Home /News /international /

Space tour cost: అంతరిక్ష పర్యటనకు వెళ్లడానికి ఎంత ఖర్చవుతుంది... ఆ లెక్కేంటి?

Space tour cost: అంతరిక్ష పర్యటనకు వెళ్లడానికి ఎంత ఖర్చవుతుంది... ఆ లెక్కేంటి?

స్పేస్ టూరింజంకు ఎంత ఖర్చు అవుతుంది? ఆ లెక్క ఎలా వేస్తారు? (Twitter)

స్పేస్ టూరింజంకు ఎంత ఖర్చు అవుతుంది? ఆ లెక్క ఎలా వేస్తారు? (Twitter)

న్యూ స్పేస్‌ ఏజ్‌ పేరుతో ఇటీవల కాలంలో చాలామంది అంతరిక్ష ప్రయాణం అంటే ఆసక్తి చూపిస్తున్నారు. అలా వర్జిన్‌ గెలాటిక్‌, స్పేస్‌ ఎక్స్ వంటి సంస్థలు అంతరిక్ష విహారానికి దారులు సుగమమం చేస్తున్నాయి.

అంతరిక్ష ప్రయాణం (Space Tour) ఇంకెంతో దూరంలో లేదని నిపుణులు చెబుతున్నారు. మొన్నీ మధ్య రెండు బృందాలు అంతరిక్ష ప్రయాణం చేసి వచ్చాయి కూడా. అయితే ఈ ప్రయాణం చూసినంత సులభమూ కాదు, డబ్బులు వెచ్చించేంత చౌక కూడా కాదు. అసలు అంతరిక్ష ప్రయాణం కోసం స్పేస్‌ క్రాఫ్ట్‌ ఎక్కాలంటే ఎంత ఖర్చవుతుంది. ఆ లెక్కేంటో చూద్దాం!

న్యూ స్పేస్‌ ఏజ్‌ పేరుతో ఇటీవల కాలంలో చాలామంది అంతరిక్ష ప్రయాణం అంటే ఆసక్తి చూపిస్తున్నారు. అలా వర్జిన్‌ గెలాటిక్‌, స్పేస్‌ ఎక్స్‌ , వర్జిన్‌ అట్లాంటిక్‌, ఎక్స్‌కార్‌ ఎయిరోస్పేస్‌, బ్లూ ఆరిజన్‌, అర్మాడిల్లో ఎయిర్‌స్పేస్‌ లాంటివి స్పేస్‌ టూరిజం నిర్వహించే పనిలో ఉన్నాయి. వాటి ధరలు చూస్తే ఒక్కో వ్యక్తికి కనీసం 4,50,000 డాలర్ల వరకు ఖర్చవుతుందట. అయితే ఇటీవల జెఫ్‌ బెజోస్‌ ఇటీవల అంతరిక్ష ప్రయాణం చేసిన న్యూ షెపర్ట్‌ టికెట్‌ బిడ్డింగ్‌ కంటే తక్కువేనట.

స్పేస్‌ టూరిజం ద్వారా... బిజినెస్‌ పర్సన్స్‌కు రిక్రియేషన్‌ లాంటిది దొరుకుతుందని ప్రాథమికంగా అనుకుంటున్నారు. వ్యోమగాములు కానివారు కూడా అంతరిక్షయానం చేయడం ఈ ప్రాజెక్టుల ఉద్దేశం. ఇదంతా నాన్‌ సైంటిఫిక్‌గా సాగుతుంది. స్పేస్‌ షిప్‌ 2లో ఎనిమిది మంది ప్రయాణించొచ్చు. అందులో ఇద్దరు పైలెట్లు ఉంటారు. దీనికి సంబంధించి టికెట్ల అమ్మకాలను ప్రారంభించారు. గతంలో ప్రకటించిన ధరకు ఇది డబుల్‌ కావడం గమనార్హం.

ఇక టికెట్‌ల విధానం చూస్తే 1000 డాలర్లు ఫుల్లీ రిఫండబుల్‌ ఫీజుతో రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలి. టికెట్‌లు అందుబాటులోకి వచ్చినప్పుడు ముందుగా రిజిస్టర్‌ చేసుకున్నవాళ్లకు సమాచారం అందిస్తారు. టికెట్‌ ధర ఇప్పటివరకు నిర్ణయించలేదు. అయితే గతంలో చెప్పిన 2,50,000 డాలర్ల కంటే ఎక్కువే ఉంటుందని మాత్రం తెలుస్తోంది. ఇప్పటివరకు 600 మందికిపైగా డబ్బులు చెల్లించారట. అందులో సింగర్‌ జస్టిస్‌ బీబర్‌, లియోనార్డో డికాప్రియో లాంటి ప్రముఖులు ఉన్నారట.

స్పేస్‌ ఫ్లయిట్స్‌ ఆదరణ వస్తుండటం చూసి సంస్థ ఏటా వందలాది ఫ్లైట్స్‌ నిర్వహించాలని అనుకుంటోందని సమాచారం. అమెరికాలో ని న్యూ మెక్సికోలో ఉన్న స్పేస్‌ పోర్టు నుంచి ఈ ఫ్లైట్స్‌ నిర్వహిస్తారట. ఈ స్పేస్‌ ఫ్లయిట్‌ లో విహరించాలనుకుంటే... మూడు రోజుల శిక్షణ ఉంటుందట. అలా అంతరిక్షలోకి వెళ్లాక కొన్ని నిమిషాల పాటు అంతరిక్షంలో విహరించే అనుభూతిని ఆస్వాదించొచ్చు. ఆ తర్వాత తిరిగి భూమికి చేరుకోవచ్చు.

ఈ బిడ్డింగ్‌లో ప్రపంచవ్యాప్తంగా 159 దేశాల నుంచి 7,600 మంది రిజిస్టర్‌ చేసుకున్నారు. ఆ బిడ్డింగ్‌లో గరిష్ఠంగా 28 మిలియన్‌ డాలర్లు పలికింది. అంతేకాదు 50 వేల మంది అయితే ఏకంగా జెఫ్‌ బెజోస్‌ అంతరిక్షంలోకి వెళ్లాక తిరిగి భూమి మీదకు రావొద్దని ఆన్‌లైన్‌లో కోరారు కూడా.
Published by:John Naveen Kora
First published:

Tags: Jeff Bezos, Space, Tourism

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు