Home /News /international /

HEARTLAND VIRUS IS SPREADING IN US ANOTHER CASE FOUND IN GEORGIA HERE IS ITS SYMPTOMS AND OTHER DETAILS SK

Heartland Virus: మరో కొత్త వైరస్.. నల్లుల నుంచి వేగంగా వ్యాప్తి.. దీనికి మందు కూడా లేదు..

ప్రతీకాత్మ క చిత్రం

ప్రతీకాత్మ క చిత్రం

Heartland Virus: హార్ట్‌ల్యాండ్ వైరస్ లక్షణాలను గురించి వైద్య నిపుణులు వివరించారు. జ్వరం, తలనొప్పి, కీళ్ల నొప్పులు, కండరాలనొప్పులు, ఆకలి లేకపోవడం, డయేరియా వంటి లక్షణాలు కనిపిస్తాయి.

  కరోనా మహమ్మారి మనల్ని ఇంకా వదల్లేదు. 2019 నుంచీ ఈ ప్రపంచాన్ని పట్టి పీడిస్తోంది. మనదేశంలో థర్డ్ వేవ్ పెద్దగా ప్రభావం చూపలేదు. కొత్త కేసుల సంఖ్య చాలా తక్కువగా ఉంది. అందుకే ప్రజలు రిలాక్స్ అవుతున్నారు. బతికిపోయాం.. అంటూ ఊపిరిపీల్చుకుంటున్నారు. కానీ ఇదే సమయంలో పలుదేశాలలో వైరస్ వ్యాప్తి మళ్లీ పెరిగింది. చైనాతో పాటు యూరప్ దేశాల్లో కరోనా విజృంభిస్తోంది. ఎప్పటికప్పుడు రూపం మార్చుకుంటూ అల్లకల్లోలం సృష్టిస్తోంది. ఈ నేపథ్యంలో త్వరలోనే భారత్‌లో కూడా ఫోర్త్ వేవ్ వచ్చే అవకాశముందని.. ప్రజలంతా మళ్లీ జాగ్రత్తలు పాటించాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

  ఇంకా కరోనా నుంచి మనం పూర్తిగా బయటపడక ముందే.. మరో కొత్త వైరస్ ప్రపంచాన్ని వణికిస్తోంది. అదే హార్ట్‌లాండ్ వైరస్. ఇది పినుజులు, నల్లుల నుంచి వ్యాప్తి చెందుతోంది. మనుషుల రక్తాన్ని తాగే ఈ చిన్న కీటకాలు ఇప్పుడు అమెరికాను వణికిస్తున్నాయి. అమెరికాలోని జార్జియాలో హార్ట్ లాండ్ వైరస్ కేసు వెలుగుచూసింది. దీని గురించి వైద్యులు కీలక వివరాలను వెల్లడించారు. ఈ వ్యాధికి ఇప్పటి వరకు చికిత్స లేదు. వ్యాధి సోకిన వారిలో అనేక అవయవాలు పనిచేయడం ఆగిపోతాయి. మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్ వల్ల మనిషి ప్రాణాలు కోల్పోయే ప్రమాదముంది. ఈ నేపథ్యంలో జార్జియాలోని అధికార యంత్రాంగం అప్రమత్తవుతోంది. కేసులు పెరగకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపడుతోంది. మరో ఐదు రాష్ట్రాల్లో కూడా హార్ట్‌లాండ్ కేసులు నమోదవుతున్నాయి.

  Russia Ukraine War: గూగుల్, యూట్యూబ్ లకు రష్యా  స్ట్రాంగ్ వార్నింగ్.. ఇక మీదట మీరు..

  ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. హార్ట్‌ల్యాండ్ వైరస్‌ని మొదట తెల్లతోక ఉండే జింకల్లో మాత్రమే గురించారు. కానీ ఇప్పుడది నల్లుల్లో కూడా ఉంటుంది. సాధారణంగా చాలా మంది ఇళ్లల్లో నల్లులు ఉంటాయి. వాటి నుంచి ఇది మనుషులకు సంక్రమిస్తుంది. హార్ట్‌లాండ్ మొదటి కేసు 2009లో మిస్సోరిలో నమోదైంది. 2009 నుంచి 2021 వరకు ఆ కేసుల సంఖ్య 50కి చేరింది. మరణాల రేటు తక్కువగానే ఉన్నప్పటికీ.. పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వృద్ధులు మాత్రం మరణించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అవయవాలన్నీ పనిచేయడం ఆగిపోవడంతో మరణం సంభవిస్తుంది.

  Pakistan: పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు మరో భారీ ఎదురుదెబ్బ.. నెలాఖరు కంటే ముందే...

  హార్ట్‌ల్యాండ్ వైరస్ లక్షణాలను గురించి వైద్య నిపుణులు వివరించారు. జ్వరం, తలనొప్పి, కీళ్ల నొప్పులు, కండరాలనొప్పులు, ఆకలి లేకపోవడం, డయేరియా వంటి లక్షణాలు కనిపిస్తాయని వెల్లడించారు. అత్యంత భయంకరమైన విషయం ఏమిటంటే. వ్యాధి బారినన పడిన తర్వాత, మానవ శరీరంలోని అనేక అవయవాలు విఫలమవుతాయి. ఇప్పటి వరకు ఈ వైరస్‌కు ఔషధం తయారు చేయలేదు. రాకుండే నిరోధించడానికి వ్యాక్సిన్ కూడా రాలేదు. ఇలాంటి పరిస్థితుల్లో అమెరికాలోని పలు రాష్ట్రాల ప్రజల్లో ఆందోళన నెలకొంది.
  Published by:Shiva Kumar Addula
  First published:

  Tags: America, International news, Us news

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు