వరల్డ్ వైడ్‌గా సెన్సేషన్ క్రియేట్ చేసిన RRR సినిమాలో విలన్ పాత్ర అంటే బ్రిటీష్ పాలకుల సామ్రాజ్యాధిపతి పాత్రలో నటించిన హాలీవుడ్ నటుడు(Hollywood Actor) రే స్టీవెన్సన్ (Ray Stevenson)కన్నుమూశారు(Passed Away). విలక్షణమైన పాత్రల్లో నటించిన ఈ సెన్సేషనల్ యాక్టర్ మరణంపై హాలీవుడ్ చిత్రపరిశ్రమకు చెందిన పలువురితో పాటు టాలీవుడ్ అభిమానులు విచారం వ్యక్తం చేశారు. ట్రిపులార్ సినిమాలో ఎన్టీఆర్‌ని క్రూరంగా శిక్ష అమలు చేసే పాత్రలో ఆయన నటన అద్భుతం. 58ఏళ్ల రే స్టీవెన్సన్ మరణించినట్లుగా ఆయన పీఆర్‌ఓ అధికారికంగా వెల్లడించారు.
ట్రిపులార్ విలన్ ఇకలేడు..
రాజమౌళి దర్శకత్వం వహించిన ట్రిపులార్ సినిమాలో నెగిటివ్ రోల్ కింగ్‌గా రే స్టీవెన్సన్ మరణించాడు. బ్రిటీష్ సామ్రాజ్యానికి రాజుగా పాత్రకు తగినట్లుగా తన నటన, హావాభావాలు పలికించి మెప్పింటిన నటుడు ఆకస్మిక మరణం హాలీవుడ్, టాలీవుడ్ సినిమా అభిమానుల్ని షాక్‌కి గురి చేసింది. RRRసినిమాలో కీ రోల్ పోషించిన రే స్టీవెన్సన్ ప్రస్తుతం అషోకా అనే సిరీస్ వంటి చిత్రాలలో నటించారు. ఐరిష్ నటుడు రే స్టీవెన్సన్ ఆదివారం మరణానికి సంబంధించిన కారణాలు మాత్రం తెలియరాలేదు.
View this post on Instagram
బిగ్గెస్ట్ కెరియర్..
స్టీవెన్‌సన్ 1990లలో టీవీ షోలలో కెరియర్ ప్రారంభించాడు. ఆ తర్వాత 2000 సంవత్సరం నుండి హాలీవుడ్ చిత్రాలలో యాక్షన్ పాత్రలు పోషించాడు. ఆంటోయిన్ ఫుక్వా 2004 అడ్వెంచర్ మూవీ "కింగ్ ఆర్థర్" అతని మొదటి ప్రధాన చలనచిత్రం. నైట్స్ ఆఫ్ ది రౌండ్ టేబుల్‌లో ఒకటైన డాగోనెట్‌గా నటించాడు. 2008లో, స్టీవెన్సన్ వరుసగా పలు యాక్షన్ వార్ సినిమాల్లో నటించి మెప్పించాడు. స్టీవెన్సన్ తెరపై పనిషర్ పాత్రను పోషించిన మూడవ నటుడు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: RRR, Tollywood actor