గిన్నీస్ బుక్ రికార్డ్... 70 ద్రాక్ష పండ్లను అడ్డంగా నరికేసి...

Guinness record : ఫ్రూట్ నింజా ఆటలో... పండ్లను కసాబిసా కట్ చేసినట్లుగా... రియల్ లైఫ్‌లో... ద్రాక్ష పండ్లను కత్తితో కట్ చేసి.. గిన్నీస్ బుక్ రికార్డ్ నమోదుచేశాడు ఇడాహో యువకుడు. ఆ రికార్డు విశేషాలు తెలుసుకుందాం.

Krishna Kumar N | news18-telugu
Updated: October 1, 2019, 11:56 AM IST
గిన్నీస్ బుక్ రికార్డ్... 70 ద్రాక్ష పండ్లను అడ్డంగా నరికేసి...
గిన్నీస్ బుక్ రికార్డ్... 70 ద్రాక్ష పండ్లను అడ్డంగా నరికేసి... (Credit - YT - David Rush)
  • Share this:
Guinness World record : గాలిలో ఎగురుతూ వస్తున్న ద్రాక్ష పండ్లను కత్తితో కసాబిసా కట్ చెయ్యడం చాలా కష్టం. అలాంటిది... బ్యాలెన్స్ బోర్డుపై నిల్చొని... అటూ ఇటూ పడిపోతూ కూడా... ద్రాక్షపండ్లను కట్ చెయ్యాలంటే మాటలా. ఇలాంటి అతి కష్టమైన ఫీట్‌ని చేసి చూపించాడు అమెరికా... ఇడాహో కుర్రాడు డేవిడ్ రష్. జస్ట్ నిమిషంలో అతను 70 ద్రాక్ష పండ్లను కత్తితో కట్ చేశాడు. ఇందుకోసం అతను వాడింది మనం ఇళ్లలో కూరగాయలు కట్ చెయ్యడానికి వాడిన చాకు కాదు. జపాన్‌లో సమురాయ్‌లు వాడిన ఖడ్గం. ఈ కత్తిని పట్టుకోవడానికీ, తిన్నగా కట్ చెయ్యడానికి అనువుగా ఉంటుంది. శతాబ్దాల కిందట సమురాయ్‌లు ఇలాంటి కత్తులతో... శత్రువుల అంతుచూసేవారు... అందుకే ఈ కత్తిని ఉపయోగించి డేవిడ్ రష్ రెచ్చిపోయాడు. తనవైపు దూసుకొస్తున్న ద్రాక్ష పండ్లను చకచకా కట్ చేసేశాడు.

డేవిడ్ రష్... ఇదివరకు స్విస్ బాల్‌పై నిల్చొని... కివి పండ్లను కట్ చేశాడు. సరే... కివీ పండ్లు కాస్త పెద్దవే ఉంటాయి కాబ్టటి కట్ చెయ్యడం తేలికే కావచ్చు. కానీ గ్రేప్స్ చాలా చిన్నగా ఉంటాయి కదా. అందువల్ల వాటిని కట్ చెయ్యడం చాలా కష్టం. అలాంటిది డేవిడ్ మాత్రం జస్ట్ 60 సెకండ్లలో 70 పండ్లను కట్ చేయడం గ్రేటే కదా.ఇప్పటివరకూ నిమిషానికి 18 ద్రాక్షపండ్లను మాత్రమే ఇలా నరికిన రికార్డ్ ఉంది. ఇప్పుడు... మొత్తం 114 ద్రాక్షలను గాలిలోకి విసరగా... డేవిడ్... 70 పండ్లను నరికినట్లుగా కిందపడిన ద్రాక్ష ముక్కల్ని బట్టీ స్పష్టమైంది. తద్వారా సరికొత్త గిన్నీస్ రికార్డ్ నమోదైంది.

First published: October 1, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు