#HowdyModi : సోషల్ మీడియాలో ట్రెండ్ సెట్ చేసిన హౌడీ మోదీ...

#HowdyModi : హౌడీ మోదీ సభ సెన్సేషన్ సృష్టిస్తుందని అందరికీ తెలుసు. కానీ... ఈ రేంజ్‌లో సోషల్ మీడియాపై అది తుఫానులా చెలరేగుతుందని ఎవరూ ఊహించలేదు.

Krishna Kumar N | news18-telugu
Updated: September 23, 2019, 7:32 AM IST
#HowdyModi : సోషల్ మీడియాలో ట్రెండ్ సెట్ చేసిన హౌడీ మోదీ...
సోషల్ మీడియాలో ట్రెండ్ సెట్ చేసిన హౌడీ మోదీ... (Credit - Twitter)
  • Share this:
#ModiInHouston : సోషల్ మీడియా ఎంతో పవర్ ఫుల్. చాలా ఛానెళ్లు, మీడియా సంస్ధలు, వార్తా పత్రికల వంటివి... ఎవరో ఒకరికి కొమ్ముకాస్తూ... వాళ్లకు అనుకూలంగా వార్తలు ఇస్తున్న ఈ రోజుల్లో సోషల్ మీడియాలో మాత్రం అలాంటి పనికిమాలిన కుళ్లు, కుట్రలు లేవు. ప్రజలే స్వయంగా తమ అభిప్రాయాల్ని కుండ బద్ధలు కొడతారు అక్కడ. అందుకే సోషల్ మీడియాలో ఏది రచ్చ చేస్తే... అదే నిజమైన రచ్చ కింద లెక్క. తాజాగా సోషల్ మీడియాలో అమెరికా హోస్టన్‌లో జరిగిన హౌడీ మోదీ సభ దుమ్మురేపుతోంది. ఈ సభలో ప్రధాని మోదీ, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పాల్గొని ప్రసంగించడంపై నెటిజన్లు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. దీనిపై కొన్ని నెగెటివ్ కామెంట్లు వస్తున్నప్పటికీ... పాజిటివ్‌గా వస్తున్న కామెంట్ల ముందు అవి ఏమాత్రం నిలబడట్లేదు.



ప్రధానంగా సోషల్ మీడియాలో కీలకమైన ట్విట్టర్‌లో #Trump మొదటి ట్రెండింగ్ హ్యాష్ ట్యాగ్‌గా నిలిచింది. దీన్లో ఇప్పటివరకూ... 18 లక్షలకు పైగా ట్వీట్లు ఉన్నాయి.



ఇక #HowdyModi రెండో ట్రెండింగ్ హ్యాష్ ట్యాగ్‌గా నిలిచింది. దీన్లో ఇప్పటివరకూ 6 లక్షల దాకా ట్వీట్లున్నాయి.



అలాగే మూడో ట్రెండింగ్‌ హ్యాష్ ట్యాగ్‌గా... #ModiInHouston నిలిచింది. ఇందులో దాదాపు 80 వేల ట్వీట్లున్నాయి. ఇంకా వెల్లువలా వస్తూనే ఉన్నాయి. ఇలా టాప్ టెన్ ట్రెండింగ్ హ్యాష్ ట్యాగ్‌లలో మూడు... హౌడీ మోదీ సభపైనే సాగుతుండటం విశేషం.

ఈ సందర్భంగా... నెటిజన్లు పెడుతున్న ట్వీట్లలో కొన్ని :

















Published by: Krishna Kumar N
First published: September 23, 2019, 7:32 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading