ఇండియా నుంచీ లండన్ పారిపోయిన నేరగాడు, బిలియనీర్ నీరవ్ మోదీ... లండన్‌లో జల్సా జీవితం గడుపుతున్నాడు. ఎంత జల్సా అంటే... ఆయన గారు వేసుకున్న జాకెట్ రేటు రూ.8 లక్షలంటే నమ్మగలరా. అసలంత రేటెక్కువ జాకెట్లను అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా వేసుకోవట్లేదు. కానీ ఇండియాలో పంజాబ్ నేషనల్ బ్యాంక్‌కు రూ.13వేల కోట్లు అప్పు చెల్లించాల్సి ఉండీ... అది చెల్లించకుండా... విదేశాలకు పారిపోయిన నీరవ్ మోదీ మాత్రం దర్జాగా వేసుకుంటున్నాడు. బ్యాంక్ నుంచీ తీసుకున్న డబ్బు ఎవరిది మన ఇండియన్స్‌ది. అప్పు చేశానన్న బాధ గానీ, తిరిగి చెల్లించాలనే ఉద్దేశం గానీ ఆ నేరగాడికి ఏమాత్రం లేదు. పైగా... విపరీతంగా ఖర్చులు చేస్తూ... డబ్బు దుబారా చేస్తున్నాడని నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.
Exclusive: Telegraph journalists tracked down Nirav Modi, the billionaire diamond tycoon who is a suspect for the biggest banking fraud in India's historyhttps://t.co/PpsjGeFEsypic.twitter.com/v3dN5NotzQ
లండన్ స్ట్రీట్‌లో వెళ్తున్న నీరవ్ మోదీని అక్కడి ఓ రిపోర్టర్ గుర్తించడంతో తప్పించుకు తిరుగుతున్న అతను లండన్‌లో ఉన్నట్లు స్పష్టమైంది. ఆ టైంలో నీరవ్ మోదీ లుక్ కొద్దిగా మారింది. హ్యాండిల్ బార్ మీసాలతో కనిపించాడు. అతను వేసుకున్న జాకెట్ అందర్నీ ఆకర్షించింది.
Behold. The $15,000 ostrich coat Manafort bought with an international wire transfer, according to a men’s clothier who testified today. Government exhibit pic.twitter.com/BjuQ39ZeJ0
ఎందుకంటే అది అల్లాటప్పాది కాదు. ప్రపంచ ప్రఖ్యాత కంపెనీ ఆస్ట్రిచ్ హైడ్ తయారుచేసిన జాకెట్. దాని రేటు పది వేల పౌండ్లు. మన రూపాయల్లోనైతే 8 లక్షలు. దానిపైనే ఇప్పుడు సోషల్ మీడియాలో టాక్ నడుస్తోంది.
The moral of the story is this...
No matter how hard you try...
No matter how much ostrich skin you wear.....
It's hard to get a cab in London. #NiravModi
డొనాల్డ్ ట్రంప్‌కి మాజీ క్యాంపెయిన్ మేనేజర్‌గా చేసిన పాల్ మనపోర్ట్... గతేడాది $15,000 (రూ.10,49,979) విలువైన ఆస్ట్రిచ్ హైడ్ కోట్ వేసుకున్నాడు. అతను కూడా 18 బ్యాంకుల్ని ముంచిన వాడే. అందుకే అతను ఆ కోట్ వేసుకోవడంపై కూడా అమెరికా నెటిజన్లు మండిపడ్డారు.
ఎందుకంత రేటు : ఈ కోట్ని ఆస్ట్రిచ్ లెదర్ తో తయారుచేస్తారు. ప్రపంచంలో అత్యంత ఖరీదైన కోటు ఇదే. టఫ్ లెదర్‌కి తోడు క్విల్ పాట్రన్ ఉంటుంది. పోల్కా డాట్స్ ఉంటాయి. ఈ కోటు డ్రైయింగ్, క్రాకింగ్, స్టిఫ్నెస్ను తట్టుకుంటుంది. ప్రపంచంలో మరే జాకెట్కీ ఇంత పవర్ఫుల్ లెదర్ ఉండదు. అందువల్లే అది ఎవరు వేసుకున్నా, టాక్ ఆఫ్ ది వరల్డ్ అవుతుంది.
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.