Home /News /international /

IDPD 2021: నేడు అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం.. దీని చరిత్ర, థీమ్ వివరాలివే..

IDPD 2021: నేడు అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం.. దీని చరిత్ర, థీమ్ వివరాలివే..

ప్రతీకాత్మకచిత్రం

ప్రతీకాత్మకచిత్రం

వికలాంగుల ఉన్నతికి ప్రత్యేక చర్యలు చేపడుతోంది ఐక్యారాజ్యసమితి. వైకల్యంతో పుట్టిన వారిపై చిన్నచూపు చూపకుండా వారి కోసం 1992లో ప్రత్యేకంగా ఒక తీర్మానం ప్రవేశపెట్టింది. దాని ప్రకారం ప్రతి సంవత్సరం డిసెంబర్ 3న అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవాన్ని (International Day of Persons with Disabilities) నిర్వహిస్తున్నారు.

ఇంకా చదవండి ...
వికలాంగుల ఉన్నతికి ప్రత్యేక చర్యలు చేపడుతోంది ఐక్యారాజ్యసమితి. వైకల్యంతో పుట్టిన వారిపై చిన్నచూపు చూపకుండా వారి కోసం 1992లో ప్రత్యేకంగా ఒక తీర్మానం ప్రవేశపెట్టింది. దాని ప్రకారం ప్రతి సంవత్సరం డిసెంబర్ 3న అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవాన్ని (International Day of Persons with Disabilities) నిర్వహిస్తున్నారు. వైకల్యం ఉన్న వ్యక్తుల పట్ల ప్రతి ఒక్కరూ బాధ్యతగా మెలగాలన్న ఐరాస సూచనలతో ఏటా వారి కోసం ఈరోజున ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇందుకు ప్రతి సంవత్సరం ఒక థీమ్తో ముందుకెళుతున్నారు. వికలాంగులు వెనుకబాటుకు గురికాకుండా వారిలో ఆత్మస్థైర్యం పెంపొందించి, సమాజంలో వారికంటూ ఒక సుస్థిరమైన స్థానం ఏర్పాటు చేసేలా కార్యక్రమాలను రూపొందిస్తున్నారు. వారి పరిస్థితులపై రాజకీయ, సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక అంశాల పరంగా అవగాహన పెంచడమే అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం లక్ష్యం.

ఐక్యరాజ్యసమితి 1998 నుంచి ఏటా డిసెంబర్ 3న ఒక నిర్ధిష్ట థీమ్తో అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవాన్ని నిర్వహిస్తోంది. ఈ సంవత్సరం వేడుకల కోసం ఒక ప్రత్యేకమైన థీమ్ను ప్రకటించింది. ఈ ఏడాది ‘కొవిడ్-19 అనంతరం స్థిరమైన సమాజం కోసం అందరినీ కలుపుకొని.. వైకల్యం ఉన్న వ్యక్తుల్లో నాయకత్వం, భాగస్వామ్యం పెంపొందిచడం’ అనే థీమ్‌ను నిర్ధారించింది.

ఇది చదవండి: ట్విటర్​ సీఈవోగా భారతీయుడు పరాగ్​ నియామకం.. అపర కుబేరుడు ఎలన్​ మస్క్​ ట్వీట్​.. ఏమన్నారంటే..


ప్రపంచవ్యాప్తంగా వంద కోట్ల కంటే ఎక్కువ మంది ప్రజలు ఏదో ఒక వైకల్యంతో బాధపడుతున్నట్లు అంచనా. వృద్ధాప్యంలో నాన్-కమ్యూనికేషన్ వ్యాధుల ప్రాబల్యం కారణంగా వికలాంగుల సంఖ్య పెరుగుతోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) అంచనా వేసింది. కరోనా వల్ల తలెత్తిన సంక్షోభం, ఇప్పటికే ఉన్న అసమానతలను తీవ్రతరం చేస్తోందని ఐక్యరాజ్యసమితి తెలిపింది. మనం నివసిస్తున్న ఈ సమాజంలో అత్యంత అసమానతలు ఎదుర్కొంటున్న సమూహాల్లో అంగవైకల్యం ఉన్నవారు ప్రధానంగా ఉన్నారు. కరోనా సంక్షోభంలో మరణాల పరంగానూ వీరి సంఖ్య ఎక్కువగానే ఉంది.

ఇది చదవండి: ఒమిక్రాన్ వేరియంట్​​తో ఇబ్బందేం లేదు.. లక్షణాలు కూడా స్వల్పం .. విదేశీ వైద్య నిపుణుల అభిప్రాయాలు


1992లో తీర్మానం...
1992లో ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ తీర్మానం 47/3 ప్రకటించిన తర్వాత వార్షిక వేడుకలు ప్రారంభమయ్యాయి. 2006లో వికలాంగుల హక్కులపై కన్వెన్షన్ (CRPD) కూడా ఆమోదం పొందింది. స్థిరమైన అభివృద్ధి కోసం 2030 ఎజెండాను అమలు చేసి వికలాంగులకు సమాన అవకాశాలను కల్పించే దిశగా పని చేయడం దీని లక్ష్యం. అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం ప్రత్యేకతను పలువురు ప్రముఖులు పంచుకున్నారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్, రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లోత్, ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ ట్విటర్ వేదికగా ఈ విషయంపై స్పందించారు.

ఇది చదవండి: వణికిస్తున్న ఒమిక్రాన్.. ఈ జాగ్రత్తలు పాటిస్తే వైరస్ ముప్పు నుంచి తప్పించుకోవచ్చు


అంగవైకల్యం అనేది ఒక సమస్య కాదు. వ్యాధి కూడా కాదు. వాళ్లు కూడా మనలాంటి వారే. వారి పట్ల మనం మంచిగా మెలగడం అనే విషయంలో సమాజాన్ని మరింతగా చైతన్య పరచాలి. వారి కోసం నిర్దేశించిన లక్ష్యాలను చేరుకునేలా ప్రోత్సహించాలి. వైకల్యం ఉన్న వ్యక్తులు కూడా సరికొత్త ఆవిష్కరణలు, రికార్డులు సృష్టించగలిగారు. ఇంకా సృష్టిస్తున్నారు. వారికి కావాల్సిందల్లా మేమున్నామమే భరోసా మాత్రమే.
Published by:Purna Chandra
First published:

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు