మనిషికి వ్యాయామం ఎంతో అవసరం.. శరీరం ఫిట్‌గా ఉంటే ఎటువంటి సమయంలోనేనా మనల్ని కాపాడుకోవచ్చు అని ఎన్నో సార్లు రుజువైంది. తాజాగా మెడగాస్కర్‌లో జరిగి హెలికాఫ్టర్ (Helicopter)ప్రమాదంలో ఆ దేశ మంత్రి బతికి బయటపడ్డారు. ఆయన దాదాపు 12 గంటల పాటు ఈత కొట్టుకొంటూ తనను తాను కాపాడుకొన్నారు. ఈ ప్రమాదం నుంచి ఇద్దరు మాత్రమే బతికి బయట పడ్డారు. అందులో మంత్రికూడా ఒకరు. డిసెంబర్ 20, 2021న రాత్రి సమయంలో మెడగాస్కర్ మంత్రి సెర్జ్ గెల్లే ప్రయాణిస్తున్న హెలికాఫ్టర్ సముద్రంలో కూలిపోయింది. ఈ ప్రమాదంలో 39 మంది మృతి చెందారు. అయితే 18 మంది మృతదేహాలు మాత్రమే రిస్క్యూ టీం గుర్తించింది. ఇంత పెద్ద ప్రమాదం నుంచి 57 ఏళ్ల మంత్రి బతికి బయటపడ్డారు. సముద్రంలో హెలికాఫ్టర్ కూలిపోయిన తరువాత ఆయన ఈత కొడుతూనే ఉన్నారు.
దాదాపు 12 గంటల పాటు ఈత కొట్టారు. అయితే ఆయక క్రీడల్లో మంచి పరిచయం ఉంది. ఆ సామర్థ్యమే తనను కాపాడిందని అంటున్నారు. ఆయన ఎంతో నెమ్మదిగా ఈత కొడుతూ తన ప్రాణాలను కాపాడుకొన్నారు.
మూడు దశాబ్దాల పాటు పోలీసు శాఖలో పనిచేసిన గెల్లా ఆగస్టులో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో భాగంగా మంత్రి అయ్యారు. ఈ ప్రమాదం జరిగి సముద్రంలో పడినప్పుడు ఎక్కడా నిరాశ చెందకుండా ఆయన ఈత కొట్టడమే ఆయనను కాపాడింది. ఈత కొట్టేటప్పుడు ఆయన భయపడకుండా నిదానంగా ఈత కొట్టారిని పలువురు చెబుతున్నారు. దాదాపు 12 గంటల పాటు స్విమ్మింగ్ (Swimming) చేసిన గెల్లె మంగళవారం ఉదయం సజీవంగా కనిపించిండాని సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియోలో తెలిపారు. హెలికాప్టర్‌లో ఉన్న మెకానిక్ (Mechanic) ని కూడా ఆయనతోపాటు ఉన్నారు.
పడవ ప్రమాదంలో 19 మంది మృతి
ఈశాన్య మడగాస్కర్ తీరంలో జరిగిన పడవ ప్రమాదంలో కనీసం 19 మంది మరణించారు. 66 మంది ఆచూకీ తెలియకుండా గల్లంతయ్యారు. వారికి కోసం గాలిస్తున్నట్టు ఆ దేశ సముద్ర ఏజెన్సీ తెలిపింది. అయితే ప్రజా రవాణాకు అనుమతి లేని కార్గో షిప్ ఓడ ఇది. అయితే ఓవర్‌లోడ్‌తో ప్రయాణం చేస్తున్నట్టు గుర్తించారు. ఇంజన్‌లోకి నీరు చేరినట్టు అధికారులు ప్రాథమికంగా గుర్తించినట్టు సముద్రంలో ఆపరేషన్స్ డైరెక్టర్ మామీ రాండ్రియానావోనీ వెల్లడించారు.
ఓడలో 130 మంది ప్రయాణికులు ఉన్నట్టు గుర్తించారు. అంతనాంబే నుంచి సోనియెరానా ఇవాంగోకు ప్రయాణిస్తున్నారని అధికారిక వర్గాలు తెలిపాయి. ఈ ప్రమాదంలో 45 మంది సజీవంగా ఉన్నట్లు గుర్తించారు. గల్లంతైన ప్రయాణికులు ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్నట్టు సముద్రంలో ఆపరేషన్స్ డైరెక్టర్ మామీ రాండ్రియానావోనీ అన్నారు. వెతకడానికి మూడు పడవలు ఏర్పాటు చేసినట్టు ఆయన తెలిపారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Helicopter Crash, Swimming