news18-telugu
Updated: April 9, 2020, 10:28 AM IST
అలెన్ గార్ఫిల్డ్(ఫైల్ ఫోటో)
అమెరికాలో కరోనా కరాళనృత్యం చేస్తోంది. కరోనా దెబ్బకు సామాన్యులు, సంపన్నులు, సెలబ్రిటీలు అనే తేడా లేకుండా అంతా బెంబేలెత్తిపోతున్నారు. తాజాగా ఈ మహమ్మారి దెబ్బకు మరో హాలీవుడ్ సెలబ్రిటీ మృతి చెందారు. హాలీవుడ్ నటుడు అలెన్ గార్ఫిల్డ్ కరోనా సమస్యల కారణంగా మంగళవారం చనిపోయారు. ఆయన వయసు 80 ఏళ్లు. ఈ విషయాన్ని ఆయన సహచర నటి రోనీ బ్లాక్లే వెల్లడించారు. నాష్విల్లే, ది స్టంట్ వంటి గొప్ప చిత్రాల్లో నటించిన అలెన్ మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. సినిమాల్లోకి రాకముందు అమెచ్యూర్ బాక్సర్‌గా, స్పోర్ట్స్ రిపోర్టర్‌గా పనిచేశారు. న్యూయార్క్‌లోని యాక్టర్స్ స్టూడియోలో ఎలియా కజాన్, లీ స్ట్రాస్‌బెర్గ్‌లతో కలిసి నటనలో శిక్షణ తీసుకున్నారు. అనంతరం 1968 లో వచ్చిన 69 చిత్రంతో సినిమా పరిశ్రమలో అడుగుపెట్టారు. ఇక అలెన్ విలన్ ప్రాత్రల్లోనే అధికంగా నటించి ప్రేక్షకులను మెప్పించారు. వూడీ అలెన్, విమ్ వెండర్స్ వంటి అగ్ర దర్శకులతో కలిసి పనిచేసిన ఆయన చివరిసారి 2016లో విడుదలైన చీఫ్ జాబులో కనిపించారు.
Published by:
Kishore Akkaladevi
First published:
April 9, 2020, 10:28 AM IST