హైజాక్ బటన్ నొక్కిన పైలట్ ... ఎందుకో తెలుసా ?

ఫ్లైట్‌లో 124 మంది ప్రయాణికులు ఉన్నారు. వారితో పాటు 9 మంది సిబ్బంది కూడా ఉన్నారు. ఇంతలో విమానం నుంచి హైజాక్ట్ అలర్ట్ వినిపించింది. అంతే ఒక్కసారిగా అంతా షాక్ అయ్యారు

news18-telugu
Updated: November 11, 2018, 8:34 AM IST
హైజాక్ బటన్ నొక్కిన పైలట్ ... ఎందుకో తెలుసా ?
ఢిల్లీ ఎయిర్ పోర్టులో విమానం హైజాక్ కలకలం
  • Share this:
ఇండియన్ ఎయిర్ లైన్స్‌కు చెందిన విమానానికి ముష్కరుల ముప్పు పొంచి ఉందని కొన్నిరోజుల క్రితమే ఇంటిలిజెన్సీ హెచ్చరించింది. ఈ సమయంలో ఓ పైలట్ చేసిన చిన్న మిస్టేక్... భద్రతా సిబ్బందిని పరుగులు పెట్టంచింది. ఆఫ్ఠానిస్తాన్ కాందహార్ వెళ్లాల్సిన విమానం నుంచి హైజాక్ అలర్ట్ వచ్చింది. దీంతో ప్రయాణికులు, సిబ్బందంతా గజగజ వణికిపోయారు.

ఢిల్లీ ఎయిర్ పోర్టులో కాందహార్ వెళ్లాల్సిన విమానం రెడీగా ఉంది. ఫ్లైట్‌లో 124 మంది ప్రయాణికులు ఉన్నారు. వారితో పాటు 9 మంది సిబ్బంది కూడా ఉన్నారు. ఇంతలో విమానం నుంచి హైజాక్ట్ అలర్ట్ వినిపించింది. అంతే ఒక్కసారిగా అంతా షాక్ అయ్యారు. భద్రతా అధికారులంతా విమానాన్ని చుట్టుముట్టేశారు. ఫ్లైట్‌ను ఐసోలేషన్ బేకు తరలించారు.

ఇంతలో పైలట్ వచ్చి ఎవరు భయపడాల్సిన అవసరం లేదన్నాడు. పొరపాటును తానే హైజాక్ బటన్ ప్రెస్ చేసినట్లు తెలిపారు. అలర్ట్ ఎలా పనిచేస్తుందో కో పైలట్‌కు వివరిస్తూ.. బటన్‌ను ప్రమాదవశాత్తు ప్రెస్ చేసినట్లు తెలిపాడు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. మరోవైపు ఎందుకైనా మంచిదని విమానం మొత్తం చెక్ చేసి... టేకాఫ్‌కు అనుమతించారు.First published: November 11, 2018
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...