Home /News /international /

Narrowest City: ప్రపంచంలోనే అత్యంత ఇరుకైన నగరం.. దాని వెడల్పు ఎంతో తెలిస్తే షాక్ అవుతారు..!

Narrowest City: ప్రపంచంలోనే అత్యంత ఇరుకైన నగరం.. దాని వెడల్పు ఎంతో తెలిస్తే షాక్ అవుతారు..!

ప్రపంచంలోనే అత్యంత ఇరుకైన నగరం ఎక్కడ ఉందో తెలుసా..? ఎత్తయిన పర్వతాలు.. మధ్యలో పారే నీరు.. అందులోనే ఒక భారీ సిటీ నిర్మించడం ఎక్కడైనా చూశారా? అదెలా సాధ్యం అని అనుకోకండి. చైనీయులు వందల, వేల ఎకరాలు అవసరం లేకుండానే.. పర్వతాలకు, నది ప్రవాహానికి మధ్య ఏకంగా ఒక నగరాన్నే నిర్మించారు. వివరాలు తెలుసుకోండి..

ఇంకా చదవండి ...
ప్రపంచంలోనే అత్యంత ఇరుకైన నగరం ఎక్కడ ఉందో తెలుసా..? ఎత్తయిన పర్వతాలు.. మధ్యలో పారే నీరు.. అందులోనే ఒక భారీ సిటీ నిర్మించడం ఎక్కడైనా చూశారా? అదెలా సాధ్యం అని అనుకోకండి. చైనీయులు వందల, వేల ఎకరాలు అవసరం లేకుండానే.. పర్వతాలకు, నది ప్రవాహానికి మధ్య ఏకంగా ఒక నగరాన్నే నిర్మించారు. యాంజిన్ కౌంటీగా పిలిచే ఈ ఇరుకైన సిటీని చైనాలో నాంగ్జి అనే నది చుట్టూ నిర్మించారు. ప్రపంచంలోనే అత్యంత ఇరుకైన నగరంగా దీన్ని పరిగణిస్తుండటంలో ఎలాంటి ఆశ్చర్యం లేదు. ఎందుకంటే దీని వెడల్పు గురించి తెలుసుకుంటే ఎవరైనా ఆశ్చర్య పోవాల్సిందే! వివరాల్లోకి వెళితే.. యాంజిన్ కౌంటీని యునాన్ ప్రావిన్స్ లోని నాంగ్జి అనే నది వెంబడి ఇరువైపులా నిర్మించారు. ఈ ఇరుకైన నగరంలో ఎత్తయన భవనాలు నిర్మించడం విశేషం. ఈ నగరం ఒక ప్రదేశం వద్ద 30 మీటర్ల వెడల్పు మాత్రమే ఉంటుంది. దీన్ని అత్యంత ఇరుకైన భాగమని పిలుస్తారు. ఇక విశాలమైన భాగం వెడల్పు కేవలం 300 మీటర్లు మాత్రమే!

ఈ నగరానికి ఇరువైపులా ఓ ప్రధాన రహదారి ఉంటుంది. నగరవాసులు ప్రయాణాలు చేయాలంటే ఆ ఒక్క రహదారే దిక్కు. ఈ సిటీలో ఎక్కువగా వంతెనలు కూడా నిర్మించకపోవడం విశేషం. దీంతో బయట వ్యక్తులు ఆ నగరం లోకి వెళ్లాలంటే పెద్ద సాహసమే అని చెప్పాలి. తమాషా ఏంటంటే.. ఈ ఇరుకైన నగరంలో భూముల ధర చాలా ఎక్కువగా ఉంటుందట. ఈ నగరంలోని చాలా ఇళ్లను నది ఒడ్డున నిర్మించారు. అయితే నదిలోని నీటి మట్టం పెరిగినప్పుడు అపార్ట్‌మెంట్లలోకి నీళ్లు రాకుండా ఒక టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు. స‌న్న‌ని పిల్ల‌ర్స్‌ను ఉపయోగించే ఇళ్లను చాలా ఎత్తులో కట్టుకున్నారు. దీనివల్ల వరద కారణంగా నీటి మట్టం పెరిగినా.. నీరు ఇంట్లోకి రాదు. ప్రస్తుతం ఈ ఇరుకైన నగరం సంబంధించి ఓ డ్రోన్-షాట్ వీడియో చైనా సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతోంది.

Read Also: స్నేహితుడి భుజాలపై ఎక్కి పెళ్లి మండపానికి వెళ్తున్న వరుడు.. ట్రోల్ చేస్తున్న నెటిజన్లు.. వీడియో వైరల్..

చైనాలో కావాల్సినంత ఖాళీ స్థలాలున్నా.. ఇంత ఇరుకైన నగరంలో నివసించవలసిన అవసరం ఏముందని చాలామంది నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. అయితే ఇక్కడ ప్రజలు వంద సంవత్సరాల క్రితం నుంచే నివసిస్తున్నారట. వారంతా ఈ నగరాన్ని వదిలి వెళ్లరట. ఏది ఏమైనా కొండ ప్రాంతంలో నిర్మించిన ఈ సిటీలో మౌలిక సదుపాయాలు కల్పించడం కూడా ఒక సవాలే. అందుకే ఏమో ఇప్పటికీ ఈ నగరం అంతగా అభివృద్ధి చెందలేదు.
Published by:Veera Babu
First published:

Tags: China, International news

తదుపరి వార్తలు