HAVANA EXPLOSION 22 PEOPLE KILLED AND 74 TREATED IN HOSPITAL AFTER HOTEL BLAST IN CUBA SK
Cuba Blast: ఫైవ్‌స్టార్ హోటల్లో భారీ పేలుడు.. 22 మంది మృతి.. అసలేం జరిగింది?
దెబ్బతిన్నహోటల్ భవనం
Cuba Blast: కొందరు హోటల్ భవనంలోనే మరణించారు. మరికొందరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు. ఇప్పటి వరకు మొత్తం 22 మంది మరణించారని క్యూబా అధికారులు పేర్కొన్నారు
క్యూబాలో భారీ పేలుడు (Cuba Blast) సంభవించింది. రాజధాని హవానాలోని ఓ ఫైవ్ స్టార్ హోటల్లో శుక్రవారం భీకరమైన పేలుడు (Havana Hotel Blast) జరిగింది. ఈ ఘటనలో ఇప్పటి వరకు 22 మంది మరణించారు. దాదాపు వంద మంది గాయపడ్డారు. వీరిలో 75 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. హవానాలోని సరటోగా అనే ఫైవ్ స్టార్ హోటల్లో ఈ ఘటన జరిగింది. గ్యాస్ లీకేజీ వల్ల పేలుడు సంభవించిందని ప్రాథమిక విచారణలో తేలింది. పెద్ద శబ్ధంతో పేలుడు జరగడంతో బాంబు పేలుళ్లు జరిగాయని అందరూ భావించారు. హవానా ప్రజలు టెన్షన్ పెట్టారు. ఇంత పెద్ద ఘటన ఎలా జరిగింది? ఉగ్రవాదులు దాడి చేశారా? అని ఆందోళన చెందారు. కానీ ఇది ఉగ్రవాద చర్య కాదని... హోటల్లో గ్యాస్ లీక్ అవడం వల్లే పేలుడు జరిగిందని క్యూబా అధ్యక్షుడు మగ్యుల్ డియాజ్ కెనెల్ కార్యాలయం వెల్లడించింది.
పేలుడు ధాటికి హోటల్ భవనం కుప్పకూలిపోయిది. గోడలు మొత్తం ధ్వంసమయ్యాయి. ఏ పక్క చూసినా బయటి గోడలు లేవు. లోపలి వైపు మాత్రమే కనిపిస్తోంది. పేలుడు సమయంలో పెద్ద శబ్ధం వినిపిచిందని స్థానికులు తెలిపారు. బయటకు వచ్చిచూస్తే.. హోటల్ భవనం దెబ్బతిందని.. దుమ్ము దూళి భారీ ఎత్తున ఆకాశంలో కమ్ముకుందని పేర్కొన్నారు. ఈ ఘటనలో హోటల్ ముందున్న పలుకార్లు కూడా ధ్వంసమయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే రెస్క్యూ బృందాలు, అంబులెన్స్‌లు ఘటనా స్థలానికి వెళ్లాయి. భవన శిథిలాను పక్కకు జరుపుతూ లోపలికి వెళ్లారు. అక్కడ చిక్కున్న వారిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. కొందరు హోటల్ భవనంలోనే మరణించారు. మరికొందరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు. ఇప్పటి వరకు మొత్తం 22 మంది మరణించారని క్యూబా అధికారులు పేర్కొన్నారు. శిథిలాల్లో మరికొందరు చిక్కుకొని ఉండే అవకాశం ఉండడంతో.. వారి కోసం గాలిస్తున్నారు.
ప్రమాద సమయంలో గెస్ట్‌లు ఎవరూ హోటల్లో లేరు.కేవలం సిబ్బంది మాత్రమే ఉన్నారు. మరణించిన వారంతా హోటల్ సిబ్బందేనని యాజమాన్యం తెలిపింది. ఒకవేళ హోటల్లో గెస్ట్‌లు ఉండి ఉంటే.. ప్రాణనష్టం ఇంకా ఎక్కువగా జరిగి ఉండేదని అధికారులు పేర్కొన్నారు. పేలుడi జరిగిన కాసేపటికే.. అధ్యక్షుడు మిగ్యుల్ డియాజ్ కనెల్ సంఘటనా స్థలానికి వెళ్లి పరిస్థితిని సమీక్షించారు.
ప్రధాని మాన్యుయెల్ మర్రెరో క్రూజ్ కూడా ఆయన వెంట ఉన్నారు.
🇨🇺#UltimaHora Hace unos minutos hubo una explosión muy fuerte en la Habana Vieja en el hotel Saratoga cerca del Capitolio. Ambulancias y despliegue policial en el area. pic.twitter.com/WdtsOVrFZT
కాగా, పేలుడులో దెబ్బతిన్న భవనం 19వ శతాబ్దానికి చెందినది. ఈ భవనంలో 2005లో హెటల్ సరటోగాను ప్రారంభించారు. ఇది విలాసవంతమైన ఫైవ్ స్టార్ హెటల్. ఇందులో రెండు బార్లు, రెండు రెస్టారెంట్లు, ఒక స్విమ్మింగ్ పూల్ ఉన్నాయి. ఈ హోటల్‌కు సమీపంలోని కాన్సెప్షన్ అరేనల్ స్కూల్ కూడా ఉంది. పేలుడు జరిగిన వెంటనే.. స్కూల్‌ను ఖాళీ చేయించారు. ఐతే అప్పటికే ముగ్గురు చిన్నారులు గాయపడ్డారని అధికారులు చెప్పారు. వారికి ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నామని పేర్కొన్నారు. గ్యాస్ ఎలా లీక్ అయిందనే దానిపై దర్యాప్తు జరుగుతోందని.. నిర్వాహకులపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
Published by:Shiva Kumar Addula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.