107వ పుట్టిన రోజు జరుపుకున్న బామ్మ... దీర్ఘాయుష్షు సీక్రెట్ ఇదేనట

Louise Signore : న్యూయార్క్‌కి చెందిన లూయిస్ సిగ్నోర్... బుధవారం 107వ పుట్టిన రోజు జరుపుకుంది. ఆమె ఆరోగ్య రహస్యమేంటి? ఇంతకాలం జీవించగలగడానికి కారణాలేంటో తెలుసుకుందాం.

Krishna Kumar N | news18-telugu
Updated: August 2, 2019, 1:16 PM IST
107వ పుట్టిన రోజు జరుపుకున్న బామ్మ... దీర్ఘాయుష్షు సీక్రెట్ ఇదేనట
లూయిస్ సిగ్నోర్ (Louise Signore - Twitter - Eliot Engel)
  • Share this:
ఎక్కువ కాలం జీవించాలి... ఆరోగ్యంగా బతకాలి అనుకునేవారు న్యూయార్క్‌కి చెందిన లూయిస్ సిగ్నోర్‌ను ఆదర్శంగా తీసుకోవచ్చు. బుధవారం ఆమె 107వ పుట్టిన రోజు జరుపుకుంది. ఇందుకోసం కూప్ సిటీలో జాసా బార్టో సీనియర్ సెంటర్‌లో బంధువులు వేడుకలు జరిపారు. మరి ఆమె ఆరోగ్య రహస్యమేంటి? అన్నది చాలా మందికి కలిగిన ప్రశ్న. ఈ బామ్మ పెళ్లి చేసుకోలేదు. అదే తన ఆరోగ్య రహస్యం కావచ్చని ఆమె చెబుతోంది. రోజువారీ పనులు చేసుకుంటూనే... ఆరోగ్యకరమైన ఆహారం తినడం కూడా తన దీర్ఘాయుష్షుకి కారణం అయివుండొచ్చని అంటోంది. చాలా మంది ఎక్సర్‌సైజ్‌లు చేస్తారు. ఆమె కూడా చేస్తుంది. చాలా మంది డాన్స్ చేస్తారు. ఆమె కూడా చేస్తుంది. లంచ్ తర్వాత ఆమె బింగో ఆడుతుంది. ఆమెకు బీపీ ఉంది. అది కంట్రోల్‌లో ఉండేందుకు మందులు వాడుతోంది. అంత మాత్రాన ఆమె ఎప్పుడు దిగులు చెందలేదు. రోజూ హుషారుగానే ఉంటుంది.


బుధవారం లూయిస్ బర్త్ ‌డే వేడుకలకు 100 మంది దాకా అతిథులు వచ్చారు. పింక్ అవుట్‌ఫిట్‌లో, ముత్యాల హారంతో మెరిసిపోయింది. లూయిస్‌కి వాకింగ్ స్టిక్ అవసరం లేదనీ, వీల్ చైర్‌తో పనిలేదని... షాపింగ్ కూడా ఆమె స్వయంగా చేసుకుంటుందని... ఆమెకు ఉన్న అనేక మంది స్నేహితుల్లో ఒకరైన దెబోరా విటేకెర్ తెలిపారు.లూయిస్ సిగ్నోర్ 1912లో మాన్‌హట్టన్‌లో జన్మించింది. 14 ఏళ్ల వయసు నుంచీ న్యూయార్క్‌లోని బ్రాంక్స్‌లో జీవిస్తోంది. ఓవరాల్‌గా మనకు అర్థమయ్యేది ఒకటే. ఏదో కోల్పోయినట్లు కాకుండా... ఎప్పుడూ సంతోషంగా, ఉత్సాహంగా ఉంటే... ఎక్కువకాలం బతికే అవకాశం ఉందని లూయిస్‌ని బట్టీ తెలుసుకోవచ్చు. మరి మీరు కూడా అదే ఫార్ములా ఫాలో అయిపోతారా.
Published by: Krishna Kumar N
First published: August 2, 2019, 1:16 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading