Helicopter Crash: రష్యా‌లో ప్రమాదం.. పర్యాటకులతో వెళ్తుండగా కుప్పకూలిన హెలికాప్టర్

ప్రతీకాత్మక చిత్రం

రష్యాలో ఘోర ప్రమాదం జరిగింది. 16 మందితో వెళ్తున్న హెలికాప్టర్ కుప్పకూలింది. ఇందులో 13 మంది పర్యాటకులు కాగా, ముగ్గురు సిబ్బంది ఉన్నారు.

  • Share this:
    రష్యాలో ఘోర ప్రమాదం జరిగింది. 16 మందితో వెళ్తున్న హెలికాప్టర్ కుప్పకూలింది. ఇందులో 13 మంది పర్యాటకులు కాగా, ముగ్గురు సిబ్బంది ఉన్నారు. రష్యాలోని కమ్‌చట్కా ప్రాంతంలో ఈ ప్రమాదం చోటుచేసుకుందని రష్యన్ ఎమర్జెన్సీస్ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. ప్రాథమిక సమాచారం ప్రకారం.. క్రోనోట్స్కీ నేచర్ రిజర్వ్ ప్రాంతంలో కురిల్ సరస్సులో హెలికాప్టర్ కూలిపోయింది. దీంతో స్థానిక అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదం నుంచి 8 మంది బయటపడినట్టుగా రష్యా ప్రభుత్వ ఆధ్వర్యంలోని స్పుత్నిక్ వార్తా సంస్థ పేర్కొంది. అయితే మిగిలినవారి కోసం రెస్క్యూ సిబ్బంది బోట్స్ ద్వారా సరసులో గాలింపు చేపట్టారు.

    ‘ఆగష్టు 12,2021 00:50 (మాస్కో సమయం) క్రోనోట్స్కీ నేచర్ రిజర్వ్‌లోని కురిల్ సరస్సు ప్రాంతంలో విత్యాజ్-ఏరో ఎయిర్‌లైన్ యొక్క Mi-8 హెలికాప్టర్ క్రాష్ ల్యాండింగ్ అయినట్టుగా సమాచారం అందింది. ప్రాథమిక సమాచారం ప్రకారం, హెలికాప్టర్‌లో ముగ్గురు సిబ్బంది మరియు 13 మంది ప్రయాణికులు ఉన్నారు. రష్యన్ అత్యవసర మంత్రిత్వ శాఖ సహాయక చర్యలు చేపట్టేందుకు సిద్ధంగా ఉంది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది ’అని మంత్రిత్వ శాఖ తెలిపింది.
    Published by:Sumanth Kanukula
    First published: