Willie Garson: ప్రముఖ నటుడు మృతి.. 'సెక్స్ అండ్ ద సిటీ' హీరో విల్లీ గార్సన్ ఇక లేరు

విల్లీ గార్సన్

ప్రముఖ హాలీవుడ్ ఎంటర్టైన్మెంట్ టీవీ HBO కూడా గార్సన్ మృతి పట్ల సంతాపం వ్యక్తం చేసింది. విల్లీ గార్సన్ చేసిన టీవీ షోలు, సేవలను మర్చిపోలేమని హెచ్‌బీవో ప్రతినిధి ఒకరు తెలిపారు.

  • Share this:
'సెక్స్ అండ్ ద సిటీ'(Sex and The City) సిరీస్ సినిమాలతో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ హాలీవుడ్ నటుడు విల్లీ గార్సన్ (Willie Garson) (57) మృతి చెందారు. గత కొంత కాలంగా పాంక్రియాటిక్ క్యాన్సర్‌(pancreatic cancer) తో బాధపడుతున్న ఆయన మంగళవారం కన్నుమూశారు. ఈ విషయాన్ని ఆయన కుమారుడు నాథన్ గార్సన్ (Nathon Garson) స్పష్టం చేశారు. ఇన్ స్టా (Instagram) వేదికగా తన తండ్రి మృతి గురించి తెలియజేశారు. కెరీర్ లో 75 సినిమాలు, 300 టీవీ ఎపిసోడ్లలో ఆయన కనిపించారు. "ఐ లవ్యూ నాన్న. నీ ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నా. నీ అడ్వెంచర్స్ అన్నింటినీ నాతో షేర్ చేసుకున్నందుకు ధన్యవాదాలు. జీవితంలో ఎంతో సాధించినందుకు సంతోషంగా ఉంది. మిమ్మల్ని చూసి గర్వపడుతున్నా" అని నాథన్ తన తండ్రి గురించి ఇన్ స్టాలో పోస్ట్ చేశారు.




కమల్ హాసన్ హోస్ట్‌గా తమిళ బిగ్‌బాస్ 5 ప్రసారానికి ముహూర్తం ఖరారు..

ప్రముఖ హాలీవుడ్ ఎంటర్టైన్మెంట్ టీవీ HBO కూడా గార్సన్ మృతి పట్ల సంతాపం వ్యక్తం చేసింది. విల్లీ గార్సన్ చేసిన టీవీ షోలు, సేవలను మర్చిపోలేమని హెచ్‌బీవో ప్రతినిధి ఒకరు తెలిపారు. "విల్లీ గార్సన్ తన జీవితాన్ని వెండితెరకే అంకితమిచ్చారు. హెచ్‌బీఓలో ఆయన చేసిన పాంథియోన్ పాత్రకు అత్యంత ఆదరణ లభించింది. దాదాపు 25 సంవత్సరాలు మా కుటుంబంలో సభ్యుడిగా ఉన్నారు. అతని మరణ వార్త మాకు తీరని వేదనను కలిగించింది. ఇందుకు ఎంతో చింతిస్తున్నాం. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం" అని సంస్థ ప్రతినిధి తెలిపారు.

మోహన్ బాబు అసలు వయసును బయటపెట్టిన ఆలీ.. మెగాస్టార్ పై కలెక్షన్ కింగ్ సంచలన వ్యాఖ్యలు..

గార్సన్ మృతి పట్ల పలువురు హాలీవుడ్ సినీ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సోషల్ మీడియా వేదికగా సంతాపం ప్రకటించారు.







Vijay Devarakonda AVD Multiplex : అట్టహాసంగా ప్రారంభమైన విజయ్

విల్లీ గార్సన్ అమెరికా న్యూజెర్సీలో 1964లో జన్మించారు. 13 ఏళ్లకే నటనలో శిక్షణ పొందారు. ఇందుకోసం వెస్లీ యునివర్సీటికి వెళ్లారు. హాలీవుడ్‌లో ఆయనకు మొదటి బ్రేక్ 'ఛీర్స్', ఫ్యామిలీ టైస్ అనే టీవీ షోల ద్వారా వచ్చింది. అతిథి పాత్రలే అయినప్పటికీ వీటిలో ఆయనకు బాగా గుర్తింపు లభించింది. సెక్స్ అండ్ ద సిటీ సిరీస్ తర్వాత గార్సన్ వెనక్కు తిరిగి చూసుకోలేదు. ఈ సిరీస్ ద్వారా అమెరికాలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. స్టాన్ ఫోర్డ్ బ్లాచ్ అనే పాత్రతో అందరి అభిమానాన్ని చూరగొన్నారు. విల్లీ చివరగా 'అండ్ జస్ట్ లైక్ దట్' అనే రీబూట్ సిరీస్ లో నటించారు. ఈ సిరీస్ ఈ ఏడాది చివర్లో HBOలో ప్రసారం కానుంది.
Published by:Shiva Kumar Addula
First published: