news18-telugu
Updated: November 8, 2020, 9:44 PM IST
డొనాల్డ్ ట్రంప్
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ ఓడిపోయారు. డెమొక్రటిక్ అభ్యర్థి జో బైడెన్ గెలిచారు. దీంతో అమెరికా అధ్యక్షుడు నివసించే భవనం వైట్ హౌస్ నుంచి ట్రంప్ ఖాళీ చేయాల్సి ఉంటుంది. అమెరికా ఎన్నికల్లో ట్రంప్ ఓటమి తర్వాత ఆయనకు సంబంధించిన పలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ట్రంప్ మీద జోకులు వేస్తూ వారంతా వీడియోలను రూపొందించారు. అలాంటి వాటిలో ఒకటి ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఆ వీడియోలో ట్రంప్ లాగా ఉన్న ఓ వ్యక్తి ప్లే స్కూల్లో చిన్న పిల్లలో బాల్స్‌తో ఆడుకుంటున్నాడు. అక్కడకు జో బైడెన్లా ఉన్న మరో వ్యక్తి వచ్చి.. టైమ్ అయిపోయిందని, బాల్ వేరేవారికి ఇచ్చి బయటకు వెళ్లాంటూ కోరుతున్నాడు. అందుకు ‘ట్రంప్’ తాను వెళ్లనంటూ మారం చేస్తున్నాడు. ఎంత చెప్పినా వినకుండా నేనెళ్లను. నేనెళ్లను. అంటూ మారం చేస్తూ చిన్న పిల్లాడిలా కింద పడిపోయి ఏడుస్తున్నాడు. చివరకు ఎలాగైనా అతడిని ‘జో బైడెన్’ అతడిని బయటకు తీసుకుని వెళ్లారు.
జిమ్ పాకర్డ్ అనే ట్విటర్ యూజర్ ఈ వీడియోను పోస్ట్ చేశారు. నవంబర్ 6వ తేదీన ఈ వీడియోను పోస్ట్ చేశారు. ఆ వీడియో ఇప్పటికే 1.2 మిలియన్ వ్యూస్ సాధించింది. అయితే, ఈ వీడియో పోస్ట్ చేసే సమయానికి ఇంకా అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఇంకా పూర్తిస్థాయిలో రిలీజ్ కాలేదు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి జో బైడెన్ విజయం సాధించారు. 290 ఎలక్టోరల్ ఓట్లతో (ఇప్పటి వరకు) ఘన విజయాన్ని నమోదు చేశారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల చరిత్రలోనే కనీవినీ ఎరుగని స్థాయిలో జో బైడెన్‌కు పాపులర్ ఓట్లు లభించాయి.
నవంబర్ 3న అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరిగాయి. వాటికి సంబంధించి కొన్ని రాష్ట్రాల్లో కౌంటింగ్ ఇంకా జరుగుతోంది. 538 ఎలక్టోరల్ ఓట్లలో మేజిక్ ఫిగర్ అయిన 270 ఓట్లను జో బైడెన్ ఇప్పటికే సాదించారు. ఆయనకు 290 ఎలక్టోరల్ ఓట్లు వచ్చాయి. అయితే, ఓట్ల లెక్కింపు ఆలస్యం మీద ట్రంప్ అనుమానం వ్యక్తం చేశారు. అలాగే, ఓటింగ్ సమయం ముగిసిన తర్వాత కూడా పోలింగ్ కొనసాగించారని కూడా ఆయన ఆరోపించారు. దీనిపై న్యాయపోరాటం చేస్తానని ట్రంప్ గతంలో ప్రకటించారు.
Published by:
Ashok Kumar Bonepalli
First published:
November 8, 2020, 9:36 PM IST