రికార్డ్స్‌ను తిరగరాస్తున్న ఆక్వామెన్‌ (సముద్ర పుత్రుడు)

చైనాలో కొన్ని రోజుల ముందే ఆక్వామెన్‌ సినిమాను విడుదల చేశారు. అక్కడ ఆక్వామెన్‌ విమర్శకుల, ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంటూ తొలివారంలోనే 93.6 మిలియన్‌ డాలర్లు (రూ.680 కోట్లు) వసూలుచేసిందని ట్రేడ్ వర్గాలు పేర్కొన్నాయి.

news18-telugu
Updated: December 12, 2018, 3:12 AM IST
రికార్డ్స్‌ను తిరగరాస్తున్న ఆక్వామెన్‌ (సముద్ర పుత్రుడు)
Photo: Twitter/@aquamanmovie
  • Share this:
అమెరికన్ సూపర్‌ హీరో చిత్రం 'ఆక్వామెన్‌' రికార్డులను తిరగరాస్తుంది. ఆక్వామెన్‌, చైనాలో విడుదలైన మొదటి వారంలో రూ.680 కోట్లు వసూలు చేసినట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి జేమ్స్‌ వాన్‌ దర్శకత్వం వహించింది తెలిసిందే. ఈ చిత్రాన్ని వార్నర్‌ బ్రదర్స్‌, డీసీ ఫిల్మ్స్‌ నిర్మించాయి. ఆక్వామెన్‌‌గా జోసెఫ్‌ జేసన్‌‌ చేశాడు. మిగితా పాత్రల్లో ఆంబర్ హర్డ్‌‌, ప్యాట్రిక్‌ విల్సన్‌ తదితరులు నటించారు. ఈ సినిమాను సుమారు రూ. 1160 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించారు. నీటిలో మనుగడ సాగిస్తున్న ఏడు రాజ్యాలు, వాటి మధ్య జరిగే యుద్ధాన్ని ఎంతో ఉత్కంఠ భరితంగా, చూసే ప్రేక్షకులను అబ్బురపరిచేలా చిత్రీకరించారు.

ఆక్వామెన్‌ ఈనెల 14న ఇండియాలో విడుదల అవ్వనుంది. ఈ సినిమా తెలుగులో 'సముద్ర పుత్రుడు' గా రాబోతుంది. అంతేకాకుండా ఈ సినిమాను ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 40 దేశాల్లో కూడా విడుదల చేస్తున్నారు. ఉత్తర అమెరికాలో ఆక్వామెన్‌ క్రిస్‌మస్ సందర్బంగా ఈనెల 21న ప్రేక్షకులను అలరించడానకి రాబోతుంది. అయితే ఆక్వామెన్‌ సినిమాను, కొన్ని రోజుల ముందే చైనాలో విడుదలచేశారు. చైనాలో ఆక్వామెన్‌ విమర్శకుల నుంచి, ప్రేక్షకుల నుంచి ప్రశంసలు అందుకుంటూ తొలివారంలోనే 93.6 మిలియన్‌ డాలర్లు (రూ.680 కోట్లు) వసూలుచేసిందని ట్రేడ్ వర్గాలు పేర్కొన్నాయి. అంతేకాకుండా ఆక్వామెన్‌ సినిమా వసూళ్లు‘వండర్‌ ఉమన్‌’ఓపెనింగ్‌ వీకెండ్‌ వసూళ్ల కంటే మించి వచ్చాయనీ తెలియజేశారు.First published: December 12, 2018
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు