భీకరంగా డోరియన్ తుఫాను... ఇప్పటికే 20 మంది మృతి, 1300 ఇళ్లు నేలమట్టం

Hurricane Dorian : ఉత్తర అమెరికా, బహమాస్ దీవులపై డోరియన్ తుఫాను విరుచుకుపడింది. దాని ప్రభావంతో ఇప్పటికే 20 మంది చనిపోగా... బహమాస్‌లో 1300 ఇళ్లు నేలమట్టం అయ్యాయి.

Krishna Kumar N | news18-telugu
Updated: September 5, 2019, 10:29 AM IST
భీకరంగా డోరియన్ తుఫాను... ఇప్పటికే 20 మంది మృతి, 1300 ఇళ్లు నేలమట్టం
Hurricane Dorian : ఉత్తర అమెరికా, బహమాస్ దీవులపై డోరియన్ తుఫాను విరుచుకుపడింది. దాని ప్రభావంతో ఇప్పటికే 20 మంది చనిపోగా... బహమాస్‌లో 1300 ఇళ్లు నేలమట్టం అయ్యాయి.
  • Share this:
Hurricane Dorian : బుధవారం రాత్రి గ్రెగ్ అలెం కాళ్ల కింద ఉన్న భూమి కంపించింది. భూకంపం వచ్చిందేమో అనుకున్నాడు. కొన్ని క్షణాలకే అసలు విషయం తెలిసింది. ప్రళయ భీకరంగా వస్తున్న హరికేన్ డోరియన్ ప్రభావం అది. అట్లాంటిక్ తీరం నుంచీ... బహమాస్ దీవుల్ని పూర్తిగా ముంచేసి... పెను నష్టం కలిగించింది. బహమాస్‌లో 1300 ఇళ్లు నేలమట్టం అయ్యాయి. చెట్లు, కరెంటు స్తంభాలూ ఏపీ తుఫాను దాటికి నిలబడలేదు. మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. బహమాస్ దీవులతోపాటూ... అబాకో దీవులు కూడా సముద్రంలో కలిసిపోయాయి. అక్కడి 70 వేల మంది ప్రజలు సాయం కోసం ఎదురుచూస్తున్నారు. ఇప్పటివరకూ బహమాస్ దీవులపై విరుచుకుపడిన అతి పెద్ద తుఫాను ఇదే.

 బహమా ప్రభుత్వం... వందల మంది పోలీసుల్ని సహాయ చర్యల కోసం పంపింది. డాక్టర్లు, నర్సులు, హెల్త్ కేర్ వర్కర్లు రంగంలోకి దిగారు. నష్టం ఎంత అన్నది అంచనాలకు అందని విధంగా ఉంది. 


అమెరికా కోస్ట్ గార్డ్, బ్రిటన్ రాయల్ నేవీ, స్వచ్ఛంద సంస్థలు, ఐక్యరాజ్యసమితి, రెడ్ క్రాస్... సహాయ చర్యలు ప్రారంభించాయి. సముద్రంలో చిక్కుకున్న వారిని హెలికాప్టర్లతో సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. అమెరికా ప్రభుత్వం అర్బన్ సెర్చ్ అండ్ రెస్క్యూ టీమ్‌లను పంపింది.

 


బహమాస్‌పై విరుచుకుపడిన తుఫాను... అత్యంత ప్రమాదకరైన కేటగిరీ 5 రకమనీ, గంటకు 295 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయనీ వాతావరణ అధికారులు తెలిపారు. ప్రస్తుతం గంటకు 165 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. అందువల్ల ఫ్లోరిడా, జార్జియా, నార్త్ కరోలినా, సౌత్ కరోలినాలో 30 లక్షల మందిని అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మరింత మందిని వేగంగా తరలించేందుకు హైవేలను వన్ వే రూట్లుగా మార్చారు. ఫ్లోరిడాను దాటి... జార్జియావైపు వస్తున్న తుఫాను... గురు, శుక్రవారం భారీ వర్షం కురిపించేలా ఉంది.
First published: September 5, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading