పాకిస్థాన్ హిందువుల సంబరాలు... పౌరసత్వ చట్ట సవరణ బిల్లుపై హర్షం...

త్వరలో తమకు మంచిరోజులు రాబోతున్నాయన్న పాకిస్థాన్ నుంచి వచ్చి హిందూ శరణార్థులు సంతోషం వెల్లిబుచ్చారు. అన్నింటినీ వదిలిపెట్టి..పాకిస్తాన్‌ నుంచి భారత్‌కు వచ్చామని. తమలాంటి వారికి అన్ని రాజకీయ పార్టీల మద్దతు కావాలని శరణార్థులంతా ముక్త కంఠంతో తెలిపారు.

news18-telugu
Updated: December 10, 2019, 10:05 PM IST
పాకిస్థాన్ హిందువుల సంబరాలు... పౌరసత్వ చట్ట సవరణ బిల్లుపై హర్షం...
పాకిస్థాన్ హిందువుల సంబరాలు... పౌరసత్వ చట్ట సవరణ బిల్లుపై హర్షం...
  • Share this:
లోక్ సభలో పౌరసత్వ సవరణ బిల్లు ఆమోదం పొందడంపై పాకిస్థాన్ కు చెందిన హిందూ శరణార్థులు సంబరాలు చేసుకున్నారు. ఢిల్లీలోని మంజుకా తిలా ప్రాంతంలో నివసిస్తున్న పాకిస్థాన్ హిందు శరణార్థి కుటుంబాలు స్వీట్లు పంచుకొని పండగ చేసుకున్నారు. సోమవారం లోక్ సభలో పౌరసత్వ సవరణ బిల్లు ఆమోదం పొందిన నేపథ్యంలో వాళ్లు హర్షం వ్యక్తం చేశారు. త్వరలో తమకు మంచిరోజులు రాబోతున్నాయన్న పాకిస్థాన్ నుంచి వచ్చి హిందూ శరణార్థులు సంతోషం వెల్లిబుచ్చారు. అన్నింటినీ వదిలిపెట్టి..పాకిస్తాన్‌ నుంచి భారత్‌కు వచ్చామని. తమలాంటి వారికి అన్ని రాజకీయ పార్టీల మద్దతు కావాలని శరణార్థులంతా ముక్త కంఠంతో తెలిపారు. రాజ్యసభలో కూడా ఈ బిల్లు ఆమోదం పొంది చట్టం రూపం దాల్చాలని వారు కోరుకున్నారు. ఇదిలా ఉంటే దేశవ్యాప్తంగా పౌరసత్వ చట్ట సవరణ బిల్లుపై పలు చోట్ల తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈశాన్య రాష్ట్రాల్లో నిరసనలు చెలరేగుతున్నాయి. పలు రాజకీయ పార్టీలూ ఈ బిల్లును తప్పుపడుతున్నాయి.
Published by: Krishna Adithya
First published: December 10, 2019, 10:05 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading