జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక అధికారాలు కల్పించే ఆర్టికల్ 375 రద్దు తర్వాత సోషల్ మీడియా వేదికగా విస్తృతమైన చర్చ జరుగుతోంది.కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థించేవాళ్లు కొందరైతే.. వ్యతిరేకిస్తున్నవారు మరికొందరు. మొత్తంగా సోషల్ మీడియాలో దీనిపై భిన్న వాదనలు నడుస్తున్నాయి.అయితే మెజారిటీ ప్రజలు,పార్టీలు ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాయన్న వాదన వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ట్విట్టర్,ఫేస్బుక్ వేదికగా భారత జవాన్లపై తప్పుడు ప్రసారాలు చేయడాన్ని తీవ్రంగా పరిగణించాలని హైకోర్టు న్యాయవాది అరుణ్ డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు గురువారం సాయంత్రం తెలంగాణ డీజీపీని కలిసి ఆయన ఫిర్యాదు చేయనున్నారు. పాకిస్తాన్ ప్రేరేపిత మూకలకు కొమ్ముకాస్తున్న ట్విట్టర్,ఫేస్బుక్ సీఈవోలపై దేశ ద్రోహం కేసు నమోదు చేయాలని కోరనున్నారు.ఈ రెండు మాధ్యమాలు భారత జవాన్లపై తప్పుడు ప్రసారాలు చేస్తున్నాయని ఆయన ఆరోపిస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Highcourt, Jammu and Kashmir, Telangana