవ సీడ్ బ్యాంక్ ఏర్పాటు (Human seed bank)

అమెరికన్ పారిశ్రామికవేత్త, ఇంజనీర్ బెన్ హాల్డెమాన్ (Ben Haldeman) లైఫ్‌షిప్ (Lifeship) అనే ఓ స్టార్టప్ స్థాపించారు. దీనిని కేవలం ఒక మిషన్ కోసం మాత్రమే స్థాపించారు. అదే హ్యూమన్ సీడ్ బ్యాంకు (Human Seed Bank)ను సృష్టించడం. ఇంకా సరళంగా చెప్పాలంటే ఇది మానవ డీఎన్ఏ (DNA)ను సేకరించి అన్ని ప్రదేశాలలోనూ స్టోర్ చేస్తుంది! చంద్రుడిపై కూడా డీఎన్ఏ బ్యాంకును తీసుకెళ్తుంది! ఇది భూమి ఎప్పుడైనా ఒక గ్రహశకలం ద్వారా తుడిచిపెట్టుకుపోయినట్లయితే మానవ జాతిని సృష్టించి మానవ నాగరికతను మళ్లీ ప్రారంభించడానికి హెల్ప్ చేస్తుంది. ఉల్క దాడి తర్వాత కూడా, హ్యూమన్ సీడ్ బ్యాంకు మానవాళిని కాపాడుతుంది.

Fish Pram: ఇకపై చేపలు కూడా రోడ్లపై తిరుగుతాయి.. వాకింగ్‌కు వెళ్తాయి.. నమ్మరా? మీరే చూడండి


హ్యూమన్ సీడ్ బ్యాంక్ ఎలా సృష్టిస్తారు?

అంతరిక్షంలో హ్యూమన్ రిపోజిటరీ లేదా మానవ జీవ పదార్థాన్ని సృష్టించేందుకు 2019లో లైఫ్‌షిప్‌ కంపెనీని హాల్డెమాన్ స్థాపించారు. ఈ కంపెనీ లాలాజలం (Saliva) రూపంలో ప్రజల డీఎన్ఏను చంద్రుని మీదకు తీసుకువెళుతుంది. తద్వారా మానవజాతి మళ్లీ పుట్టడం సాధ్యమవుతుంది. సైంటిఫిక్ వ్యూలో చూస్తే దీని అర్థం హ్యూమన్ డేటా, కోర్ హ్యూమన్ ఎగ్జిస్టెన్స్ సౌర వ్యవస్థలోని వివిధ ప్రాంతాల్లో ఎప్పటికీ భద్రపరచడం అలానే విస్తరించడం. పౌర వ్యవస్థతో పాటు సాధ్యమైతే ఇతర ప్రాంతాల్లో కూడా హ్యూమన్ ఎగ్జిస్టెన్స్ ని స్టోర్ చేయాలని లైఫ్‌షిప్‌ కంపెనీ భావిస్తోంది.

తగ్గేదేలే.. 60 ఏళ్ల వయసులో యూట్యూబ్‌ను షేక్‌ చేస్తున్న అవ్వ..! దీంట్లో కూడా ఓ అద్భుతమైన సెంటిమెంట్

కస్టమర్ కోణం నుంచి చేస్తే దీనికి ఒక సెంటిమెంట్ అప్పీల్ ఉంటుంది. డీఎన్ఏ శాంపిల్స్ ఇవ్వాలనుకునే ప్రజలు చాలా సెంటిమెంట్ కలిగి ఉంటారు. చంద్రుడిని చూసినప్పుడు, తాము అక్కడ కూడా ఉన్నట్లు, తమ పిల్లలకు తమ కాంతి ఎల్లప్పుడూ మార్గనిర్దేశం చేస్తున్నట్లు భావిస్తారు. ఆ కోణంలో వీరు తన శాంపిల్స్ ఇచ్చే అవకాశం ఉంది. అయితే ఈ కారణాలే కాకుండా, ఈ హ్యూమన్ సీడ్ బ్యాంకు వెంచర్ భూమిపై గ్రహశకలం దాడి చేసినట్లయితే మానవాళి మనుగడకు ఒక మార్గాన్ని కూడా అందిస్తుంది.

పెళ్లి బరాత్‌లో బిజీగా ఉన్న పెళ్లికొడుకు.. వేరొకడ్ని పెళ్లి చేసుకున్న వధువు

ఒకవేళ మనుషులు పూర్తిగా అంతరించినా భూలోకేతర జాతి పునఃసృష్టి చేసే అవకాశం

మానవ డీఎన్ఏ అంతరిక్షంలో జీవించి ఉంటే, ఏదో ఒక సమయంలో, ఒక భూలోకేతర జాతి (Extraterrestrial Species) దానిలోని హ్యూమన్ సోర్స్ కోడ్‌ని ఉపయోగించి మానవ జాతులను మళ్లీ పుట్టించడానికి ప్రయత్నించవచ్చని బెన్ హాల్డెమాన్ అంటున్నారు. ఇప్పటి వరకు, లైఫ్‌షిప్ తన మొదటి పేలోడ్‌ను అంతరిక్షంలోకి తీసుకెళ్లలేదు కానీ దాని మూన్ 1 మిషన్ 2022 మధ్యలో టేకాఫ్ కానుంది. ఈ కంపెనీ వెబ్‌సైట్ తమ మిషన్ కోసం బోర్డింగ్ క్లోజ్ అయ్యిందని పేర్కొంది. దీనర్థం ఆ పర్యటన కోసం ఇకపై డీఎన్ఏ నమూనాలు కంపెనీ తీసుకోదు. అయితే, వారు ఈ సంవత్సరం చివరిలో చంద్రునికి రెండవ మిషన్ కోసం మరిన్ని శాంపిల్స్ ఆహ్వానిస్తున్నారు. స్టార్టప్ దాని షిప్‌మెంట్‌ను అమలు చేయడానికి స్పేస్ఎక్స్ లాంచ్ వెహికల్స్, లూనార్ ల్యాండర్‌లను ఉపయోగిస్తోంది. ఏదేమైనా మానవ జాతి అంతరించిపోకుండా ఉండాలని చేస్తున్న కృషి ఈ అమెరికన్ ఇంజనీర్ ప్రపంచం నలుమూలల నుంచి చాలామంది ప్రశంసిస్తున్నారు.

First published:

Tags: Earth, NASA

ఉత్తమ కథలు