Video : తుఫాను బీభత్సం... సముద్రం అల్లకల్లోలం...

Hurricane Dorian : డోరియన్ తుఫాను భయాందోళనలు ఇంకా వీడలేదు. ప్రస్తుతం అది కెనడాపై విరుచుకుపడుతోంది.

Krishna Kumar N | news18-telugu
Updated: September 9, 2019, 9:47 AM IST
Video : తుఫాను బీభత్సం... సముద్రం అల్లకల్లోలం...
డోరియన్ తుఫాను బీభత్సం (file)
  • Share this:
కేటగిరీ 5గా వచ్చిన డోరియన్ తుఫాను... కాస్త బలహీనపడి కేటగిరీ 2గా ఉన్నప్పటికీ... అమెరికా రాష్ట్రాల్ని వణికిస్తూనే ఉంది. బహమాస్ దీవుల్ని సర్వనాశనం చేసి... వీకెండ్‌లో అమెరికా అట్లాంటిక్ తీర ప్రాంత రాష్ట్రాలైన ఫ్లోరిడా, నార్త్, సౌత్ కరోలినాలపై విరుచుకుపడిన తుఫాను... ఇప్పుడు... నోవా స్కోషియా, కెనడాపై ప్రతాపం చూపిస్తోంది. ప్రస్తుతం కెనడా తీర ప్రాంతం అల్లకల్లోలంగా ఉంది. హాలిఫాక్స్ పట్టణంలో ఓ భారీ క్రేన్ పడిపోయిందంటే... గాలుల తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. చాలా చోట్ల చెట్లు నేలకూలాయి. కరెంటు స్తంభాలు ఒరిగిపోయాయి. తుఫాను వల్ల తీవ్రంగా దెబ్బతిన్న బహమాస్ ఇప్పట్లో కోలుకునేలా లేదు. వేల మంది ఇళ్లు కోల్పోయారు. 43 మంది ప్రాణాలు విడిచారు. మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.

First published: September 9, 2019, 9:47 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading