ఉగ్రవాదాన్ని పెంచి పోషించిన పాకిస్థాన్... ఆ దేశం ఉగ్ర రక్కసి వణికిస్తోంది. తాజాగా పాకిస్థాన్‌లో మరోసారి ఉగ్రవాదులు భారీ విధ్వంసానికి పాల్పడ్డారు. పెషావర్‌లోని ఓ మసీదు పేలుడు ఘటనలో దాదాపు 100మందికి పైగా ప్రాణాలకు కోల్పోయిన ఘటన మరవకముందే బలూచిస్థాన్ లోని క్వెట్టాలో భారీ బాంబు పేలుడు సంభవించింది. ఈ ఘటనలో అనేకమంది గాయపడినట్లు సమాచారం. ప్రాణ నష్టం కూడా వాటిల్లే అవకాశం కనిపిస్తోంది. గాయపడిన వారిని క్వెట్టాలోని సివిల్ ఆసుపత్రికి తరలించారు.
Breaking News : Huge blast in Quetta near FC Mussa Check Point #Quetta Balochistan pic.twitter.com/MDMmLR8mj5
— Ghulam Abbas Shah (@ghulamabbasshah) February 5, 2023
క్వెట్టా పోలీస్ ప్రధాన కార్యాలయం సమీపంలోని క్వెట్టా కంటోన్మెంట్ ప్రవేశం వద్ద ఈ భారీ బాంబు పేలుడు సంభవించింది. ఈ దారుణ సంఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియలో వైరల్ అవుతున్నాయి. పేలుడు జరిగిన వెంటనే పెద్ద ఎత్తున పొగ, ధూళి వ్యాపించింది. హుటాహుటిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, సహాయ కార్యకలాపాలు ప్రారంభించారు. పీఎస్ఎల్ క్రికెట్ మ్యాచ్ ఉండడంతో నగరంలో భద్రతను కట్టుదిట్టం చేశారు.
వారం ముందే పేలుడు:
గత జనవరి 30న పెషావర్‌లోని మసీదు దాడిలో 100 మంది మృతి చెందగా, 220 మందికి పైగా గాయపడ్డారు. మసీదు సెంట్రల్ హాల్‌లో ఈ పేలుడు సంభవించింది. అధికారికంగా తెహ్రీక్-ఇ-తాలిబాన్-ఇ-పాకిస్తాన్ అని పిలవబడే TTP, ఆఫ్ఘన్-పాకిస్థానీ సరిహద్దులో పనిచేస్తున్న వివిధ ఇస్లామిస్ట్ సాయుధ ఉగ్రవాదులు ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. ఈ ఆత్మాహుతి దాడి హై సెక్యూరిటీ పోలీస్ లైన్స్ ఏరియాలో జరిగింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Pakistan