హాంకాంగ్‌లో దారుణం...అందరూ చూస్తుండగానే వ్యక్తిపై పెట్రోల్ పోసి నిప్పటించిన దుండగులు

పబ్లిగ్గా అంతా చూస్తుండగానే అతడి ఒంటిపై పెట్రోలు పోసి మంటపెట్టడంతో హాహాకారాలు మిన్నంటాయి. చుట్టుపక్కల వాళ్లు సైతం భయభ్రాంతులకు గురయ్యారు.

news18-telugu
Updated: November 11, 2019, 9:53 PM IST
హాంకాంగ్‌లో దారుణం...అందరూ చూస్తుండగానే వ్యక్తిపై పెట్రోల్ పోసి నిప్పటించిన దుండగులు
హాంకాంగ్‌లో దారుణం...అందరూ చూస్తుండగానే వ్యక్తిపై పెట్రోల్ పోసి నిప్పటించిన దుండగులు
  • Share this:
హాంకాంగ్‌ ఆందోళనలో దారుణం చోటుచేసుకుంది. నిరసనకారుల్లోని కొందరు అసాంఘిక శక్తులు ఓ పౌరుడిని సజీవ దహనం చేసిన ఘటన కలకలం రేపుతోంది. పబ్లిగ్గా అంతా చూస్తుండగానే అతడి ఒంటిపై పెట్రోలు పోసి మంటపెట్టడంతో హాహాకారాలు మిన్నంటాయి. చుట్టుపక్కల వాళ్లు సైతం భయభ్రాంతులకు గురయ్యారు. కాగా ఈ ఘటన హాంగ్ కాంగ్ పాలిటెక్నిక్ కళాశాల క్యాంపస్ లో చోటు చేసుకుంది.  సోమవారం సాయంత్రం ఈ దారుణం చోటు చేసుకుంది. దీంతో పోలీసులు ఓ నిరసనకారుడిపై కాల్పులు జరిపారు. ప్రస్తుతం అతడి పరిస్థితి విషమంగా మారింది. ఇదిలా ఉంటే హాంకాంగ్ నుంచి చైనాకు నేరస్థులను అప్పగించే బిల్లుకు వ్యతిరేకంగా కొన్ని నెలలుగా హాంకాంగ్ లో ఆందోళనలు జరుగుతున్నాయి. అయితే ప్రస్తుతం ఈ ఆందోళనలు మిన్నంటాయి.

Published by: Krishna Adithya
First published: November 11, 2019, 9:53 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading