ప్రాచీన భవనాలకు న్యూయార్క్ పెట్టింది పేరు. వాటిలో మాన్‌హట్టన్ భవనం అత్యంత ప్రముఖమైనది. ఆ భవనం పై భాగాన్ని ఓ హెలికాప్టర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో పైలట్ టిమ్ మెక్ కార్మాక్ ప్రాణాలు కోల్పోయాడు. దీని వెనక ఏ ఉగ్రవాద కోణమూ లేదని అధికారులు స్పష్టం చేశారు. అగస్టా హెలికాప్టర్... 34వ హెలీపోర్ట్ నుంచీ బయలుదేరి... 11 నిమిషాల తర్వాత... రాత్రి 1.32 సమయంలో... అదుపు తప్పింది. మాన్ హట్టన్ భవనం 54వ అంతస్థు పై రూఫ్‌ను ఢీకొట్టింది. లక్కీగా ఆ సమయంలో ఆ అంతస్థులో ఎవరూ లేరు. కాకపోతే... ప్రమాదం జరిగినప్పుడు మాత్రం... భూకంపం వచ్చిన ఫీల్ కలిగిందని కొందరు భవనంలో ఉన్నవారు చెప్పారు.
I have been briefed on the helicopter crash in New York City. Phenomenal job by our GREAT First Responders who are currently on the scene. THANK YOU for all you do 24/7/365! The Trump Administration stands ready should you need anything at all.
— Donald J. Trump (@realDonaldTrump) June 10, 2019
ప్రమాదం విషయం తెలియగానే ఫైరింజన్లు అక్కడకు చేరుకున్నాయి. భవనం పైభాగంలో అంటిన మంటల్ని అరగంటలో అదుపులోకి తెచ్చాయి. హెలికాప్టర్లో ఇంధనం లీక్ అవ్వడం వల్లే మంటలు చెలరేగాయని తేల్చారు.
నిజానికి హెలికాప్టర్ కొన్ని గంటల ముందే వెళ్లిపోవాల్సి ఉంది. వాతావరణం బాలేకపోవడంతో... చాలా సేపు వెయిట్ చేసిన పైలట్... చివరకు బయలుదేరాడు. అయినప్పటికీ వాతావరణం సరిగా లేకపోవడం ప్రమాదానికి కారణమైంది. ప్రస్తుతం మాన్‌హట్టన్ చుట్టూ ఉన్న వీధుల్ని క్లోజ్ చేశారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి :
మీసాలు ట్రిమ్... షర్టులు టక్... ఉద్యోగులకు బ్యాంక్ ఆఫ్ బరోడా కండీషన్లు...
హైకోర్టుకు చేరిన సీఎల్పీ విలీన వివాదం... నేడు విచారణ... చట్టం ఏం చెబుతుంది..?
మానవ జాతికే ప్రమాదం... మాంస భక్షక మొక్కలు...
అన్ని సబ్జెక్టుల్లోనూ 35 మార్కులే... ఇలా పాసైన స్టూడెంట్ ఇతనొక్కడేనేమో..?
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: International, USA, World