75 మంది టీనేజ్ అబ్బాయిలని ‘కాటేసిన’ సార్జంట్ మేజర్

75 మంది టీనేజర్లు కూడా టెస్టులు చేయించుకోవాలని వైద్యులు, పోలీసులు సూచించారు.

news18-telugu
Updated: November 8, 2018, 9:55 PM IST
75 మంది టీనేజ్ అబ్బాయిలని ‘కాటేసిన’ సార్జంట్ మేజర్
ప్రతీకాత్మక చిత్రం
news18-telugu
Updated: November 8, 2018, 9:55 PM IST
ధాయ్‌లాండ్‌లో ఓ సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. సైన్యంలో పనిచేసిన ఓ సార్జంట్ మేజర్‌ ఏకంగా టీనేజ్ అబ్బాయిల మీద లైంగికదాడికి పాల్పడ్డాడు. ఒకరు కాదు, ఇద్దరు కాదు. ఏకంగా 75 మందిని రేప్ చేశాడు. ధాయ్‌లాండ్‌లోని ఖోన్ కాన్‌ ప్రావిన్స్‌లో ఓ సోల్జర్‌ గే డేటింగ్ యాప్‌లో రిజిస్టర్ చేసుకున్నాడు. తనవి కానివి, ఎవరెవరివో అందమైన ప్రొఫైల్ ఫొటోలు పెట్టాడు. 13 నుంచి 18 ఏళ్ల వయసున్న అబ్బాయిలను ట్రాప్ చేశాడు. తనను కలవాలనుకుంటున్న వారి నుంచి తెలివిగా మోసం చేశాడు. మొదట వారితో పరిచయం పెంచుకున్నాడు. ఆ తర్వాత వారి నగ్న చిత్రాలు పంపించాలని కోరేవాడు. అలా ఫొటోలు పంపించిన తర్వాత మీటింగ్ ఏర్పాటు చేసుకునేవాడు. ఆ బాలలు వచ్చిన తర్వాత అసలు విషయం బయటపడేది. అయితే, అప్పటికే తన వద్ద ఉన్న వారి న్యూడ్ ఫొటోలను చూపించి వారిని బెదిరించేవాడు. వారిపై లైంగిక దాడికి పాల్పడేవాడు. ఇలా 75 మందిని రేప్ చేసినట్టు గుర్తించారు.

బ్యాంకాంక్‌లో మొదలైన ఈ సోల్జర్ బాగోతం.. ఖోన్ కాన్ ప్రావిన్స్‌కు ట్రాన్స్‌ఫర్ అయిన తర్వాత కూడా కొనసాగింది. అయితే, అతను బదిలీ అయిన తర్వాత ఫేస్ బుక్ వేదికగా చేసిన ఓ పనితో ఈ స్కాం మొత్తం బయటపడింది. ఫేక్ బుక్‌లో దొరికిన ఓ చిన్న తీగలాగారు. సైబర్ క్రైమ్ టాస్క్ ఫోర్స్ సాయంతో మొత్తం డొంక కదిలింది. చివరకు నిందితుడిని కటకటాల వెనక్కు పంపారు. అతడి బాగోతానికి సంబందించిన సాక్ష్యాలు తమ వద్ద ఉన్నాయని న్యాయాధికారులు చెప్పారు. అలాగే, నిందితుడు కూడా తన తప్పుని అంగీకరించాడని తెలిపారు. అతడి నేరం రుజువుకావడంతో సైన్యంలో ర్యాంక్ కూడా తగ్గించారు.


75 మంది టీనేజ్ అబ్బాయిల మీద లైంగిక దాడి చేసిన వ్యక్తి మీద మొత్తం ఆరు రకాల కేసులు నమోదయ్యాయి. యుక్త వయసు అబ్బాయిలను రేప్ చేయడం అనేది కూడా అందులో ఒకటి. అక్కడి చట్టాల ప్రకారం చిన్నారుల మీద లైంగిక దాడి చేస్తే కనీసం 20 ఏళ్ల జైలు శిక్ష పడుతుంది. అన్నిటికంటే ముఖ్యంగా విచ్ఛలవిడి శృంగారంతో అతనికి హెచ్‌ఐవీ సోకింది. 75 మంది టీనేజర్లు కూడా టెస్టులు చేయించుకోవాలని వైద్యులు, పోలీసులు సూచించారు.

ఇవి కూడా చదవండి


First published: November 8, 2018
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...