హోమ్ /వార్తలు /అంతర్జాతీయం /

పిల్లలు తప్పులు చేస్తే వారి తల్లిదండ్రులకు శిక్ష.. కొత్త చట్టం తీసుకురానున్న పొరుగు దేశం..

పిల్లలు తప్పులు చేస్తే వారి తల్లిదండ్రులకు శిక్ష.. కొత్త చట్టం తీసుకురానున్న పొరుగు దేశం..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

పిల్లలు చెడుగా ప్రవర్తించినా లేదా నేరాలకు పాల్పడినా వారి తల్లిదండ్రులను శిక్షించాలని డ్రాగన్ దేశం భావిస్తోంది. ఈ మేరకు ఓ చట్టాన్ని చైనా పార్లమెంట్ పరిశీలిస్తోంది.

తమ దేశ ప్రజలపై కఠినమైన చట్టాలను రుద్దుతోంది చైనా. ముఖ్యంగా చిన్నపిల్లల విషయంలో చైనా (China) చేసుకుంటున్న కొన్ని సంచలనాత్మక నిర్ణయాలు యావత్ ప్రపంచాన్ని నివ్వెరపోయేలా చేస్తున్నాయి. మొన్నీమధ్య తల్లిదండ్రులపై వన్ చైల్డ్ పాలసీ తీసుకొచ్చిన ఆ దేశం.. ఇప్పుడు మరో చట్టాన్ని పరిశీలిస్తోంది. పిల్లలు (Children) చెడుగా ప్రవర్తించినా లేదా నేరాలకు పాల్పడినా వారి తల్లిదండ్రులను శిక్షించాలని డ్రాగన్ దేశం భావిస్తోంది. ఈ మేరకు ఓ చట్టాన్ని చైనా పార్లమెంట్ పరిశీలిస్తోంది. ఇప్పటికే దీనికి సంబంధించి ‘ఫ్యామిలీ ఎడ్యుకేషన్ ప్రమోషన్ లా’ పేరుతో ఒక ముసాయిదా బిల్లును రూపొందించారు.

చైనా పార్లమెంటు ఈ వారంలో ఈ బిల్లుకు ఆమోదం తెలిపే అవకాశం ఉందని తెలుస్తోంది. ఒకవేళ బిల్లు (Bill) పాసయితే తప్పు చేసిన పిల్లల తల్లిదండ్రులు ఫ్యామిలీ ఎడ్యుకేషన్ ప్రమోషన్ లా కింద శిక్షార్హులవుతారు. తల్లిదండ్రులు లేదా సంరక్షకుల సంరక్షణలో ఉన్న పిల్లల్లో చెడు, నేరపూరిత ప్రవర్తన ఉన్నట్లు ప్రాసిక్యూటర్లు గుర్తిస్తే.. పిల్లల తల్లిదండ్రులను గట్టిగా మందలిస్తారు. అంతేకాదు, ఫ్యామిలీ ఎడ్యుకేషన్ గైడెన్స్ ప్రోగ్రాంలో పాల్గొనాల్సిందిగా ఆదేశిస్తారు.

"కౌమారదశలో ఉన్నవారు తప్పుగా ప్రవర్తించడానికి అనేక కారణాలు ఉన్నాయి. ప్రధానంగా తల్లిదండ్రుల్లో ఫ్యామిలీ ఎడ్యుకేషన్ పై అవగాహన లేకపోవడం వల్ల పిల్లలు తప్పుడు ప్రవర్తనను అలవర్చుకుంటున్నారు" అని నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్ (NPC)కు చెందిన శాసన వ్యవహారాల కమిషన్ ప్రతినిధి జాంగ్ టైవే పేర్కొన్నారు.

ఈ వారం స్టాండింగ్ కమిటీ సెషన్‌లో నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్ (NPC) సభ్యులు 'ఫ్యామిలీ ఎడ్యుకేషన్ ప్రమోషన్ లా' ముసాయిదాను సమీక్షించనున్నారు. ఈ ముసాయిదా బిల్లు పిల్లలు విశ్రాంతి తీసుకోవడానికి, ఆడుకోవడానికి, వ్యాయామం చేయడానికి సమయాన్ని కేటాయించాలని కూడా తల్లిదండ్రులకు సూచిస్తోంది.

చైనీస్ యువత ఆన్‌లైన్ గేమ్స్ కు బానిసలు అవుతుండడంతో చైనా ఈ ఏడాది కఠినమైన విధివిధానాలు తీసుకొచ్చింది. అలాగే ఇంటర్నెట్ సెలబ్రిటీల పట్ల గుడ్డిగా భక్తి పెంచుకోకుండా యువతను అరికట్టేందుకు తల్లిదండ్రుల అస్త్రాన్ని ప్రయోగించింది. ఇటీవల విద్యా మంత్రిత్వ శాఖ మైనర్ల ఆన్లైన్ ఆటల పరిమితి పై ఆంక్షలు విధించింది. శుక్రవారం, శనివారం, ఆదివారం మాత్రమే ఒక గంట పాటు ఆన్‌లైన్ గేమ్‌లు ఆడటానికి అనుమతించింది. అలాగే హోంవర్క్‌ను తగ్గించింది. వారాంతంలో, సెలవు దినాలలో ప్రధాన సబ్జెక్టులకు క్లాసుల తర్వాత ట్యూటరింగ్‌ను నిషేధించింది.

Revanth Reddy: ఆ సీనియర్ నేతతో టీఆర్ఎస్, బీజేపీలకు చెక్.. రేవంత్ రెడ్డి ప్లాన్ ?

Avoid Diabetes: డయాబెటిస్ రావొద్దని కోరుకుంటున్నారా ? అయితే ఈ 5 సూత్రాలు పాటించండి..

అలాగే చైనా యువకులు తక్కువ "ఫెమినిజం" ఎక్కువ పురుష భావజాలం ఉండాలని చైనా విజ్ఞప్తి చేస్తోంది. కౌమారదశలో ఉన్న అబ్బాయిల్లో ఫెమినిజాన్ని తగ్గించే ప్రతిపాదనలకు చైనా ఇప్పటికే మార్గదర్శకాలను జారీచేసింది. అలాగే, ఫుట్ బాల్ వంటి క్యాంపస్ క్రీడలను ప్రోత్సహించాలని స్పష్టం చేసింది.

Published by:Kishore Akkaladevi
First published:

Tags: China

ఉత్తమ కథలు