Howdy Modi : ప్రపంచ రాజకీయాల్లో చరిత్రాత్మక రోజు : అమిత్ షా

Howdy Modi : హోస్టన్‌లో జరిగిన హౌడీ మోదీ సభపై హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ప్రపంచ రాజకీయాల్ని మరో మలుపు తిప్పే అంశంగా దీన్ని భావిస్తున్నాయి బీజేపీ వర్గాలు.

Krishna Kumar N | news18-telugu
Updated: September 23, 2019, 6:34 AM IST
Howdy Modi : ప్రపంచ రాజకీయాల్లో చరిత్రాత్మక రోజు : అమిత్ షా
హౌడీ మోదీ సభలో ప్రసంగిస్తున్న మోదీ (Credit - Twitter - Amit shah)
Krishna Kumar N | news18-telugu
Updated: September 23, 2019, 6:34 AM IST
Howdy Modi : అమెరికా... హోస్టన్‌లో జరిగిన హౌడీ మోదీ సభ... ప్రపంచ రాజకీయాల్లో ఓ చరిత్రాత్మక దినం అన్నారు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా. రెండు శక్తిమంతమైన దేశాల అధినేతలు తమ అభిప్రాయాలు, ఆలోచనలూ పంచుకోవడం, ప్రపంచ అభివృద్ధికి సంబంధించిన స్వప్నాల సాకారం కోసం కలిసి ముందుకుసాగడాన్ని ఇదివరకు ఎప్పుడూ ఎవరూ చూడని అంశంగా అభివర్ణించారు అమిత్ షా. హౌడీ మోదీ తిరుగులేని సభలా జరిగిందన్న ఆయన... ఈ సభ... ప్రపంచ పటంపై శక్తిమంతమైన భారతదేశ పాదముద్రను బలంగా వేసిందన్నారు. ప్రధాని మోదీ పాపులారిటీ... ప్రపంచవ్యాప్తంగా విస్తరించిందన్న ఆయన... అది భారత దేశ ప్రజలకు ఓ గుర్తింపుగా చెప్పారు. ప్రధాని మోదీ నాయకత్వానికి హౌడీ మోదీ సభ నిదర్శనమన్నారు. ఈ సందర్భంగా మోదీకి థాంక్స్ చెబుతున్నానని ట్వీట్ చేశారు అమిత్ షా.


ఇండియా రక్షణతో ఉందనీ, ఐకమత్యంతో ఉందనే బలమైన సందేశాన్ని ప్రపంచానికి హౌడీ మోదీ సభ ఇచ్చిందన్న అమిత్ షా... సరికొత్త భారత్ ఆవిష్కృతమవుతోందని అన్నారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడుతున్న భారత్ వెంట నేడు ప్రపంచమంతా నిలిచిందన్నారు అమిత్ షా.







First published: September 23, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...