news18-telugu
Updated: November 18, 2020, 11:40 AM IST
మనిషి ఎముకలతో రోడ్డు నిర్మాణం (credit - twitter - Nikolay Trofimov)
Road with Human Bones: అది రష్యాలోని కిరెన్స్క్ ప్రాంతం. అక్కడి ప్రజలు... కొత్తగా వేసిన రోడ్డుపై వెళ్తూ... షాక్ అయ్యారు. ఆ వీధిలో మంచు కురుస్తూ... ప్రయాణాలకు ఇబ్బందిగా మారడంతో... ప్రజల కోసం వేసిన పార్టిశాన్ అలిమోవ్ స్ట్రీట్ రోడ్డు అది. ఐతే... దానిపై మనుషుల ఎముకలు, పుర్రె కనిపించాయి. రోడ్డు కోసం వేసిన కంకర, ఇసుక వంటి పదార్థాలతో... మనుషుల ఎముకలను కూడా కలిపేసి వేసేశారు. ఈ ఎముకల్ని చూసిన స్థానికులు... "వామ్మో... ఏందిది... మనుషుల ఎముకలేంది... రోడ్డు వేయడమేంది..." అనుకుంటూ... ఒకరికి ఒకరు చెప్పుకుంటూ... చాలా టెన్షన్ పడ్డారు. ఫొటోలు తీసి... సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అంతే అవి వైరల్ అయ్యాయి. పోలీసులకు చేరాయి. వెంటనే పోలీసులు అలర్టై... దర్యాప్తు మొదలుపెట్టారు. అక్కడి ప్రాంతీయ మంత్రిత్వ శాఖ కూడా దర్యాప్తు ప్రారంభించింది.
ఇప్పటివరకూ జరిపిన దర్యాప్తులో... ఆ ఎముకలు 100 ఏళ్ల నాటివని తెలుస్తోంది. 1917-1920 మధ్య రష్యా సివిల్ వార్‌లో చనిపోయిన వ్యక్తివి కావచ్చని మెట్రో యూకే రిపోర్ట్ చేసింది. అవి మనిషి ఎముకలే అని క్లియర్‌గా తెలిసినా... అధికారులు మాత్రం నోరువిప్పట్లేదు. ప్రైవేట్ కాంట్రాక్టర్... రోడ్డు నిర్మిస్తున్నప్పుడు... ఎముకలు రోడ్డుపై పడినా గమనించకుండా... నిర్లక్ష్యంతో రోడ్డు వేసి ఉండొచ్చని తెలుస్తోంది.
"అసలేం జరుగుతోంది. ఇది ఎంత భయంకరమైన ఘటన. నేను వివరించలేకపోతున్నాను. న్యాయ వ్యవస్థలు దీన్ని త్వరగా దర్యాప్తు చేస్తాయని అనుకుంటున్నాను" అని స్థానిక నేత నికొలాయ్ ట్రుఫనోవ్ అన్నారు.
ప్రస్తుతం ఆ పుర్రెను ఎప్పటిది, ఎవరిది అన్నదానిపై నిపుణులు పరిశోధిస్తున్నట్లు తెలిసింది. ఎముకల్ని కూడా సేకరించి... ఫోరెన్సిక్ ల్యాబ్‌కి తరలించారని రష్యా న్యూస్ ఏజెన్సీ ఇంటర్ఫాక్స్ తెలిపింది.
ఇది కూడా చదవండి: Covid 19 with Animals: పెంపుడు జంతువులతో కరోనా ముప్పు ఎక్కువే. ఏం చెయ్యాలి?
కొన్ని నెలల కిందట... జపాన్ నగరం ఒసాకాలో.. 1500 మనుషుల ఎముకలు కనిపించాయి. ఉమెలా టోంబ్ (Umela Tomb) ప్రాంతంలో తవ్వినప్పుడు కనిపించిన అవి... 160 ఏళ్ల నాటివిగా గుర్తించారు. పరిశోధకులు పందులు, గుర్రాలు, పిల్లులకు సంబంధించిన 350 చిన్న సమాధులను గుర్తించారు. 1850, 1860 మధ్య నాటికి సంబంధించి మొత్తం 7 శ్మశానవాటికలు ఉండగా... ఉమెలా టోంబ్ వాటిలో ఒకటి.
Published by:
Krishna Kumar N
First published:
November 18, 2020, 11:40 AM IST