మీకో దండం.. బిల్లు కట్టకుండా మా హోటల్లోకి అడుగుపెట్టొద్దు.. వందలాది రాజకీయ నేతలకు వార్నింగ్

ప్రతీకాత్మక చిత్రం

సాధారణంగా హోటళ్లలో బిల్లులు కట్టడానికి కస్టమర్ల వద్ద డబ్బు లేకపోతే పిండి వెయిటర్ గా పనిచేయించడమో, ప్లేట్లు తీయించడమో చేస్తుంటారు. కానీ హోటళ్లలో బిల్లులు చెల్లించనిది ఓ ప్రభుత్వమే అయితే, వందలాది మంది రాజకీయ నేతలే అయితే, మిలటరీ అధికారులే అయితే..

 • Share this:
  మన పాత సినిమాల్లోనే కాదు, నేటి తరం సినిమాల్లోనూ ఓ కామన్ సీన్ ఒకటి ఉంది. బిల్లు చెల్లించకపోతే హోటల్లో సర్వర్ గానో, పిండి రుబ్బడమో, ప్లేట్లు కడిగించడమో చేసే సినిమా సీన్లు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తుంటాయి. రియల్ లైఫ్ లో కూడా ఇలాంటి ఘటనలు కోకొల్లలు. వాళ్లు సాధారణ పౌరులే కాబట్టి ఇలాంటి పనులు చేయించడానికి హోటల్ యజమానులు కూడా వెనకాడరు. కానీ ఆ బిల్లులు చెల్లించనిది ఓ ప్రభుత్వమే అయితే, వందలాది మంది రాజకీయ నేతలే అయితే, మిలటరీ అధికారులే అయితే చర్యలు తీసుకోవడానికి కాస్త వెనకాడక తప్పదు కదా. బాబ్బాబు, మా హోటల్ లో మీరు ఇంత బిల్లు చేశారు, కాస్త చెల్లించండి బాబూ అని అడగాల్సిందే కానీ, బిల్లు కట్టు అంటూ బెదిరించే సీన్ ఉండదన్నది వాస్తవమే.

  అయితే అది కొంత కాలం వరకే. బిల్లు చెల్లించకుండా ఒకటి రెండు నెలలయితే హోటల్ యజమానులు ఆగుతారు కానీ, ఏళ్ల తరబడి కూడా బిల్లులు పెండింగ్ లో ఉంటే ధిక్కారం వినిపించక తప్పదు కదా. సూడాన్ దేశంలో ప్రస్తుతం అదే సీన్ కనిపిస్తోంది. హోటళ్లలో ఉన్న రాజకీయ ప్రముఖులను, ప్రభుత్వం తరపున ఉంటున్న వాళ్లందరినీ హోటళ్ల నుంచి గెంటేశారు. ఇది చాలా అవమానకరంగా ఉందంటూ వారు వాపోయినా సరే, మేం పడుతున్న బాధల ముందు మీకు జరిగిన అవమానం పెద్ద లెక్క కాదు అంటూ హోటల్ అసోయేషన్ తేల్చిచెబుతోంది.

  2013వ సంవత్సరంలో సౌత్ సూడాన్ లో సివిల్ వార్ జరిగింది. పెద్ద సంఖ్యలో ఆస్తి నష్టం జరిగింది. మూడు లక్షల 80 వేల మందికి పైగా పౌరులు ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఐక్యరాజ్య సమితి రంగంలోకి దిగింది. ఇరు వర్గాల మధ్య శాంతి చర్చలు జరిపేందుకు సిద్ధమయింది. ఈ శాంతి చర్చల్లో దేశ విదేశాల ప్రముఖులు, ప్రభుత్వ అధికారులు, అధికార, ప్రతిపక్ష రాజకీయ నేతలు, విదేశీ దౌత్యవేత్తలు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఇంకా ఈ శాంతి చర్చలు జరుగుతూనే ఉన్నాయి. ఈ చర్చల నిమిత్తం వచ్చిన రాజకీయ నాయకులకు సౌత్ సూడాన్ ప్రాంతంలో ఉన్న పలు స్టార్ హోటళ్లలో బసను ఏర్పాటు చేశారు. వందల సంఖ్యలో నేతలు ఆయా హోటళ్లలో ఉన్నారు. అయితే అందుకు సంబంధించిన బిల్లులను మాత్రం సూడాన్ ప్రభుత్వం ఇంకా చెల్లించలేదు.

  బిల్లులను చెల్లించాలని ప్రతీయేటా అడుగుతూనే ఉన్నా సూడన్ సర్కారు ఏమాత్రం స్పందించడం లేదు. ఇక చేసేదేమీ లేఖ ఆ హోటళ్లన్నీ ఒక అసోసియేషన్ గా ఏర్పాడ్డాయి. తమకు రావాల్సిన 50 మిలియన్ డాలర్ల (దాదాపు 363 కోట్ల రూపాయల) బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం ఆయా హోటళ్లలో చర్చల నిమిత్తం ఉన్న రాజకీయ నేతలను, ఇతర ప్రముఖులను బయటకు గెంటేశారు. బిల్లులు చెల్లించేదాకా తమ హోటళ్లకు రావద్దంటూ అల్టిమేటం జారీ చేశారు. చర్చల నిమిత్తం హోటళ్లకు వచ్చి ఏళ్ల తరబడి హోటళ్లో సౌకర్యాలను అనుభవించిన నేతలు కూడా ఉన్నారనీ, తామేమో ఉద్యోగులకు జీతాలు చెల్లించలేని స్థాయికి చేరుకుంటున్నామని హోటల్ యాజమాన్యాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి.
  Published by:Hasaan Kandula
  First published: