పాకిస్థాన్‌లో పైశాచికత్వం...పంజరంలోని పావురాలను ఏం చేసాడో తెలుసా ?

తన ఓటమికి పావురాలే కారణమయ్యాయని, పంజరంలో ఉన్నాయన్న కనికరం కూడా లేకుండా వాటిపై పెట్రోల్ పోసి నిప్పు అంటించాడు. ఇంకేముంది ఒకటి కాదు రెండు కాదు ఏకంగా వందలాది పావురాలు అందరూ చూస్తుండగానే మాడి మసైపోయాయి.

news18-telugu
Updated: April 16, 2019, 6:11 AM IST
పాకిస్థాన్‌లో పైశాచికత్వం...పంజరంలోని పావురాలను ఏం చేసాడో తెలుసా ?
మంటల్లో మాడిపోయిన పావురాలు (Image : Twitter)
  • Share this:
పావురాలు శాంతికి చిహ్నాలు.. ప్రపంచ వ్యాప్తంగా పావురాలను సందేశానికి గుర్తుగా ఎగురవేస్తుంటారు. అయితే అలాంటి శాంతి కపోతాలను మలమలా మంటల్లో మాడ్చి బూడిద చేశాడో శాడిస్టు... వివరాల్లోకి వెళితే పాకిస్థాన్ పంజాబ్ ప్రావిన్స్‌లోని ఫైసలాబాద్ లో పావురాల పోటీలు నిర్వహిస్తుంటారు. వాటిపై బెట్టింగులు సైతం నిర్వహించడం అక్కడ పరిపాటి. రేసుల్లో పాల్గొనే పావురాలకు మంచి శిక్షణ సైతం ఇస్తుంటారు. అంతే కాదు బలమైన పావురాల కోసం వేలాది రూపాయలు పోసేందుకు కూడా వెనుకాడరు పందెం రాయుళ్లు. ఇదిలా ఉంటే ఫైసలాబాద్ కు చెందిన ఓ యువకుడు ఎప్పటిలాగే పావురాల రేసులో పార్టిసిపేట్ చేశాడు. అయితే లక్ బాగోలేక అతని పావురం ఓడిపోయింది. ఇంకేముంది పెద్ద మొత్తంలో బెట్టింగ్ డబ్బంతా పోగుట్టుకున్నాడు. దీంతో చిర్రెత్తుకొచ్చిన ఆ యువకుడిలో పైశాచికత్వం పెరిగిపోయింది. తన ఇంట్లో మేడమీద రేసుల్లో పాల్గొనే పావురాల పంజరం మీద అతడి కన్ను పడింది. తన ఓటమికి పావురాలే కారణమయ్యాయని, పంజరంలో ఉన్నాయన్న కనికరం కూడా లేకుండా వాటిపై పెట్రోల్ పోసి నిప్పు అంటించాడు.  ఇంకేముంది ఒకటి కాదు రెండు కాదు ఏకంగా వందలాది పావురాలు అందరూ చూస్తుండగానే మాడి మసైపోయాయి. ఈ ఘటనను ప్రత్యక్షంగా చూసిన స్థానికులు నిశ్చేష్టులయ్యారు. అంతలా వాటిపై పగ ఉంటే వాటి దారిన వాటిని వదలేసి ఉండవచ్చు కదా అని నొచ్చుకున్నారు.

అయితే దీనిపై స్పందించిన నెటిజన్ సదరు వ్యక్తి శాడిజాన్ని ప్రపంచానికి తెలియజేశాడు. మూగ జీవులపై ప్రతాపం చూపించవద్దని, నిస్సహాయంగా ఉన్న పక్షులపై ఇలా పైశాచికత్వం ప్రదర్శించిన ఘటనపై తక్షణమే స్పందించి చర్యల తీసుకోవాలని అర్థించగా, పక్షులు మాడిపోయిన ఫోటో ప్రపంచ వ్యాప్తంగా జంతు ప్రేమికులకు కన్నీళ్లు తెప్పిస్తోంది..

First published: April 16, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...