Howdy Modi : ప్రధాని మోదీ, ట్రంప్ ప్రస్తావించిన ప్రధాన అంశాలు ఇవీ...

Howdy Modi : మూడు గంటలపాటూ సాగిన హౌడీ మోదీ సభపై ప్రపంచ దేశాలు చర్చించుకుంటున్నాయి. అమెరికా, భారత్ కలిసి భవిష్యత్తును ఎలా చిత్రించబోతున్నాయన్న అంశంపై చర్చ సాగుతోంది.

Krishna Kumar N | news18-telugu
Updated: September 23, 2019, 7:03 AM IST
Howdy Modi : ప్రధాని మోదీ, ట్రంప్ ప్రస్తావించిన ప్రధాన అంశాలు ఇవీ...
ప్రధాని మోదీ, ట్రంప్ ప్రస్తావించిన ప్రధాన అంశాలు ఇవీ... (Credit - Twitter - Amit Shah)
Krishna Kumar N | news18-telugu
Updated: September 23, 2019, 7:03 AM IST
Howdy Modi : అమెరికా... హోస్టన్‌లో జరిగిన చారిత్రక హౌడీ మోదీ సభకు అంచనాలను మించి స్పందన వచ్చింది. ప్రధానంగా... అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్... భారతీయుల పట్ల చూపిన అభిమానం, ప్రాధాన్యం... ఎన్నారైలను కట్టిపడేసింది. అందువల్ల హౌడీ మోదీ సభ... రెండు దేశాల మధ్యా సత్సంబంధాల్ని మరింత పెంచుతోందనడంలో సందేహం అక్కర్లేదు. ఐతే... భారతీయులకు వీసాలు ఇతరత్రా చాలా అంశాల్లో ఇన్నాళ్లూ ట్రంప్ కాస్త మొండిగానే వ్యవహరించారు. అలాంటి ఆయన... తాజా సభలో మాత్రం... ఫుల్ పాజిటివ్‌గా మాట్లాడటం భారతీయులకు... ముఖ్యంగా అమెరికాలో ఉంటున్న ఎన్నారైలకు కలిసొచ్చే అంశం. అందువల్ల అసలీ సభలో ప్రధానంగా ఏయే అంశాలపై చర్చ జరిగిందనే దానిపై ప్రపంచ దేశాలు ఆసక్తిగా తెలుసుకుంటున్నాయి. మనం కూడా ఫటాఫట్ తెలుసుకుందాం.


హౌడీ మోదీ సభలో ప్రస్తావించిన అంశాలు :


1. సభ నిర్వహణ : ప్రధాని మోదీ, అమెరికా అధ్యక్షుడు ట్రంప్... ఒకే వేదికపైకి రావడం, 40 వేల మంది ఎన్నారైలు హాజరు కావడంతో ఈ సభ ప్రపంచ రాజకీయాల్లో హైలెట్‌గా నిలిచింది.
Loading...


2. కాశ్మీర్ అంశం : కాశ్మీర్‌పై ప్రధాని మాట్లాడుతూ... ఆర్టికల్ 370 రద్దు దాని సంబంధిత అంశాల్ని ప్రస్తావిస్తున్నప్పుడు... అమెరికా కాంగ్రెస్ సెనెటర్లు స్టాండింగ్ ఒవేషన్ (నిల్చొని గౌరవ వందనం) ఇచ్చారు. అదే సమయంలో... ఎన్నారైల నుంచీ భారీ స్పందన వచ్చింది. అందరూ నవ్వుతూ భారత ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతించారు.


3. ఆర్థిక వ్యవస్థ : ఆర్థిక అంశాలపై భారత ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు, పాలసీలను ట్రంప్ మెచ్చుకున్నారు. ఈ పాలసీలు... పేదరికం నుంచీ దేశ ప్రజలను అభివృద్ధి వైపు నడిపిస్తాయన్నారు.


4. ఉగ్రవాదం : ఉగ్రవాదాన్ని అంతమొందించే విషయంలో ఇటు మోదీ, అటు ట్రంప్... ఇద్దరూ ఒకే మాటపై నిలబడ్డారు. ఉగ్రవాదంపై పోరులో... భారత్, అమెరికా నిర్ణయాలు ఒకేలా ఉన్నాయని ట్రంప్ అభినందించారు.


5. సరిహద్దు రక్షణ : ఇండియా, అమెరికా రెండు దేశాలూ... తమ సరిహద్దుల రక్షణ కోసం పనిచేస్తున్నాయని ట్రంప్ చెప్పడం హైలెట్ అయ్యింది. జమ్మూకాశ్మీర్ విషయంలో కేంద్రం తీసుకుంటున్న నిర్ణయాల్ని ట్రంప్ పరోక్షంగా సమర్థించినట్లైంది.


6. వీసాలు : ఇండియన్ అమెరికన్లకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చేలా తమ పాలనా యంత్రాంగం పనిచేస్తోందని ట్రంప్ అన్నారు. ఇండియన్ అమెరికన్లకు చట్టబద్ధత, ఉద్యోగాల కల్పనకు కృషి చేస్తున్నామన్నారు.


7. పెట్టుబడులు : అమెరికాలో భారత్ పెడుతున్న పెట్టుబడులను ట్రంప్ స్వాగతించారు. అలాగే... తాము కూడా ఇండియాలో పెట్టుబడులు పెడుతున్నామనీ, ఉద్యోగాలు కల్పిస్తున్నామనీ తెలిపారు.
First published: September 23, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...