Human barbie doll: బార్బీడాల్‌‌లా మారిపోయిన ఈమె గుర్తుందా? ఇప్పుడు మరో కొత్త కోరిక..

హ్యూమన్ బార్బీ

Marcela Iglesias: ఆమె తండ్రి కిడ్నీ ట్రాన్స్ ప్లాంట్ అవసరమై అది ఎక్కడా దొరకక మరణించాడు. ఆయన మరణం తర్వాత ఆమె స్టెమ్ సెల్ థెరపీ గురించి రీసర్చ్ చేయడం ప్రారంభించింది.

  • Share this:
బార్బీ డాల్. చిన్నపిల్లలు ఉండే ఇళ్లలో దాదాపు ఈ అందమైన బొమ్మ ఉంటుంది. ఎంతో సుందరంగా.. క్యూట్‌గా ఉండే బార్బీ డాల్‌కు కోట్లాది అభిమానులు ఉన్నారు. ఐతే ఓ మహిళ మాత్రం ఏకంగా.. ఆ బొమ్మలాగే మారిపోయింది. అచ్చం అలానే కనిపించేందుకు 60 లక్షలు ఖర్చు పెట్టి కాస్మొటిక్ సర్జరీ చేయించుకుంది. ఆమె పేరు మార్సెలా ఇగ్లెసియాస్. లాస్ ఏంజెలిస్ కి చెందిన 43 ఏళ్ల మార్సెలా.. బార్బీ డాల్ లా కనిపించేందుకు దాదాపు రూ. 60 లక్షలు ఖర్చు చేసింది. కానీ ఆ విషయాన్ని మాత్రం అంగీకరించదు. సహజంగానే ఈ అందం వచ్చిందని చెబుతుంది. బార్బీలా కనిపించేందుకు తాను ఎలాంటి కాస్మెటిక్ సర్జరీలు చేయించుకోలేదని ప్రకటించడం విశేషం. బార్బీడాల్‌‌లా ఉండే ఆమె ఇప్పుడు కొత్త కోరికను బయటపెట్టింది.  హ్యూమన్ క్లోనింగ్ ప్రక్రియ ద్వారా తనలా ఉన్నవారిని తయారుచేసేందుకు సిద్ధమవుతున్నట్లు చెప్పింది. ఇలా తనని తాను క్లోన్ చేయడం వల్ల తన అవయవాలను ఇతరులకు దానం చేసి ప్రాణాలు కాపాడే వీలుంటుందనివెల్లడించింది.

ఒక బిడ్డకు తల్లి అయిన మార్సెలా అవయవాలను దానం చేయడానికి ముందుకొచ్చేవారితో పోల్చితే అవయవ దానం అవసరమైన వ్యక్తులు చాలా ఎక్కువగా ఉన్నారని మార్సెలా ఇగ్లెసియాస్ పేర్కొంది. క్లోన్స్ ఆర్మీ వల్ల తాను అవసరమైన వ్యక్తులకు అవయవ దానం చేయవచ్చని.. మంచి పనికోసమే తాను ఇలా చేస్తున్నట్లు చెప్పుకొచ్చింది. ‘‘నా శరీరాన్ని నేను క్లోన్ చేసి ఆ అవయవాలు అసలు అవయవదానానికి ఉపయోగపడతాయా? లేదా? భవిష్యత్తులో నాకే ఉపయోగపడతాయా? అనే విషయాలుచెక్ చేయడానికి ఈ క్లోనింగ్​ ప్రక్రియకు పూనుకున్నట్లు వెల్లడించింది.యూనివర్సిటీ ఆఫ్ టోక్యోకి చెందిన ప్రొఫెసర్ నాకౌచీ ద్వారా ఈ ప్రక్రియ గురించి తాను తెలుసుకున్నానని ఆమె వెల్లడించింది. ఆయన గత కొన్నేళ్ల నుంచి స్టెమ్ సెల్స్ నుంచి అవయవాలు పెరగడం పై రీసర్చ్ చేస్తున్నారు.

మార్సెలా దీని గురించి చెబుతూ ఇప్పటికే చాలా దేశాల్లో క్లోనింగ్ ప్రక్రియజరుగుతుందని చెప్పుకొచ్చింది. కానీ సాధారణ ప్రజలకు దాని గురించి తెలియడం లేదని పేర్కొంది. ఆమె తండ్రి కిడ్నీ ట్రాన్స్ ప్లాంట్ అవసరమై అది ఎక్కడా దొరకక మరణించాడు. ఆయన మరణం తర్వాత ఆమె స్టెమ్ సెల్ థెరపీ గురించి రీసర్చ్ చేయడం ప్రారంభించింది. మీడియా రిపోర్ట్స్ ప్రకారం 30 మిలియన్ స్టెమ్ సెల్స్ ని చిన్న పిల్లల బొడ్డు తాడు నుంచి సేకరించారు. దీని గురించి మార్సెలా చెబుతూ నా స్టెమ్ సెల్స్, నా అండాలు దానం చేసి వాటితో మనిషి అవయవాలు తయారు చేసి అవసరమైన వ్యక్తులకు వాటిని దానం చేస్తానిని మార్సెలా వెల్లడించింది.
Published by:Shiva Kumar Addula
First published: