Home /News /international /

HEALTH STAFF CUT NEWBORN BABYS HEAD LEAVE IT INSIDE HINDU WOMAN WOMB IN PAKISTAN SINDH PVN

పాక్ లో హిందూ మహిళపై దారుణం..పురుడు కోసం హాస్పిటల్ కి..శిశువు తలను గర్భంలోనే కోసేశారు!

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

 Health Staff Cut Newborn Babys Head : పాకిస్తాన్(Pakistan) లో దారుణం జ‌రిగింది. 32 ఏళ్ల హిందూ మ‌హిళ ప‌ట్ల అక్క‌డి వైద్యుల(Doctors) నిర్లక్ష్యం తీవ్ర విషాదానికి దారితీసింది. ఆపరేషన్ నిర్వహిస్తూ గర్భంలోని శిశువు తలను కట్ చేశారు డాక్టర్లు.

ఇంకా చదవండి ...
Health Staff Cut Newborn Babys Head : పాకిస్తాన్(Pakistan) లో దారుణం జ‌రిగింది. 32 ఏళ్ల హిందూ మ‌హిళ ప‌ట్ల అక్క‌డి వైద్యుల(Doctors) నిర్లక్ష్యం తీవ్ర విషాదానికి దారితీసింది. ఆపరేషన్ నిర్వహిస్తూ గర్భంలోని శిశువు తలను కట్ చేశారు డాక్టర్లు. దీంతో తల గర్భంలోనే మిగిలిపోయింది. ఈ ఘటన బాధిత మహిళ ప్రాణాల మీదకు తెచ్చింది. సింధు ప్రావిన్సులో జ‌రిగిన ఈ ఘ‌ట‌న ప‌ట్ల సింధు ప్ర‌భుత్వం వైద్య విచార‌ణ‌కు ఆదేశించింది.

సింధ్ ప్రావిన్స్‌లోని థార్‌పార్క‌ర్ జిల్లాలో నివసించే భీల్ వ‌ర్గానికి చెందిన 32 హిందూ మ‌హిళ‌... ప్రసవవేదనతో సమీపంలోని ఆర్‌హెచ్‌సీ(రూరల్ హెల్త్ సెంటర్)కి వెళ్లింది. కానీ అక్కడ గైనకాలజిస్ట్ అందుబాటులో లేరు. దీంతో అనుభవంలేని సిబ్బంది ఆపరేషన్ నిర్వహించారు. శిశువును గ‌ర్భం నుంచి తీసే స‌మ‌యంలో ఆ శిశువు త‌ల‌ను కోసేసి ఆ భాగాన్ని ఆ మ‌హిళ గ‌ర్భంలోనే వ‌దిలేశారు.ఈ ఘటన బాధిత మహిళ ప్రాణాల మీదకు తెచ్చింది. దీంతో హుటాహుటిన ఆమెను సమీపంలోని మరో హాస్పిటల్‌ మిథికి తరలించారు. అక్కడ కూడా సరైన వైద్య సదుపాయాలు లేకపోవడంతో లియాక‌త్ వ‌ర్సిటీ హాస్పిట‌ల్‌ కు తరలించారు. అక్కడ ఆపరేషన్ నిర్వహించి మహిళ గర్భంలోని శిశువు తలను బయటకు తీశారు.Nobel Prize : నోబెల్ బహుమతి అమ్మేసిన రష్యా జర్నలిస్ట్..ఎందుకో తెలుసా

దీంతో బాధిత మహిళకు ప్రాణపాయం తప్పింది. శిశువు త‌ల మ‌హిళ గ‌ర్భంలో ఇరుక్కుపోయింద‌ని, ఆ మ‌హిళ మూత్రాశ‌యం కూడా దెబ్బ‌తిన్న‌ద‌ని, ఆమెను కాపాడేందుకు పొత్తి కడుపు స‌ర్జ‌రీ చేయాల్సి వ‌చ్చింద‌ని, శిశువు త‌ల‌ను క‌డుపు స‌ర్జ‌రీ ద్వారా బ‌య‌ట‌కు తీసిన‌ట్లు లియాక‌త్ యూనివ‌ర్సిటీ గైనకాలజీ విభాగం హెడ్ ప్రొఫెస‌ర్ రాహీల్ సికింద‌ర్ తెలిపారు. ఈ ఘటనపై సింధ్ ప్రావిన్స్ ప్రభుత్వం మెడికల్ దర్యాప్తునకు ఆదేశించింది. అసలేం జరిగింది, నిందితులు ఎవరనేది తేల్చాలని సింధు ఆరోగ్య‌శాఖ డీజీ డాక్ట‌ర్ జుమాన్ భాటో విచార‌ణ‌కు ఆదేశించారు.

Elon Musk Son : మా నాన్నతో ఉండలేను..కోర్టుకి ఎలాన్ మస్క్ కుమారుడు!

మరోవైపు,పాకిస్తానీ నేతల ఆస్తులకు సంబందించి ఇటీవల వెలుగులోకి వచ్చిన (Pakistani Leaders Assets) రిపోర్టులో విచిత్రాలే ఉన్నాయి. ప్రపంచంలోనే సంపన్న క్రికెటర్లలో ఒకరిగా పేరుపొందిన మాజీ ప్రధాని, పీటీఐ చీఫ్ ఇమ్రాన్ ఖాన్ (Imran Khan) తనకు పెట్టుబడులేవీ లేవని, ఉన్నవి నాలుగు మేకలేనని చెప్పుకోగా, ఆయన ప్రస్తుత భార్య మాత్రం ధనవంతురాలిగా నిలిచారు. ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ (Pakistan PM Shehbaz Sharif asserts) సైతం తన భార్య, మాజీ భార్యలకంటే పేదవాణ్నని పేర్కొన్నారు.పాకిస్తాన్ లో ప్రస్తుత, మాజీ పాలకుల కంటే వారి భార్యలు, మాజీ భార్యలే ధనవంతులుగా తేలారు. నేతల సతీమణుల ఖాతాల్లో నగదుతో పాటు వారి పేరిటే ఆస్తులూ ఎక్కువగా ఉన్నట్టు ఎన్నికల కమిషన్‌కు సమర్పించిన అఫిడ్‌విట్ వివరాల ద్వారా వెల్లడయ్యింది. తన పేరుతో కనీసం ఒక్కపైసా పెట్టుబడి లేదన్న పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్.. రూ.2లక్షలు విలువ చేసే నాలుగు మేకలు ఉన్నాయని చెప్పుకున్నారు. నాలుగు మేకలతోపాటు వారసత్వంగా లభించిన మరో ఆరు స్థిరాస్తులు, బ్యాంకు ఖాతాలో 60 మిలియన్ల పాక్ కరెన్సీ, విదేశీ నగదు ఖాతాల్లో 329,196 అమెరికన్ డాలర్లు, 518 బ్రిటన్ పౌండ్లు ఉన్నట్లు ఇమ్రాన్ ఖాన్ పేర్కొన్నారు. అయితే, ఈ మాజీ స్టార్ క్రికెటర్ పేరు మీద ఒక్కటంటే ఒక్క వాహనం కూడా లేదట. విదేశాల్లోనూ ఆస్తులేవీ లేవట. కానీ, ఇమ్రాన్ ప్రస్తుత భార్య బుష్రా బీబీ ఖాతాలో మాత్రం 142.11 మిలియన్ల పాక్ కరెన్సీ, నాలుగు స్థిరాస్తులు ఉన్నట్లు చెప్పుకున్నారు. అంటే పాపం ఇమ్రాన్.. తన మూడో భార్య కంటే పేదవారన్నమాట.

Woman : ట్రీట్మెంట్ సమయంలో మహిళకు డాక్టర్ ముద్దులు..పెట్టా కానీ తప్పేముందన్న డాక్టర్!

ప్రస్తుత ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ దగ్గర కూడా ఆయన మొదటి భార్య బేగం నుస్రత్ కంటే తక్కువ డబ్బులున్నాయట. పీఎం షరీఫ్ మొదటి భార్య ఖాతాలో 230.29 మిలియన్ల నగదు, తొమ్మిది వ్యవసాయ సంబంధిత ఆస్తులున్నాయి. లాహోర్, హజారాలో రెండు ఇళ్లు, పలు సంస్థల్లో పెట్టుబడులూ ఆమె పేరుతో ఉన్నాయి. కానీ నుస్రత్ కు సొంత వాహనం లేదు. మనీ ల్యాండరింగ్ కు పాల్పడినట్లు ఆమెపై గతేడాది అభియోగాలు నమోదయ్యాయి. షెహబాజ్ షరీఫ్ రెండో భార్య తెహ్మీనా దుర్రానీ ఖాతాలో చాలా కాలం నుంచి 5.76 మిలియన్ల పీకేఆర్‌లు నిల్వ ఉన్నాయి. ప్రధాని షెహబాజ్‌ బ్యాంకు ఖాతాలో 104.21 మిలియన్ల పాక్‌ కరెన్సీ ఉండగా.. రూ.141.78 మిలియన్ల అప్పులున్నాయి. లాహోర్, షైఖ్‌పుర్‌లో వ్యవసాయ భూములు, ముర్రే, లాహోర్‌లో ఒక్కో ఇల్లు, లండన్‌లో రూ.137.43 మిలియన్ల ఖరీదు భవంతి ఉన్నట్లు ప్రకటించిన ప్రధాని.. తన పేరుతో రెండు వాహనాలు ఉన్నట్టు చెప్పి నిజాయితీ చాటుకున్నారు
Published by:Venkaiah Naidu
First published:

Tags: Pakistan, WOMAN

తదుపరి వార్తలు