బీచ్‌లో ఇసుక చోరీ.. రూ. 88,000 వేలు ఫైన్.. ఎక్కడంటే..

సార్డినియా తీరాల నుండి ఇసుక తీసుకోవడం చట్టవిరుద్ధమైన చర్యగా పేర్కొంటూ అక్కడి ప్రభుత్వం 2017లో ప్రాంతీయ చట్టాన్ని రూపొందించి ప్రవేశపెట్టింది.

news18-telugu
Updated: September 8, 2020, 6:39 PM IST
బీచ్‌లో ఇసుక చోరీ.. రూ. 88,000 వేలు ఫైన్.. ఎక్కడంటే..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
బీచ్‌లో ఇసుకతో ఆడుకోవడం.. అప్పుడప్పుడు కొంత ఇసుకను ఇంటికి తీసుకెళ్లడం మన దగ్గర చాలా కామన్. కానీ కొన్ని దేశాల్లో మాత్రం బీచ్‌లో ఇసుక దొంగతనం చేస్తే సీన్ మామూలుగా ఉండదు. సీసాల్లో ఇసుకను నింపుకొని దొంగతనానికి పాల్పడిన వ్యక్తి భారీ జరిమానా చెల్లించుకోవాల్సి వచ్చింది. ఇటలీలోని సార్డనయాలో ఫ్రెంచ్ పర్యాటకుడు తన బ్యాగులో నాలుగు పౌండ్ల కంటే ఎక్కువ ఇసుకను దొంగలించడానికి ప్రయత్నించడంతో అక్కడి అధికారులు పట్టుకున్నారు. అక్కడి కోర్టు అతనికి 1,000 యూరోలు (మన కరెన్సీ ప్రకారం దాదాపు రూ. 80,000) జరిమానా విధించింది.

ఇటాలియన్ ద్వీపంలో లభించే తెల్లని ఇసుకను దొంగలించడానకి ప్రయత్నించినవారు జరిమానా మరియు జైలు శిక్షార్హులు. సార్డినియా తీరాల నుండి ఇసుక తీసుకోవడం చట్టవిరుద్ధమైన చర్యగా పేర్కొంటూ అక్కడి ప్రభుత్వం 2017లో ప్రాంతీయ చట్టాన్ని రూపొందించి ప్రవేశపెట్టింది. ఎవరైనా అక్రమంగా ఇసుకను కలిగి ఉంటే ఇటలీ ప్రభుత్వం 500 యూరోలు (దాదాపు 600 డాలర్లు) నుంచి 3,000 యూరోలు (దాదాపు 3,550 డాలర్లు) మధ్య జరిమానా విధిస్తుంది. ఈ జరిమానా ఇసుక పరిమాణాన్ని బట్టి మరియు దాన్ని దొంగలించిన ప్రదేశంపై ఆధారపడి ఉంటుంది.

సెప్టెంబర్ 1న కాగ్లియారి ఎల్మాస్ విమానాశ్రయంలో ఒక విదేశీ టూరిస్ట్ నుంచి 4.4 పౌండ్ల ఇసుకతో కూడిన బాటిల్ను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. నిందితుడి వద్ద నుండి ఇసుకతో కూడిన బాటిల్‌ను జప్తు చేశామని, ప్రస్తుతం అది మా ఆపరేటింగ్ రూంలోనే భద్రపరిచాం.. జప్తు చేసిన వస్తువులన్నింటినీ అక్కడే భద్రపరుస్తామని ఇటాలియన్ ద్వీపం ఫారెస్ట్ రేంజర్స్ ప్రతినిధి తెలిపారు. ఇటలీని బీచుల్లో తరచుగా ఇసుక చోరీ జరుగుతుండటంతో అక్కడి ప్రభుత్వం కొన్ని కఠిన నిబంధనలను ప్రవేశపెట్టింది.

ఇసుక దొంగలించేవారు గులాబీ లేదా తెల్లని రంగు ఉన్న ఇసుక దొరికే బీచ్లను లక్ష్యంగా పెట్టుకొని ఈ చోరీకి పాల్పడుతున్నారని అక్కడి అధికారి చెప్పారు. గత ఏడాది ఇక్కడి బీచ్లలో దొరికే ఇసుకను చోరీ చేసి విక్రయిస్తున్న ఒక వెబ్సైట్ను కనుగొన్నామని... ఇసుక చోరీని నివారించడానికి గత మూడేళ్లుగా కఠిన నిబంధనలు, ఆంక్షలను ప్రవేశపెట్టామని ఆ అధికారి తెలిపారు. ఇసుక చోరీ నివారణకు పోలీసులతో కలిసి పనిచేస్తున్నామని... వారు మమ్మల్ని ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తారని అన్నారు. ఎవరైనా పర్యాటకులు ఇసుకను దోచుకుంటున్నట్లు చూస్తే ప్రజలు కూడా అధికారులను సంప్రదించవచ్చని ఆ అధికారి పేర్కొన్నారు. 2018లో ఓల్బియా నగరం సమీపంలో బీచ్ నుండి 80 పౌండ్ల ఇసుక దొంగలించిన బ్రిటన్ జంటను అధికారులు పట్టుకున్నారు. అప్పుడు వారికి 1,000 డాలర్లను మించి జరిమానా విధించారు.
Published by: Kishore Akkaladevi
First published: September 8, 2020, 6:35 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading