పాకిస్తాన్‌లో పురావస్తు తవ్వకాల్లో బయటపడ్డ 1300 ఏళ్ల నాటి హిందూ ఆలయం..

పాకిస్తాన్‌లో పురావస్తు శాఖ తవ్వకాల్లో 1300 ఏళ్ల క్రితం నిర్మించిన హిందూ ఆలయం బయటపడింది.

news18-telugu
Updated: November 21, 2020, 9:45 PM IST
పాకిస్తాన్‌లో పురావస్తు తవ్వకాల్లో బయటపడ్డ 1300 ఏళ్ల నాటి హిందూ ఆలయం..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
పాకిస్తాన్‌లో పురావస్తు శాఖ తవ్వకాల్లో 1300 ఏళ్ల క్రితం నిర్మించిన హిందూ ఆలయం బయటపడింది. పాకిస్తాన్, ఇటాలియన్ పురావస్తు నిపుణులు కలిసి స్వాత్ జిల్లా బరికోట్ ఘండాయ్ వద్ద తవ్వకాలు జరుపుతుండగా ఈ ఆలయం వెలుగుచూసింది. ఇది విష్ణు ఆలయంగా అక్కడి అధికారులు చెబుతున్నారు. ఈ ఆలయాన్ని క్రీ.శ 850-1023 మధ్య కాలానికి చెందినదని పురావస్తు నిపుణులు భావిస్తున్నారు. 1300 ఏళ్ల క్రితం ఆ ప్రాంతాన్ని పాలించిన హిందూ షాహి కాలంలో నిర్మించి ఉంటారని నమ్ముతున్నారు. హిందూ షాహి రాజవంశం కాబూల్ లోయ్(తూర్పు ఆఫ్ఘనిస్తాన్), గాంధార(ప్రస్తుత పాకిస్తాన్), ప్రస్తుత వాయువ్య భారతదేశాన్ని పాలించింది.

తవ్వకాల సమయంలో పురావస్తు నిపుణులు.. ఆలయ స్థలం సమీపంలో కంటోన్మెంట్, వాచ్ టవర్ల అవశేషాలను కనుగొన్నారు. ఆలయం దగ్గర నీటి ట్యాంక్ ఉన్నట్టు తెలిపే ఆధారాలను గుర్తించారు. ఆలయంలో ప్రవేశించడానికి ముందు ఇక్కడ హిందువులు స్నానాలు ఆచరించేవారని భావిస్తున్నారు.

స్వాత్ జిల్లాలో వెయ్యేళ్ల కింద‌టి పురావ‌స్తు ప్ర‌దేశాలు ఉండ‌గా.. గాంధార నాగరికత చెందిన ఓ ఆలయం వెలుగుచూడటం ఇదే తొలిసారి అని ఇటాలియన్ పురావస్తు మిషన్ హెడ్ డాక్టర్ లుకా తెలిపారు. ఇంకా ఆ ప్రాంతంలో మరిన్ని పరిశోధనలు కొనసాగిస్తున్నట్టుగా అధికారులు చెబుతున్నారు. మరోవైపు స్వాత్ లోయలోని బారీకోట్ ఘండాయ్ ప్రాంతాన్ని చారిత్రక ప్రదేశంగా అభివృద్ధి చేయనున్నట్టు పాకిస్తాన్ పురావస్తు శాఖ తెలిపింది.
Published by: Sumanth Kanukula
First published: November 21, 2020, 9:45 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading