హోమ్ /వార్తలు /అంతర్జాతీయం /

Baby Deliveries: 91 గంటల్లో 107 డెలివరీలు.. ప్రసవాల్లో రికార్డు సృష్టించిన ఆస్పత్రి

Baby Deliveries: 91 గంటల్లో 107 డెలివరీలు.. ప్రసవాల్లో రికార్డు సృష్టించిన ఆస్పత్రి

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

టెక్సాస్‌లో ఉన్న ఆండ్రూస్ ఉమెన్స్ హాస్పిటల్ వైద్యులు, నర్సుల కృషితో.. సదరు ఆసుపత్రి డెలివరీల్లో సరికొత్త రికార్డును నెలకొల్పింది. ఇక్కడి సిబ్బంది రోజుకు సగటున 16 డెలివరీలు చేయడం విశేషం. జూన్ 24 నుంచి 28 వరకు మొత్తం 91 గంటల్లోనే 107 మంది నిండు గర్భిణులకు వైద్యులు డెలివరీ చేశారు.

ఇంకా చదవండి ...

నవజాత శిశువును భూమిపై తీసుకురావడం కంటే అద్భుతమైన ప్రక్రియ ఇంకోటి ఉండదు. అది కేవలం వైద్యులకు మాత్రమే సాధ్యమవుతుంది. అలాంటిది తక్కువ సమయంలోనే రికార్డు స్థాయిలో డెలివరీలు చేసి రికార్డు సాధించింది అమెరికాలోని ఒక హాస్పిటల్. టెక్సాస్‌లో ఉన్న ఆండ్రూస్ ఉమెన్స్ హాస్పిటల్ వైద్యులు, నర్సుల కృషితో.. సదరు ఆసుపత్రి డెలివరీల్లో సరికొత్త రికార్డును నెలకొల్పింది. ఇక్కడి సిబ్బంది రోజుకు సగటున 16 డెలివరీలు చేయడం విశేషం. జూన్ 24 నుంచి 28 వరకు మొత్తం 91 గంటల్లోనే 107 మంది నిండు గర్భిణులకు వైద్యులు డెలివరీ చేశారు. ఈ క్రమంలో ఆండ్రూస్ హాస్పిటల్ గత రికార్డులను బద్దలుకొట్టింది. గతంలో 41 గంటల్లో 48 డెలివరీలు చేసిన రికార్డును ఈ వైద్యశాల అధిగమించింది. ఈ విషయాన్ని ఆసుపత్రి సిబ్బంది ఫేస్ బుక్ పేజీ ద్వారా పంచుకున్నారు.

గత ఏడాది డిసెంబర్, ఈ జనవరిలో రోజువారీ డెలివరీల సంఖ్య స్థిరంగా ఉందని చెప్పారు ఆండ్రూస్ ఉమెన్స్ హాస్పిటల్ లేబర్ అండ్ డెలివరీ నర్సు మెచెల్ స్టెమ్లీ. కానీ ఇప్పుడు జననాల రేటు ఊహించిన దానికంటే అధికంగా వచ్చిందని చెప్పారు. ఆ నాలుగు రోజుల్లో చాలా బిజీగా ఉన్నప్పటికీ ప్రపంచంలోకి నూతన జీవితాలను తీసుకురావడం, కుటుంబాలకు సహాయం చేయడం చాలా ఆనందంగా ఉందని స్టెమ్లీ తెలిపారు. అధిక సంఖ్యలో ప్రసవాలు జరిగిన తర్వాత తల్లులను చేరవేసే ప్రక్రియను వేగవంతం చేసే విషయాల్లో ఆసుపత్రి సిబ్బంది బాగా వ్యవహరించినట్లు చెప్పారు.

తల్లులను వీలైనంత త్వరగా తరలించామని, ప్రసవానంతరం రికవరీ తర్వాత వారిని వేరే గదికి మార్చడంలో.. ఇతరులకు ఇబ్బంది కలగకుండా చూడటంలో సిబ్బంది బాగా పనిచేశారని హాస్పిటల్ యాజమాన్యం తెలిపింది. సమీప భవిష్యత్తులో జనన రేట్లు పెరిగే అవకాశముంది. గత సంవత్సరం ఈ ఆసుపత్రిలో 6000 ప్రసవాలను చేశారు. ఇందులో 100 కవలలు, ముగ్గురు కలిసి జన్మించినవారు కూడా ఉన్నారు.

First published:

Tags: America, Us news

ఉత్తమ కథలు