Hurricane Ida: అమెరికాను వణికిస్తున్న ఐదా హరికేన్.. ఫ్లైట్​లో ప్రయాణిస్తుండగా తీసిన తుఫాన్​ వీడియో వైరల్​

Photo Credit: Facebook

గల్ఫ్ ఆఫ్ మెక్సికో(Gulf of Mexico) నుంచి లూసియానాకు( Louisiana) దూసుకెళ్తున్న ‘ఐదా హరికేన్​’ అమెరికన్లను ఆందోళనకు గురిచేస్తోంది. ఇప్పటి వరకు దేశాన్ని తాకిన అత్యంత శక్తివంతమైన తుఫాన్లలో ఇది కూడా ఒకటని నిపుణులు చెబుతున్నారు.

  • Share this:
దాదాపు 16 ఏళ్ల క్రితం అగ్రరాజ్యం అమెరికాను గడగడలాడించిన కత్రినా హరికేన్​(Hurricane Katrina) గురించి తెలుసు కదా. అగ్రరాజ్యం అమెరికా చరిత్రలో అత్యంత భారీ నష్టాన్ని మిగిల్చిన హరికేన్​గా ఇది మిగిలిపోయింది. మళ్లీ ఇన్నేళ్లకు గల్ఫ్ ఆఫ్ మెక్సికో(Gulf of Mexico) నుంచి లూసియానాకు( Louisiana) దూసుకెళ్తున్న ‘ఐదా హరికేన్​’ అమెరికన్లను ఆందోళనకు గురిచేస్తోంది. ఇప్పటి వరకు దేశాన్ని తాకిన అత్యంత శక్తివంతమైన తుఫాన్లలో ఇది కూడా ఒకటని నిపుణులు చెబుతున్నారు. ఈ హరికేన్​.. ఏకంగా మిసిసిపీ నదీ ప్రవాహాన్నే రివర్స్​ చేసిందంటే ఎంత శక్తివంతమైందో అర్థం చేసుకోవచ్చు.

ఐదా హరికేన్(Hurricane Ida) కారణంగా గంటకు 230 కిలోమీటర్ల వేగంతో వీస్తున్న ఈదురు గాలులతో లూసియానా రాష్ట్రం వణికిపోతుంది. అయితే ఈ హరికేన్​ తీవ్రతను కళ్లకు కట్టినట్లు చూపించేందుకు ఇద్దరు పైలెట్లు సాహసమే చేశారు. NOAA WP-3D ఓరియన్ #NOAA43 మిస్ పిగ్గీ రీసెర్చ్ మిషన్ ఫ్లైట్​లో వారు గల్ఫ్ ఆఫ్ మెక్సికో మీదుగా ప్రయాణిస్తుండగా ఈ ఫోటోలు, వీడియోలను కెమెరాల్లో బంధించారు.
వీడియోను పరిశీలిస్తే.. తక్కువ పీడనం వల్ల వారు కూర్చున్న సీట్లు అటూ ఇటూ ఊగాయి. అయినప్పటికీ, వారు అదరకుండా, బెదరకుండా తుఫాను ఫోటోలు, వీడియోను కెమెరాలో బంధించారు. నిమిషం పాటు ఉన్న ఈ వీడియో నెటిజన్లను ఆకట్టుకుంటోంది. నీలి వర్ణంతో నిండిన ఆకాశం నెటిజన్లను మంత్ర ముగ్దుల్ని చేస్తోంది. ఈ అద్భుతమైన వీడియో ఇప్పుడు సోషల్​ మీడియాలో వైరల్​గా మారుతోంది.

Kabul: కారు నిండా బాంబులు.. ఎయిర్‌పోర్టుపై దాడికి టెర్రరిస్ట్‌ల స్కెచ్.. కానీ అంతలోనే..



ఇలా తుఫానును దగ్గర్నుంచి వీడియో తీయడం అంత సులభం కాదు. కేవలం వాతావరణ నిపుణులు, శాస్త్రవేత్తలకు మాత్రమే ఇలా దగ్గర్నుంచి తుఫాను ఫోటోలు, వీడియోలు తీయడానికి అనుమతి ఉంటుంది. కానీ ఇద్దరు పైలట్లు మాత్రం ఐదా హరికేన్​ను కంటికి అతి సమీపంలో వీడియో తీయగలిగారు.


Afghanistan News: ఇంకా అఫ్గాన్‌లోనే 20 మంది ఇండియన్స్.. రేపటితో ముగియనున్న అమెరికా బలగాల ఉపసంహరణ గడువు..



కంటికి అతి సమీపంలో తీసిన తుఫాన్​ వీడియో..
నేషనల్ హరికేన్ సెంటర్ ఈ అద్భుతమైన ఫుటేజీని సోషల్ మీడియా అకౌంట్లలో షేర్ చేసింది. ఫ్లైట్​లో ప్రయాణిస్తున్న సమయంలో NESDIS ఓషన్ విండ్స్ రీసెర్చ్ టీమ్ ఐదా హరికేన్​ను అతి సమీపం నుంచి తీసిన అద్భుతమైన వీడియో అని పేర్కొంది. ఐదా హరికేన్ తరువాత లూసియానాలోని అత్యంత జనసాంద్రత కలిగిన న్యూ ఓర్లీన్స్‌లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ప్రమాదం పొంచి ఉన్న ప్రాంతాల్లో ప్రభుత్వం ముందస్తు హెచ్చరిక జారీ చేసింది. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. పర్యావరణ మార్పుల కారణంగా ఇలాంటి భారీ హరికేన్లు తరచూ అమెరికా తీరాన్ని తాకుతున్నాయి.
Published by:Sumanth Kanukula
First published: