హోమ్ /వార్తలు /అంతర్జాతీయం /

Hindu Businessman: హిందూ వ్యాపారి కాల్చివేత.. Pakistanలో మరో దారుణం.. నిరసనలు

Hindu Businessman: హిందూ వ్యాపారి కాల్చివేత.. Pakistanలో మరో దారుణం.. నిరసనలు

సతన్ లాల్ మృతిపై నిరసనలు

సతన్ లాల్ మృతిపై నిరసనలు

పాకిస్తాన్ లో హిందువులపై దారుణాలు కొనసాగుతున్నాయి. సింధ్ ప్రావిన్స్ లో తాజాగా మరో హిందూ వ్యాపారి సతన్ లాల్ ను దుండగులు కాల్చి చంపారు. నెలరోజుల కిందట సునీల్ అనే వ్యాపారినీ ఇదే రీతిగా చంపేశారు. హిందువులు పాక్ విడిచి పోవాలంటూ..

దాయాది దేశం పాకిస్తాన్ లో మైనార్టీ హిందువులపై దాడులు కొనసాగుతున్నాయి. తాజాగా సింధ్ ప్రావిన్స్ లో మరో హిందూ వ్యాపారి దారుణ హత్యకు గురయ్యాడు. ఈ ఘటనపై మైనార్టీలు ఏకమై నిరసనలకు దిగారు. వివరాలివి.. పాకిస్తాన్ సింధ్ ప్రావిన్స్‌లోని ఘోట్కీ జిల్లాలో దహర్కి పట్టణానికి చెందిన సతన్ లాల్ అనే హిందూ వ్యాపారిని సోమవారం గుర్తు తెలియని దుండగులు కాల్చి చంపారు. ఇదే సింధ్ రాష్ట్రంలో ఈ ఏడాది జనవరి 4న సునీల్ కుమార్ అనే మరో హిందూ వ్యాపారి కూడా దారుణ హత్యకు గురయ్యాడు.

సింధ్‌ ప్రావిన్స్ లో వరుసగా హిందూ వ్యాపారులు హత్యలకు గురికావడంపై స్థానిక మైనారిటీ వర్గాలు ఆందోళనకు దిగాయి. నిరసనల నేపథ్యంలో పోలీసులు.. హత్యల రింగ్ లీడర్ బచల్ దహర్, అతని సహచరులను అరెస్టు చేశారు. సతన్ లాల్ పై సోమవారం దాడి జరగ్గా, జనవరి 4న సింధ్ ప్రావిన్స్‌లోని అనాజ్ మండీలో మరో హిందూ వ్యాపారి సునీల్ కుమార్‌ను గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు. జనవరి 30న పెషావర్ నగరంలో గుర్తుతెలియని ముష్కరులు జరిపిన కాల్పుల్లో ఒక క్రైస్తవ మతగురువు ప్రాణాలు కోల్పోయాడు.

Mystery: అనంతపురం అమ్మాయిలు.. కడపలో ఘోరం.. వాళ్లు ప్రాణస్నేహితులని పేరెంట్స్‌కు తెలీదు!


సతన్ లాల్ హత్య తర్వాత స్థానిక హిందువులు రోడ్లపై నిరసనలకు దిగారు. అతని స్నేహితుడు అనిల్ కుమార్ స్థానిక మీడియాతో మాట్లాడుతూ.. వ్యాపారవేత్త భూమిలో పత్తి కర్మాగారం, పిండి మిల్లు ప్రారంభోత్సవానికి ముహుర్తం పెట్టుకోగా, గుర్తుతెలియని వ్యక్తుల నుంచి బెదిరింపులు వచ్చాయని తెలిపారు. దేశం విడిచి వెళ్లిపోవాల్సిందిగా లాల్ ను బెదిరించారని, చాలా మంది హిందూ వ్యాపారులకు ఇలాంటి అనుభవాలే ఎదురవుతున్నాయని వెల్లడైంది. ఈ ఘటనపై పాక్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Published by:Madhu Kota
First published:

Tags: Hindu community leaders, Pakistan

ఉత్తమ కథలు