ఇండోనేషియాలో భారీ భూకంపం (Earthquake) ప్రజలను వణికించింది. జావా ద్వీపంలో సోమవారం మధ్యాహ్నం భూమి ఒక్కసారిగా కంపించింది. దీనితో ప్రజలు ఇళ్లలో నుండి బయటకు పరుగులు తీశారు. ఈ ఘటనలో 46 మంది మృతి చెందగా..300 మందికి పైగా ప్రజలు గాయపడినట్లు అధికారులు తెలిపారు. రిక్టర్ స్కెల్ పై 5.6 తీవ్రత నమోదైనట్లు తెలుస్తుంది. భూకంపం (Earthquake) ప్రభావంతో ఇళ్లు, భవనాలు ధ్వంసం అయ్యాయి. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఘటనా స్థలంలో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.
Polres Cianjur: 20 Orang Meninggal Dunia, 100 Luka Akibat Gempa https://t.co/EkespEef17
— CNN Indonesia (@CNNIndonesia) November 21, 2022
ఈ ప్రమాదంలో ఎక్కువ మొత్తం ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరిగినట్లు తెలుస్తుంది. భవనాల కింద అనేక మంది చిక్కుకోవడంతో అలెర్ట్ అయిన అధికారులు ముమ్మర చర్యలు చేపట్టారు. మృతి చెందిన వారి బాడీలను వారి వారి కుటుంబసభ్యులకు అప్పగిస్తున్నారు. అలాగే శిధిలాల కింద ఉన్న వారిని తీయడానికి బృందాలు రంగంలోకి దిగాయి. కాగా ఇటీవల తరచు ఇండోనేషియాలో భూకంపం (Earthquake) చోటు చేసుకోవడంతో ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా అయింది. ఎప్పుడు భూకంపం (Earthquake) వస్తుందో అని ప్రజలు అరచేతిలో ప్రాణం పెట్టుకొని బిక్కుబిక్కుమంటున్నారు. 2 రోజుల క్రితం కూడా ఇండోనేషియాలో భూకంపం (Earthquake) సంభవించింది. దాని నుండి కోలుకోక ముందే మళ్లీ భూకంపం (Earthquake) రావడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
ఇండోనేషియాలోనే భూకంపాలు అధికం ఎందుకు..
గతంలో జపాన్, ఇండొనేసియాలో తరచూ భూకంపాలు (Earthquake) వచ్చేవి. కానీ రాను రాను జపాన్‌లో అవి తగ్గినా.. ఇండొనేసియాలో మాత్రం తరచు భూకంపాలు సంభవిస్తున్నాయి. ఇండోనేషియా దేశ జనాభా 27 కోట్ల మందికి పైగా ఉన్నారు. భూకంపం వచ్చినప్పుడల్లా వారు ఉలిక్కి పడుతున్నారు. అక్కడే భూకంపాలు (Earthquake) రావడానికి 2 కారణాలు ఉన్నాయి. ఈ భూమిపై రింగ్ ఆఫ్ ఫైర్ (ring of fire) అనేది ఒకటి ఉంది. ఆ రింగ్ ఉన్న ప్రాంతంలో ఎక్కువగా అగ్నిపర్వతాలు ఉన్నాయి. అదే రింగ్ లో ఇండొనేసియా కూడా ఉంది. ఇక రెండో కారణంగా అగ్నిపర్వతాన్ని చెబుతారు. ఇండొనేసియా మొత్తం ఓ భారీ అగ్నిపర్వతంపై ఉంది. భూమిలోపల ఉన్న ఆ అగ్ని పర్వతం యాక్టివ్‌గా ఉంది. దాని నుంచి వచ్చే అతి తీవ్ర ఒత్తిడి వల్ల అక్కడి భూ పలకాలు కదులుతున్నాయి. ఫలితంగానే భూకంపాలు (Earthquake) వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Earth quake, Earthquake, Indonesia