పిల్ల పక్షి నోట్లో సిగరెట్.. నెటిజెన్లను విపరీతంగా కదిలించిన ఫోటో..

పొగ తాగే అలవాటు ఉన్నవారు.. నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయని నెటిజెన్స్ విమర్శిస్తున్నారు.

news18-telugu
Updated: July 1, 2019, 3:58 PM IST
పిల్ల పక్షి నోట్లో సిగరెట్.. నెటిజెన్లను విపరీతంగా కదిలించిన ఫోటో..
సిగరెట్ పీకను పిల్ల పక్షి నోటికి అందిస్తున్న తల్లి పక్షి(Image : Facebook)
  • Share this:
అమెరికాలోని ఫ్లోరిడాలో ఉన్న సెయింట్ పీట్స్ బీచ్‌లో కరెన్ మేసన్ అనే ఓ ఫోటోగ్రాఫర్ క్లిక్‌మనిపించిన ఫోటో చాలామంది నెటిజెన్ల హార్ట్ టచ్ చేసింది.
బీచ్ ఒడ్డున ఓ తల్లి పక్షి.. పిల్ల పక్షి నోటికి సిగరెట్ పీకను అందిస్తున్న ఫోటో అది. తినే పదార్థం అనుకుని ఆ తల్లి పక్షి.. దాన్ని పిల్ల పక్షికి అందించింది. ఇది చూసి చలించిన కరెన్ మేసన్.. వెంటనే ఆ దృశ్యాన్ని తన కెమెరాలో బంధించాడు. ఆపై సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. క్షణాల్లో వైరల్‌గా మారింది. పొగ తాగే అలవాటు ఉన్నవారు.. నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయని
నెటిజెన్స్ విమర్శిస్తున్నారు. బీచ్ ఒడ్డున స్మోక్ చేసేవారు.. సిగరెట్ పీకలను అక్కడే వదిలేయకుండా, వేరేచోట పడేస్తే మంచిదని సలహా ఇస్తున్నారు. కాగా, 2018లో వెలువడిన ఓ నివేదిక ప్రకారం ప్రపంచవ్యాప్తంగా బీచ్‌లలో పేరుకుపోతున్న టాప్-10 వ్యర్థాల్లో సిగరెట్ పీకలు కూడా ఉన్నాయని తేలింది. ఈ నేపథ్యంలో బీచ్‌లను ఎంత శుభ్రంగా ఉంచుకుంటే పర్యావరణానికి అంత మంచిదని పర్యావరణ నిపుణులు గుర్తుచేస్తున్నారు.

First published: July 1, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>