Video: హైదరాబాద్ - లండన్ ఫ్లైట్ గ్రేట్ ఎస్కేప్.. పైలట్ దేవుడే..

లండన్ లోని హీత్రూ విమానాశ్రయంలో లాండింగ్ అవుతున్న సమయంలో విమానం ప్రమాదానికి గురయ్యేది. లాండింగ్ సమయంలో షేక్ అవుతున్న విమానాన్ని పైలెట్ తన టాలెంట్‌తో మళ్లీ టేకాఫ్ చేసి ప్రయాణికుల ప్రాణాలను రక్షించాడు.

news18-telugu
Updated: February 9, 2019, 9:25 PM IST
Video: హైదరాబాద్ - లండన్ ఫ్లైట్ గ్రేట్ ఎస్కేప్.. పైలట్ దేవుడే..
ప్రతీకాత్మక చిత్రం
news18-telugu
Updated: February 9, 2019, 9:25 PM IST
హైదరాబాద్ నుంచి లండన్ వెళుతున్న బ్రిటిష్ ఎయిర్ వేస్ విమానం తృటిలో పెను ప్రమాదాన్ని తప్పించుకుంది. లండన్ లోని హీత్రూ విమానాశ్రయంలో లాండింగ్ అవుతున్న సమయంలో విమానం ప్రమాదానికి గురయ్యేది. లాండింగ్ సమయంలో షేక్ అవుతున్న విమానాన్ని పైలెట్ తన టాలెంట్‌తో మళ్లీ టేకాఫ్ చేసి ప్రయాణికుల ప్రాణాలను రక్షించాడు. విమానం లాండింగ్ అవుతున్న సమయంలో షేక్ కావడం, వెంటనే పైలెట్ విమానాన్ని మళ్లీ టేకాఫ్ చేయడం అంతా వీడియోలో రికార్డయింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇప్పటికే ఈ వీడియోను 3.58 మిలియన్ల మంది చూశారు.



ఈ ఫ్లైట్ హైదరాబాద్ నుంచే బయలుదేరింది. రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు నుంచి బయలుదేరింది. చేరుకోవాల్సిన సమయం కంటే 18 నిమిషాలు అలస్యంగా హీత్రూ ఎయిర్‌పోర్టుకు చేరుకుంది. విమానం లాండింగ్ సమయంలో ప్రమాదానికి గురయ్యేది. కానీ, పైలెట్ చాకచక్యంగా వ్యవహరించడంతో అందరూప్రాణాలతో బయటపడ్డారు.

hyderabad airport, shamshabad airport, brand hyderabad, హైదరాబాద్ విమానాశ్రయం, శంషాబాద్ విమానాశ్రయం, ఇండిగో, ఎయిర్ ఏషియా
ప్రతీకాత్మక చిత్రం




మళ్లీ కొద్దిసేపటి తర్వాత పైలట్ విమానాన్ని క్షేమంగా కిందకు దించాడు. దీంతో ప్రయాణికులు ఊపిరిపీల్చుకున్నారు. లాండ్ అవుతున్న విమానం టేకాఫ్ కావడంతో పాసింజర్ల గుండెలు అదిరిపోయి ఉంటాయి. అయితే, పైలెట్ టాలెంట్‌ను అందరూ మెచ్చుకున్నా.. అసలు ఫ్లైట్ లాండింగ్ సమయంలో అలా ఎందుకు జరిగిందనేది కూడా ప్రశ్నగా మారింది.
First published: February 9, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...