అదృష్టమంటే ఆ ఊరి వాళ్లదే... ఒక్కసారిగా లక్షాధికారులయ్యారు

Space rocks: ఆకాశం నుంచి పడిన ఆ రాళ్లు వాళ్లను లక్షాధికారుల్ని చేశాయి. ఇప్పటికీ అక్కడ ఆ రాళ్లు దొరుకుతూనే ఉన్నాయి.

news18-telugu
Updated: September 2, 2020, 7:39 AM IST
అదృష్టమంటే ఆ ఊరి వాళ్లదే... ఒక్కసారిగా లక్షాధికారులయ్యారు
అదృష్టమంటే ఆ ఊరి వాళ్లదే... ఒక్కసారిగా లక్షాధికారులయ్యారు (credit - Michael Farmer)
  • Share this:
Space rocks: అది బ్రెజిల్‌లోని... ఈశాన్య ప్రాంతంలో ఉన్న శాంతా ఫిలోమెనా పట్టణం. అక్కడ ఆగస్ట్ 19న జరిగిందో అంతరిక్ష అద్భుతం. వందల కొద్దీ రాళ్లు అంతరిక్షం నుంచి అలా వచ్చి పడ్డాయి. వాటిని చూసి స్థానికులు వాళ్ల లోకల్ భాషలో... "అరే ఏంటవి... వామ్మో... ఏదో అవుతోంది... ఏదో జరిగిపోతోంది" అనుకుంటూ భయపడ్డారు. ఆ తర్వాత... అవి విలువైన రాళ్లు అని తెలిశాక... పోటీ పడి వాటిని ఏరుకున్నారు. ఎవరికి దొరికిన రాళ్లు వాళ్లు ఏరుకున్నారు. వాటి విలువ లక్షల్లో ఉంటుందనే అంచనా ఉంది. ఎందుకంటే... అవి సాధారణ రాళ్లు కావు. ఎప్పుడో మన సౌర కుటుంబం ఏర్పడిన 460 కోట్ల సంవత్సరాల కిందటివిగా పరిశోధకులు తేల్చారు. అవి ఉల్కలలాగా భూమిపై పడ్డాయి. ఇంకో ఆసక్తికర విషయమేంటంటే... ఇప్పటివరకూ మనకు తెలిసిన ఉల్కల్లో... ఇలాంటి ఉల్కలు ఒక్క శాతం మాత్రమే ఉన్నాయట.


ఇప్పుడా ఊరిలో... ఒక్క రాయి దొరికినా చాలు... లక్షాధికారి కిందే లెక్క. ఎందుకంటే... 40 కేజీలకు పైగా ఉన్న ఓ రాయి ఎంత రేటు ఉండొచ్చని అంచనా వేస్తే... దాని విలువ రూ.19 లక్షల దాకా ఉంటుందని ఖగోళ పరిశోధకులు తేల్చారు. ఒక్క గ్రాము రాయి దొరికినా చాలు. దాని ధర రూ.500 దాకా ఉంది. ఎంత బరువు ఎక్కువుంటే... అంతలా దాని రేటు ఎక్కువ అవుతూ ఉంటుంది. చిత్రమేంటంటే... కొన్ని రోజుల కిందట ఆ రాళ్లకు ఉన్న ధర... ఇప్పుడు డబుల్ అయ్యింది. ఎందుకంటే... ఆ రాళ్లు మాకు కావాలంటే... మాకు కావాలని చాలా మంది ఎగబడి కొనుక్కుంటున్నారు.


ఆ ఊరిలో 90 శాతం మంది రైతులే. అక్కడ షాపులు పెద్దగా లేవు. ఉద్యోగాలేవీ లేవు. ప్రశాంతమైన జీవన విధానం వాళ్లది. తక్కువ జీతాలకే పనిచేస్తూ బతుకుతున్నారు. ఇప్పుడు వాళ్లు రాళ్లు అమ్ముకొని... వాళ్ల అప్పులు తీర్చుకుంటున్నారు. బైకులు, స్కూటర్ల వంటివి కొనుక్కుంటున్నారు.
ఈ రాళ్లపై పరిశోధకులు అధ్యయనం చేస్తున్నారు. వాటికి డిమాండ్ బాగా పెరిగింది. చిత్రమేంటంటే... 40 కేజీల రాయిని కొనేందుకు బ్రెజిల్‌లో ఎవరూ ముందుకు రాలేదు. విదేశీ సంపన్నులు దాన్ని కొనుక్కునేందుకు రెడీ అయ్యారు. వాళ్ల ప్లాన్ ఏంటంటే... ఇక్కడ రూ.19 లక్షలకు కొని... సంపన్న దేశాల్లో దాన్ని రూ.కోట్లకు అమ్మాలనుకుంటున్నారు. మొత్తంగా ఉల్కాపాతం ఆ ఊరి ప్రజల తలరాతను మార్చి... లక్షాధికారుల్ని చేసింది.
Published by: Krishna Kumar N
First published: September 2, 2020, 7:39 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading