HSBC: హెచ్ఎస్‌బీసీలో 10,000 ఉద్యోగాలకు ముప్పు

HSBC jobs cut | ఆగస్టులో హెచ్ఎస్‌బీసీ మధ్యంతర సీఈఓగా నియోల్ క్విన్ బాధ్యతలు చేపట్టారు. ఖర్చులు తగ్గించే బాధ్యతల్ని నియోల్ క్విన్ మొదలుపెట్టారని తెలుస్తోంది.

news18-telugu
Updated: October 7, 2019, 11:14 AM IST
HSBC: హెచ్ఎస్‌బీసీలో 10,000 ఉద్యోగాలకు ముప్పు
HSBC: హెచ్ఎస్‌బీసీలో 10,000 ఉద్యోగాలకు ముప్పు (File Photo: Reuters)
news18-telugu
Updated: October 7, 2019, 11:14 AM IST
హెచ్ఎస్‌బీసీలో 10,000 మంది ఉద్యోగుల్ని తొలగించేందుకు కసరత్తు చేస్తోందని ఫైనాన్షియల్ టైమ్స్ కథనం పబ్లిష్ చేసింది. బ్యాంకింగ్ గ్రూప్‌లో ఖర్చులు తగ్గించాలని తాత్కాలిక చీఫ్ ఎగ్జిక్యూటీవ్ ఆఫీసర్ నియోల్ క్విన్ ఆదేశించడంతో ఉద్యోగాల కోత తప్పదని తెలుస్తోంది. ఎక్కువగా వేతనాలు అందుకుంటున్నవారిని ఉద్యోగాల నుంచి తొలగిస్తారన్న చర్చ జరుగుతోంది. ఈ నెలాఖరులో మూడో త్రైమాసిక ఫలితాలు వెల్లడించే సమయంలో ఉద్యోగాల కోత, ఖర్చులు తగ్గించుకునే చర్యల గురించి హెచ్ఎస్‌బీసీ ప్రకటించే అవకాశముంది. అయితే ఉద్యోగాల కోత అంశంపై హెచ్ఎస్‌బీసీ స్పందించలేదు.

గతంలో సీఈఓగా పనిచేసిన జాన్ ఫ్లింట్ కొంతకాలం క్రితం అనూహ్యంగా తప్పుకున్నారు. ఖర్చులు తగ్గించుకోవడం విషయంలో ఛైర్మన్ మార్క్ టక్కర్‌తో విభేదాలు రావడంలో ఫ్లింట్ పదవి నుంచి తప్పుకొన్నారని ప్రచారం జరుగుతోంది. దీంతో ఆగస్టులో హెచ్ఎస్‌బీసీ మధ్యంతర సీఈఓగా నియోల్ క్విన్ బాధ్యతలు చేపట్టారు. ఖర్చులు తగ్గించే బాధ్యతల్ని నియోల్ క్విన్ మొదలుపెట్టారని తెలుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఆర్థిక పరిస్థితుల కారణంగా హెచ్ఎస్‌బీసీ ఉద్యోగాల కోత ద్వారా ఖర్చుల్ని తగ్గించుకునే పనిలో ఉన్నట్టు తెలుస్తోంది. అమెరికా చైనా మధ్య వాణిజ్య యుద్ధం, హాంకాంగ్ మార్కెట్‌లో అనిశ్చితి, బ్రెగ్జిట్ లాంటి అంశాలు ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక పరిస్థితులపై ప్రభావం చూపిస్తున్నాయి.

Samsung Galaxy Fold: ఈ స్మార్ట్‌ఫోన్ మడతపెట్టొచ్చు... ఎలా ఉందో చూడండి





ఇవి కూడా చదవండి:

Flipkart Diwali Sale: ఫ్లిప్‌కార్ట్ మరో సర్‌ప్రైజ్... దీపావళికి ముందే మరో సేల్

Reliance Offers: రిలయెన్స్ డిజిటల్‌లో 'ఫెస్టివల్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్'... కేజీ బంగారం గెలుచుకునే ఛాన్స్
Loading...
Good News: కేబుల్ టీవీ యూజర్లకు శుభవార్త... రూ.130 చెల్లిస్తే 150 ఛానెళ్లు
First published: October 7, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...