Union
Budget 2023

Highlights

హోమ్ /వార్తలు /అంతర్జాతీయం /

Delta Variant: స్కూల్లోకి డెల్టా వేరియంట్.. ఎలా ప్రవేశించిందో తెలుసా?

Delta Variant: స్కూల్లోకి డెల్టా వేరియంట్.. ఎలా ప్రవేశించిందో తెలుసా?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Delta Variant: పేరెంట్స్... మీ పిల్లల్ని స్కూలుకు పంపాలా వద్దా అని ఆలోచిస్తున్నారా... అయితే ఓ స్కూల్లో జరిగిన ఘటన ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తోంది. ఆ వివరాలు మీకోసం.

Delta Variant: మన ఇండియాలో స్కూళ్ల కంటే... అమెరికాలోని స్కూళ్లలో కరోనా జాగ్రత్తలు చాలా ఎక్కువగా ఉంటాయని మనకు తెలుసు. ఐతే... కాలిఫోర్నియా (california)లోని ఓ స్కూల్లో డెల్టా వేరియంట్ (delta variant) ప్రవేశించింది. ఇదెలా సాధ్యమైంది అని అక్కడి అంటువ్యాధుల నియంత్రణ సంస్థ (CDC) లోతైన అధ్యయనం చేసింది. ఆ క్రమంలో.. వ్యాక్సిన్ వేసుకోని ఓ టీచర్ (teacher) నుంచి చాలా మంది పిల్లలకు డెల్టా వేరియంట్ సోకిందనీ... ఆ పిల్లల (students) ద్వారా వారి కుటుంబ సభ్యులకూ సోకిందని తేలింది. షాకింగ్ విషయమే కదా!

CTC చెప్పిందేంటంటే... స్కూళ్లలో అన్ని రకాల కరోనా జాగ్రత్తలూ (precautions) తీసుకుంటే... ఎలాంటి సమస్యా ఉండదు. అదే తీసుకోకుండా రాజీపడితే మాత్రం కరోనా సోకడం ఖాయం అని చెప్పింది. నిజమే కదా.!

డేంజరస్ డెల్టా:

అసలే డెల్టా వైరస్ ఈజీగా వ్యాపించే రకం. దానికి తోడు ఆ టీచర్ వ్యాక్సిన్ (vaccine) వేసుకోలేదు. కాబట్టి ఆమెలో వైరల్ లోడ్ ఎక్కువగా ఉంది. స్కూల్లో పాఠం చెబుతూ మాస్క్ పెట్టుకోలేదు. పైగా గట్టిగా అరుస్తూ లెసన్స్ చెప్పడంతో వైరస్ గాల్లోకి చేరింది. ఆటోమేటిక్‌గా స్కూల్ తరగతి గదిలోని 24 మందిలో 12 మంది పిల్లలకు అది సోకింది. వాళ్ల నుంచి కుటుంబాల సభ్యులకు సోకింది. ఇలా మొత్తం 26 మందికి వైరస్ సోకింది అని CDC చెప్పింది.

అమెరికాలోని కాలిఫోర్నియా సహా చాలా రాష్ట్రాల్లో స్కూళ్లను తెరిచారు (reopen). ఐతే... టీచర్లు, నాన్ టీచింగ్ సిబ్బంది అందరికీ వ్యాక్సిన్ ఇంకా వెయ్యలేదు. అదే సమస్యగా మారుతోంది. కొంత మంది టీచర్లు సూట్ వేసుకొని వస్తున్నారు. ఆ సూట్ కారణంగా... వాళ్లకు కరోనా ఉన్నా.. వాళ్ల నుంచి పిల్లలకు సోకకుండా జాగ్రత్త పడుతున్నారు.

మన దేశంలో కూడా చాలా స్కూళ్లు ఓపెన్ అయ్యాయి. మరి టీచర్లు, నాన్ టీచింగ్ సిబ్బంది అందరికీ వ్యాక్సిన్ డోసులు (vaccine dose) పడ్డాయా అంటే డౌటే. వ్యాక్సిన్ వేసుకోని టీచర్ క్లాస్‌రూంకి వచ్చి పాఠాలు చెబితే... ఆ టీచర్ ద్వారా పిల్లలకు కరోనా సోకదు అనే గ్యారెంటీ లేదు. అంటే వైరస్ విషయంలో రాజీ పడుతున్నట్లే.

పిల్లలే వైరస్ స్ప్రెడ్డర్లు:

కరోనా చాలా చిత్రంగా ఉంది. పిల్లలకు సోకితే చాలా మందిలో లక్షణాలు కనిపించట్లేదు. ఆ పిల్లలు స్కూళ్ల నుంచి ఇంటికి వచ్చి తల్లిదండ్రులు, అమ్మమ్మ, నాన్నమ్మలు ఇలా పెద్దవాళ్లను కలుస్తున్నారు. దాంతో పిల్లల్లోని కరోనా వైరస్... పెద్దవాళ్లకు చేరి... వారి లైఫ్ రిస్కులో పడుతోంది. ఇదే సమస్య అవుతోంది.

వ్యాక్సినే కీలకం:

స్కూళ్లు తెరవకపోతే పిల్లల్లో మానసిక సమస్యలు రావచ్చనే వాదన ఉంది. కాబట్టి స్కూళ్లను తెరిచినా కరోనా సోకకూడదంటే... వ్యాక్సిన్ త్పపనిసరిగా వెయ్యాలి. 2 డోసులు వేసి ఉంటే ఇంకా మంచిది.

ఇది కూడా చదవండి: Telangana: నేటి నుంచి తెలంగాణలో స్కూల్స్, కాలేజీలు ప్రారంభం.. అందరిలోనూ అదే ఆసక్తి

కరోనాపై మానవాళి పోరు ఇప్పట్లో పోయేది కాదు. మరికొన్నేళ్లపాటూ ఇది ఉంటుందనే అంచనాలున్నాయి. ఎందుకంటే వైరస్ రోజురోజుకూ రూపాంతరం చెందుతూ కొత్త వేరియంట్లు (new strains)గా మారుతోంది. మారిన ప్రతిసారీ మరింత బలంగా, వేగంగా వ్యాపించగలుగుతోంది. కాబట్టి... ఇప్పట్లో కరోనా పోదు అనుకోవచ్చు. అందువల్ల దానితో కలిసి జీవిస్తూ... దాన్ని అంటించుకోకుండా ఉండటం ముఖ్యం అంటున్నారు నిపుణులు.

First published:

Tags: America, Corona, Covid-19, Delta Variant, Private teachers, Schools reopening

ఉత్తమ కథలు