హోమ్ /వార్తలు /అంతర్జాతీయం /

Kohinoor: కోహినూర్ వజ్రం కాకతీయుల సామ్రాజ్యం నుంచి బ్రిటీష్ క్వీన్ వద్దకు ఎలా చేరింది..? స్పెషల్ సబ్జెక్ట్ స్టోరీ..

Kohinoor: కోహినూర్ వజ్రం కాకతీయుల సామ్రాజ్యం నుంచి బ్రిటీష్ క్వీన్ వద్దకు ఎలా చేరింది..? స్పెషల్ సబ్జెక్ట్ స్టోరీ..

Kohinoor: కోహినూర్ వజ్రం కాకతీయుల సామ్రాజ్యం నుంచి బ్రిటీష్ క్వీన్ వద్దకు ఎలా చేరింది..? స్పెషల్ సబ్జెక్ట్ స్టోరీ..

Kohinoor: కోహినూర్ వజ్రం కాకతీయుల సామ్రాజ్యం నుంచి బ్రిటీష్ క్వీన్ వద్దకు ఎలా చేరింది..? స్పెషల్ సబ్జెక్ట్ స్టోరీ..

Kohinoor: న్యూస్18 ప్రారంభించిన ‘క్లాసెస్ విత్ న్యూస్18’ సిరీస్‌లో భాగంగా కోహినూర్ డైమండ్ కాకతీయుల వద్ద నుంచి బ్రిటీష్ ప్రభుత్వం వద్దకు ఎలా వెళ్లింది? అసలు విషయాలు ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. 

  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

బ్రిటీష్ క్వీన్ ఎలిజబెత్-2 (Queen Elizabeth II) అంత్యక్రియలు నేడు ముగిశాయి. ఆమె చనిపోయినప్పటి నుంచి భారత దేశానికి చెందిన కోహినూర్ వజ్రాన్ని (Kohinoor Diamons) తిరిగి ఇచ్చేయాలనే డిమాండ్లు నెటిజన్ల నుంచి వస్తున్నాయి. నిజానికి కోహినూర్ వజ్రం భారత్ సంపద అని, దానిని భారత్‌కు తిరిగి ఇచ్చేయాలని భారత ప్రభుత్వం ఎప్పటి నుంచో కోరుతుంది. కానీ, బ్రిటీష్ ప్రభుత్వం మాత్రం తాము లీగల్‌గా కోహినూర్ వజ్రం పొందామని సమాధానం చెబుతోంది. అయితే ఇరాన్, పాకిస్థాన్, ఆప్ఘనిస్తాన్ ప్రభుత్వాలు కూడా కోహినూర్ తమదేనని అంటున్నారు.

ఈ క్రమంలో స్కూల్ స్టూడెంట్స్ దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. న్యూస్18 ప్రారంభించిన ‘క్లాసెస్ విత్ న్యూస్18’ సిరీస్‌లో భాగంగా కోహినూర్ డైమండ్ కాకతీయుల వద్ద నుంచి బ్రిటీష్ ప్రభుత్వం వద్దకు ఎలా వెళ్లింది? అసలు విషయాలు ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం.

* భారత్‌ సంపద ‘కోహినూర్‌’

లాహోర్ చివరి ఒప్పందం ప్రకారం లీగల్‌గా తాము కోహినూర్ వజ్రం పొందామని బ్రిటీష్ ప్రభుత్వం చెబుతోంది. కానీ ఈ డైమండ్ 13వ శతాబ్దంలో దక్షిణ భారతదేశంలోని హైదరాబాద్ పరిధిలో ఉన్న గోల్కొండ ప్రాంతంలో బయట పడిందని చెబుతారు. కాకతీయుల కాలంలో కోహినూర్ బయటపడినప్పుడు 186 క్యారెట్ల వజ్రంగా ఉంది. ఆ తర్వాత కాలంలో 1849లో ఈ వజ్రాన్ని ఈస్ట్ ఇండియా కంపెనీ పదేళ్ల మహారాజు దులీప్ సింగ్ నుంచి తీసుకుందని ఓ వాదన.

మరొక కథ ప్రకారం కోహినూర్ డైమండ్ కాకతీయ సామ్రాజ్యంలోని కొల్లూరు మైన్స్‌లో బయటపడింది. కృష్ణానది దక్షిణ తీరాన (ప్రస్తుత ఆంధ్రప్రదేశ్‌లోని) ప్రాంతంలో కనుగొన్నారు. వరంగల్‌లోని భద్రకాళి అమ్మవారి ఎడమ కన్నుగా కోహినూర్ వజ్రాన్ని ప్రతిష్టించారని చెబుతుంటారు. మొఘల్ సామ్రాజ్య స్థాపకుడు బాబర్ కూడా కోహినూర్ గురించి పేర్కొన్నారు. అది 187 క్యారెట్ల వజ్రమని, టర్కీ-అప్ఘన్ ఖల్జీ సామ్రాజ్యానికి చెందిన ఢిల్లీ సుల్తాన్ అల్లా ఉద్దీన్ ఖల్జీ దక్షిణ భారతదేశంలోని కాకతీయ సామ్రాజ్యంపైన దండ యాత్ర చేసిన క్రమంలో 14 వ శతాబ్దంలో కాకతీయుల నుంచి కోహినూర్‌ను దోచుకున్నాడని బాబర్ తన డైరీలో పేర్కొన్నారు.

Kohinoor Diamond ( Image : PTI)

*అప్ఘన్ రాజుల నుంచి మొఘలల వద్దకు

ఢిల్లీ, అగ్రాలను పానిపట్ యుద్ధంలో గెలిచిన క్రమంలో ఆ గెలుపునకు చిహ్నంగా కోహినూర్ వజ్రాన్ని బాబర్‌కు 1526లో టర్కీ రాజులు బహూకరించారు. ఆ తర్వాత ఆ వజ్రాన్ని బాబర్ తనయుడు హుమయూన్ పెర్షియా రాజు షా తమష్ప్‌కు ఇచ్చాడు. ఇక ఆ తర్వాత జరిగిన యుద్ధాల్లో చివరకు కోహినూర్ మళ్లీ మొఘల్ రాజుల వద్దకే వచ్చింది. 17వ శతాబ్దంలో షాజహాన్ వద్ద ఉన్న కోహినూర్‌ను నెమలి సింహాసనంపైన ప్రతిష్టించి 1635లో ఆవిష్కరించారు.

శతాబ్దాల తర్వాత మొఘల్ రాజు మహమ్మద్ షాను ఓడించి పర్షియన్ రాజు నాదిర్ షా కోహినూర్‌ను తీసుకున్నాడు. అలా 1938-1939 ప్రాంతంలో కోహినూర్ నాదిర్ షా వద్దకు వచ్చింది. ఆ తర్వాత కాలంలో ఆయన మనవడు షక్రో షా దానిని అప్ఘన్ సామ్రాజ్య స్థాపకుడు షా దుర్రానికి ఇచ్చారు. కాబుల్‌లో కొన్నేళ్ల పాటు ఉంది కోహినూర్. దుర్రాని ముని మనవడు షా షుజ కూడా అక్కడే కోహినూర్‌ను భద్రపరిచారు.

* బ్రిటీషర్ల చేతిలోకి ఎలా వెళ్లింది?

రాజుగా ఉన్న షుజను కూలదోసి మహ్మద్ షా 1809లో రాజ్యాన్ని అధిష్టించారు. అప్పుడు షుజ లాహోర్‌లో రంజిత్ సింగ్ వద్ద తలదాచుకున్నాడు. రంజిత్ సింగ్ భారత తొలి సిక్కు పాలకుడు కాగా, తనకు షెల్టర్ ఇచ్చినందుకు రంజిత్ సింగ్‌కు కోహినూర్‌ను బహుమతిగా ఇచ్చాడు షుజ. రంజిత్ సింగ్ మరణం తర్వాత 1849లో పంజాబ్‌పై బ్రిటీష్ వారు యుద్ధం చేసి కోహినూర్ వజ్రాన్ని స్వాధీనం చేసుకున్నారు.

ఇది కూడా చదవండి :పోటీ పరీక్షల ప్రత్యేకం.. ఈ వారం లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ మీ కోసం..

అప్పటి బ్రిటీష్ సైనిక కమిషనర్ సర్ జాన్ లారెన్స్ కోహినూర్‌ను భద్రపరిచాడు. ఈ డైమండ్‌ను ఆయన తిరిగి రంజిత్ సింగ్ వారసుడు అయిన దలిప్ సింగ్‌కు ఇచ్చి క్వీన్ విక్టోరియాకు ఇవ్వాలని ఆదేశాలిచ్చారు. అలా మహారాణి క్వీన్ విక్టోరియా వద్దకు కోహినూర్ వెళ్లింది. టవర్ ఆఫ్ లండన్‌లో బ్రిటన్ రాజవంశీకుల ఆభరణంగా కోహినూర్ ఆ తర్వాత కాలంలో మారింది. లండన్ టవర్‌లో కోహినూర్‌ ఉన్న కిరీటాన్ని ప్రదర్శనకు అప్పట్లో ప్రదర్శనకు ఉంచారు.

కోహినూర్ ధరించిన వారికి దురదృష్టం వెంటాడుతుందని కూడా చెబుతుంటారు. విక్టోరియా తర్వాత కోహినూర్‌ను ఆభరణంగా క్వీన్ అలెగ్జాండ్ర, క్వీన్ మేరీ ధరించారు. ఇటీవల మరణించిన క్వీన్ ఎలిజబెత్ II తల్లి శవపేటికపైన 2002లో కోహినూర్ ప్రదర్శించారు. బ్రిటన్ క్వీన్ ఎలిజబెత్2 (Queen Elizabeth 2) మరణం తర్వాత కోహినూర్ డైమండ్ ఆమె కోడలు కెమిల్లా వద్దకు చేరింది.

Published by:Sridhar Reddy
First published:

Tags: Career and Courses, EDUCATION, JOBS, Queen Elizabeth II

ఉత్తమ కథలు